చిరంజీవికే గురి పెట్టిన మారుతి!
దర్శకుడిగా మారుతి ఎలా ఎదిగాడు? అన్నది చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి తనని తాను ప్రూవ్ చేసుకున్నారు.;
దర్శకుడిగా మారుతి ఎలా ఎదిగాడు? అన్నది చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి తనని తాను ప్రూవ్ చేసుకున్నారు. తన ట్యాలెంట్ ను ప్రూవ్ చేసుకోవడం కోసం చేయాల్సిన అన్నిరకాల ప్రయత్నాలు చేసి సక్సెస్ అయిన ఓ ప్రతిభావంతుడు. `ఈరోజుల్లో` ,` బస్ స్టాప్`, `భలే భలే మగాడివోయ్` లాంటి సక్సెస్ పుల్ చిత్రాల తర్వాత మారుతి ఏ రేంజ్ లో ఫేమస్ అయ్యారో తెలిసిందే. దర్శకుడిగా స్టార్ హీరోలకే ప్రమోట్ అయ్యారు. అతడి ఎదుగుదల, ప్రతిభ చూసి సాక్షాత్తు మెగాస్టార్ చిరంజీవే తనన డైరెక్ట్ చేయ్ అంటూ అవకాశం కల్పించారు.
అంత పెద్ద స్టార్ పిలిచి అవకాశం ఇచ్చారంటే? మారుతి ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో సక్సస్ అయ్యాడు? అన్నది అద్దం పడుతుంది. ఈ విషయాన్ని మారుతీ కూడా ఎంతో బాధ్యతగా తీసుకున్నారు. అన్నయ్యతో పనిచేస్తే అద్భుతమైన సినిమానే అందించాలని మెగాస్టార్ మాటతోనే ఫిక్స్ అయ్యారు. చిరంజీవి కి ఇచ్చి హిట్ ఇండస్ట్రీలో చిర స్థాయిగా నిలిచిపోవాలని భావించాడు. కానీ తాను కట్టుకున్న కోటను `ది రాజాసాబ్` అనే ఫలితం ఒక్క సారిగా కూల్చేసింది అన్నది అంతే వాస్తవం. ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కించిన రాజాసాబ్ ఎలాంటి ఫలితాలు సాధించిందో తెలిసిందే. కానీ రాజాసాబ్ వైఫల్యం మారుతి గమనాన్నే మార్చినట్లు ప్రచారం జరుగుతోంది.
ఇకపై మారుతి ఎలాంటి సినిమాలు చేస్తారు? అన్నది తర్వాత సంగతి. కానీ రాజాసాబ్ గనుక హిట్ అయితే మారుతి కెరీర్ దర్శకుడిగా మరో లెవల్లో ఉండేది? అన్నది అంతే వాస్తవం. గతంలో చేసిన ప్రామిస్ సహా తాజా విజయంతో మెగాస్టార్ పిలిచిమరీ అవకాశం ఇచ్చేవారు. ప్రస్తుతం చిరంజీవి సీనియర్ డైరెక్టర్ల కంటే? సక్సెస్ ట్రెండింగ్ లో ఉన్న డైరెక్టర్లనే ఫాలో అవుతున్నారు. కొత్తగా ఎవరెవరు సక్సెస్ అవుతున్నారు? వారి సామర్ధ్యాలు అన్నింటిని విశ్లేషించుకుని అవకాశాలు కల్పిస్తున్నారు. మేకర్ పై నమ్మకం కలిగిందంటే? చిరంజీవి మరో మాట లేకుండా కమిట్ అవుతున్నారు.
మరి మారుతి తాజా పరిస్థితుల నేపథ్యంలో అన్నయ్యతో ఛాన్స్ ఉంటుందా? ఉండదా? అన్ని చూడాలి. కానీ మారుతి మాత్రం చిరంజీవితో ఓ గొప్ప సినిమా తీయాలని కలలు కంటున్నారు. అన్నయ్యను డైరెక్ట్ చేయడం అన్నది ఓ డ్రీమ్ గా భావిస్తున్నారు. కుదిరితే చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున లాంటి సీనియర్స్ స్టార్స్ అందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చి భారీ మల్టీస్టారర్ చేయాలన్నది మారుతి మైండ్ లో ఉంది. ఓ సందర్భంలో ఈ విషయంపై ఓపెన్ గా స్పందించారు కూడా. మారుతి ఇలాంటి గొప్ప అవకాశం అందుకోవాలంటే బౌన్స్ బ్యాక్ అవ్వాలి. అప్పుడే తాను అనుకున్నవన్నీ చేయగలరు.