• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ‘మార్కో’ టీజర్: మోస్ట్...

‘మార్కో’ టీజర్: మోస్ట్ వైలెంట్ మ్యాన్ గా ‘జనతా గ్యారేజ్’ యాక్టర్!

| 'మార్కో' అనేది ఒక రివేంజ్ స్టోరీ అని టీజర్ తోనే క్లారిటీ వచ్చింది.

By - Tupaki Desk
Update: 2024-11-04 07:32 GMT

‘జనతా గ్యారేజ్’, ‘భాగమతి’, ‘ఖిలాడీ’, ‘యశోద’ వంటి చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న మలయాళీ నటుడు ఉన్ని ముకుందన్. ఓవైపు హీరోగా నటిస్తూనే, మరోవైపు అవకాశం వచ్చినప్పుడల్లా డిఫరెంట్ రోల్స్ తో ఆకట్టుకుంటున్నాడు. ఉన్ని హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ పాన్ ఇండియ‌న్ యాక్షన్ మూవీ ''మార్కో''. హనీఫ్ అదేని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ టీజర్ ను ఇటీవలే రిలీజ్ చేసారు. తాజాగా తెలుగు టీజర్ ను సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ఆవిష్కరించి, చిత్ర బృందానికి విషెస్ అందజేసింది.

''జీవితంలో మనల్ని హాంట్ చేసే విషయం ఏంటో తెలుసా?.. మనకు ఎంతో ఇష్టమైన వాళ్ళని మన కళ్ళ ముందే చిత్ర హింసలు పెట్టి చంపడం'' అనే వాయిస్ ఓవర్ తో 'మార్కో' టీజర్ ప్రారంభం అవుతుంది. ఇందులో ఉన్ని ముకుందన్ ను మోస్ట్ వైలెంట్ మ్యాన్ అవతార్ లో ప్రెజెంట్ చేసారు. ఉన్ని తన పాత్ర కోసం సరికొత్తగా మేకోవర్ అయ్యాడు. ఇంతకముందెన్నడూ చూడని స్టన్నింగ్ లుక్ లో చాలా స్టైలిష్ గా కనిపించి సర్ప్రైజ్ చేసాడు.

'మార్కో' అనేది ఒక రివేంజ్ స్టోరీ అని టీజర్ తోనే క్లారిటీ వచ్చింది. కళ్ల ముందే తన వాళ్ళని చంపేసిన శత్రువులను వెతికి పట్టుకొని, వారి మీద ప్రతీకారం తీర్చుకోడానికి మార్కో అనే వ్యక్తి సాగించే అన్వేషణే ఈ సినిమా కథ అని తెలుస్తోంది. ఇందులో నెక్స్ట్ లెవల్ యాక్షన్ ను చూడబోతున్నామని 70 సెకండ్ల వీడియోతోనే మేకర్స్ హింట్ ఇచ్చారు. ఫైట్స్ చూస్తుంటే ఈ మధ్య వచ్చిన 'కిల్' సినిమా గుర్తుకు రాకమానదు. దీని కోసం కొన్ని హాలీవుడ్ సినిమాలను కూడా ప్రేరణగా తీసుకున్నారేమో అనిపిస్తుంది. 'యానిమల్' స్టంట్ మాస్టర్ కలై కింగ్సన్ ఈ చిత్రంలో యాక్షన్ కొరియోగ్రఫీ చేసినట్లు తెలుస్తోంది.

డైరెక్టర్ హనీఫ్ గతంలో 'ది గ్రేట్ ఫాదర్', 'అబ్రహమింటే సంతతికల్', 'మైఖేల్', 'రామచంద్ర బాస్ & కో' వంటి చిత్రాలను తెరకెక్కించారు. 'మైఖేల్' లో ఉన్నిముకుందన్ పోషించిన నెగెటివ్ రోల్ ''మార్కో'' పేరునే టైటిల్ గా పెట్టి ఈ సినిమా రూపొందించారు. ఉన్నిని పవర్ ఫుల్ యాక్షన్ రోల్ లో చూపించారు. అయితే ముకుందన్ ను ఇప్పటివరకూ మనం ఎక్కువగా సాఫ్ట్ క్యారెక్టర్స్ లోనే చూశాం. కానీ ఇప్పుడు ఒక్కసారిగా మోస్ట్ వైలెంట్ యాక్షన్ రోల్ లో యాక్సెప్ట్ చేస్తారా? అలాంటి పాత్ర అతనికి సూట్ అవుతుందా లేదా? అనేది చూడాలి.

ఇప్పటికైతే ''మార్కో'' టీజర్ బాగానే ఉంది. దీనికి యాక్షన్ ప్రియుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఎలివేషన్ సీన్స్, యాక్షన్ సన్నివేశాలు, కెమెరామెన్ చంద్రు సెల్వరాజ్ విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. 'సలార్' ఫేమ్ రవి బస్రూర్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈ చిత్రంలో యుక్తి తరేజా, అన్సన్ పాల్, కబీర్ దుహన్ సింగ్, జగదీశ్, సిద్ధిక్, రియాజ్ ఖాన్, శ్రీజిత్ రవి తదితరులు ఇతర పాత్రలు పోషించారు.

'మార్కో' చిత్రాన్ని క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్, ఉన్ని ముకుందన్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై షరీఫ్ మహ్మద్ అబ్దుల్ గదాఫ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాని 2024 క్రిస్మస్ స్పెషల్ గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఉన్నికి ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో వేచి చూడాలి.

Full View
Tags:    
  • Unnimukundan 
  • Marco 
  • Teaser 
  • Shareefmuhammed 
  • Haneefadeni 
  • Ravibasrur 

Similar News

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

Copyright @2026

Powered by Blink CMS