'ఇంకా ఏం అనుకోలేదు'.. టైటిల్ తోనే ఫుల్ బజ్!
సాధారణంగా ఒక సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ అంటే పోస్టర్ విడుదల చేయడం లేదా చిన్న వీడియోతో చేస్తుంటారు మేకర్స్.;
కొన్ని సినిమాలకు టైటిల్ అనౌన్స్ చేసి వెంటనే ఆడియన్స్ లో బజ్ క్రియేట్ అవుతుంది. తాజాగా ప్రకటించిన ఇంకా ఏం అనుకోలేదు అనే సినిమా కూడా అలాంటి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ గా మారింది. ఆ మూవీ టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో విడుదలై సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఫన్నీ డైలాగులు, మీమ్ స్టైల్ హ్యూమర్, పాత రోజులను గుర్తు చేసే ఎలిమెంట్స్ తో రూపొందించిన వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
సాధారణంగా ఒక సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ అంటే పోస్టర్ విడుదల చేయడం లేదా చిన్న వీడియోతో చేస్తుంటారు మేకర్స్. అయితే ఇంకా ఏం అనుకోలేదు మేకర్స్.. ఒక ఎంటర్టైన్మెంట్ ప్యాక్డ్ వీడియో తీసుకొచ్చారు. మీమ్స్ తో నిండిన ఫన్నీ సీన్స్, కామెడీ డైలాగ్స్, పాత ఈటీవీ ప్రోగ్రామ్స్ ను గుర్తు చేసే థీమ్ వంటి అంశాలు వీడియోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ముఖ్యంగా స్వయంగా తమ మీదే సెటైర్లు వేసుకుంటూ చేసిన సీన్స్ ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతున్నాయి. ఆ ప్రాజెక్ట్ ను ఈటీవీ విన్ ఒరిజినల్ గా వంశీ నందిపాటి నిర్మిస్తుండగా.. ప్రేక్షకుల అభిరుచులపై ఆయనకు మంచి అవగాహన ఉందని క్లియర్ గా అర్థమవుతుంది. ఆడియన్స్ కు ఏం నచ్చుతుందో అర్థం చేసుకుని అదే తరహాలో ప్రమోషన్స్ ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
అందుకే ఇప్పుడు టైటిల్ అనౌన్స్మెంట్ సాధారణంగా కాకుండా వినూత్నంగా చేశారు. అంతేకాదు.. ఫస్ట్ గ్లింప్స్ తోనే మూవీపై సూపర్ బజ్ క్రియేట్ చేశారు. అయితే ఇంకా ఏం అనుకోలేదు బ్రోమాంటిక్ కామెడీ మూవీగా రూపొందుతుందని తెలుస్తోంది. ఫ్రెండ్ షిప్, ఫన్నీ మూమెంట్స్, అల్లరి సన్నివేశాలు ప్రధానంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. యూత్ ను ఆకట్టుకునే విధంగా సినిమా కథను రెడీ చేసినట్లు సమాచారం.
అదే సమయంలో సినిమాలో క్యాస్టింగ్ ను మాత్రం సీక్రెట్ గా ఉంచారు మేకర్స్. కానీ స్టార్ నటీనటులు యాక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్నా.. అధికారిక ప్రకటన వచ్చాక ఆ విషయంలో క్లారిటీ రానుంది. సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ జోడీ ప్రణయ్ వల్లూరిపల్లి, గిరి పెమ్మసాని సంయుక్తంగా తెరకెక్కిస్తుండగా.. కొత్త ఆలోచనలు, వినూత్న కథనంతో ప్రేక్షకులకు భిన్నమైన అనుభూతిని అందించనున్నారని తెలుస్తోంది.
ఇక మూవీకి సంగీతాన్ని సింజిత్ ఎర్రమిల్లి అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ రేహాన్ షేక్ నిర్వహిస్తున్నారు. విజువల్స్ పరంగా కూడా సినిమా అందరినీ ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం. అయితే త్వరలోనే మరిన్ని అప్డేట్స్ రానుండగా.. ఇంకా ఏం అనుకోలేదు చిత్రం 2026 సెప్టెంబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది. మరి ఎంటర్టైన్మెంట్ తో నిండిన బ్రోమాంటిక్ కామెడీ మూవీ.. ఆడియన్స్ ను ఎంతవరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.