రెండు స‌ర్దార్ ల‌ను మించి మూడో స‌ర్దార్ !

ప్ర‌స్తుతం ఈ సినిమాకు కొన‌సాగింపుగా `స‌ర్దార్ 2` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. మిత్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న సినిమాపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి.;

Update: 2026-03-20 00:30 GMT

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ కెరీర్‌లో అత్యంత విజయవంతమైన చిత్రాల్లో `సర్దార్` ఒకటి. గూఢచారి నేపథ్యంలో సాగే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించడమే కాక‌ కార్తీ నటనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించిన చిత్ర‌మది.

ప్ర‌స్తుతం ఈ సినిమాకు కొన‌సాగింపుగా `స‌ర్దార్ 2` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. మిత్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న సినిమాపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ఇప్ప‌టికే సినిమా రిలీజ్ కావాలి. కానీ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో జాప్యం కార‌ణంగా విడుద‌ల ఆల‌స్య‌మ‌వుతుంది. ప్ర‌స్తుతం కార్తీ హీరోగా తాజా చిత్రం `మార్షల్` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

తాజాగా ఈ సినిమా వివ‌రాలు లీక్ అవుతున్నాయి. `మార్ష‌ల్` కూడా స్పై చిత్ర‌మేన‌ని అంటున్నారు. `స‌ర్దార్` రెండు భాగాల‌ను మించి మార్ష‌ల్ ఉండబోతోందని సినీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఈ సినిమా కాన్సెప్ట్ విన్నవారంతా? ఇది 'సర్దార్ ను మించిన ట్విస్ట్ లో కథ లో ఉన్న‌ట్లు అభిప్రాయపడుతున్నారు.`మార్షల్` గూఢచారి నేపథ్యంలోనే సాగుతున్న‌ప్ప‌టికీ? ఇందులో యాక్షన్ లెవెల్స్ మిషన్ తీవ్రత సన్నివేశాలు స్ట్రాంగ్ గా ఉంటాయం టున్నారు. `సర్దార్` లో కార్తీ తండ్రి, కొడుకుగా రెండు భిన్నమైన పాత్రల్లో అలరించారు. కానీ `మార్షల్` లో ఆయన పోషించే పాత్రలు అంతకు మించిన డెప్త్ కలిగి ఉంటాయ‌ని లీకులందుతున్నాయి.

ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో సాగే పోరాట సన్నివేశాలు హాలీవుడ్ స్థాయిలో ఉంటాయని అంటున్నారు. స్పై కాన్సెప్ట్ అంటే కొత్త‌గా ఏమీ ఉండ‌దు. శ‌త్రు దేశంపై మిష‌న్స్ నేప‌థ్యంలోనే సాగుతుంటాయి. అయితే ట్రీట్ మెంట్ అన్న‌ది ముఖ్యం. ఈ సినిమా కాన్సెప్ట్ ప్రధానంగా దేశ రక్షణ కోసం సరిహద్దులు దాటి వెళ్లే ఒక రహస్య సైనికుడి ప్రయాణం చుట్టూ తిరుగుతుందిట‌. ఇందులో టెక్నాలజీ , ఇంటెలిజెన్స్ అంశాలను దర్శకుడు నలన్ కుమార స్వామి చాలా కొత్తగా ప్ర‌జెంట్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. సర్దార్ లో కేవలం వాటర్ మాఫియా గురించి చెబితే? మార్షల్ లో అంతర్జాతీయ స్థాయిలో జరిగే ఒక భారీ కుట్రను ఛేదించే హీరోగా కార్తీ కనిపిస్తారని సమాచారం. ఈ క్రమంలో వచ్చే ట్విస్ట్‌లు ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెడతాయని యూనిట్ వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి.

ఈ సినిమా కోసం కార్తీ కూడా నాలుగింత‌లు ఎక్కువ శ్రమ ప‌డుతున్నాడుట‌. `సర్దార్` ను మించిన మేకోవ‌ర్ కార్తీ రోల్ లో హైలైట్ అవుతుందంటున్నారు. భారీ యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం విదేశీ స్టంట్ మాస్టర్ల పర్యవేక్షణలో కార్తీ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడుట‌. సంతోష్ నారాయణన్ సంగీతం ఈ స్పై థ్రిల్లర్‌కు ప్రధాన బలంగా నిలిచే అవ‌కాశం ఉంది. మొత్తంగా కాన్సెప్ట్ పరంగా , మేకింగ్ పరంగా కార్తీ కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచిపోతుందని ట్రేడ్ విశ్లేష కులు అంచనా వేస్తున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.

Tags:    

Similar News