2016లో న‌టి మెడిసిన్ చ‌దివేప్పుడు ఇలా ఉండేది!

అందాల రాణి మానుషి చిల్లర్ జీవిత‌ ప్రయాణంలో 2016 నుండి ఇప్పటివరకు (2026) చాలా మార్పులు వచ్చాయి.;

Update: 2026-01-19 04:31 GMT

అందాల రాణి మానుషి చిల్లర్ జీవిత‌ ప్రయాణంలో 2016 నుండి ఇప్పటివరకు (2026) చాలా మార్పులు వచ్చాయి. ఒక సాధారణ మెడికల్ స్టూడెంట్ నుండి అంతర్జాతీయ స్థాయి సెలబ్రిటీగా మానుషి ఎదిగారు. గ్లామ‌ర్ రంగంలో ఆశించినంత పెద్ద స్టార్ డ‌మ్ రాక‌పోయినా కానీ, త‌న‌కంటూ కొన్ని అవ‌కాశాలున్నాయ‌ని నిరూపిస్తున్నారు. నటిగా నిరూపించుకునేందుకు మానుషి ఎప్పుడూ సిద్ధంగా ఉంది.




 


2016 లో మానుషి మెడికల్ స్టూడెంట్. అప్పట్లో హర్యానాలోని సోనిపట్ -భ‌గ‌త్ పూల్ సింగ్ మెడిక‌ల్ కాలేజ్ లో ఎంబిబిఎస్ చదువుతున్న విద్యార్థిని. ఒక సాదాసీదా అమ్మాయిలా ల్యాబ్ కోటు వేసుకుని, కళ్లద్దాలతో తన చదువుపై దృష్టి పెట్టేవారట‌. 2016 చివరలో `క్యాంపస్ ప్రిన్సెస్` పోటీల్లో పాల్గొనడం ద్వారా గ్లామర్ రంగంలోకి తొలి అడుగు వేశారు.




 


ఆరోజు నిజంగా త‌న గేమ్ ఛేంజింగ్ డే. అప్పటికి మానుషికి ఫ్యాషన్ ప్రపంచం, మేకప్, మీడియా వెలుగులు పెద్దగా తెలియవు. ఇన్‌స్టాలో కూడా కేవలం సరదా కోసం చేరారు. ప‌రిస్థితులు అంతా వేగంగా మారిపోయాయి. 2017లో `మిస్ వరల్డ్` కిరీటాన్ని గెలుచుకుని భారతదేశానికి గర్వకారణంగా నిలిచారు. ఆ తర్వాత ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది.




 


ఆ త‌ర్వాత ఖాన్ ల స‌ర‌స‌న న‌టించాల‌నే త‌న ఆస‌క్తిని బ‌హిరంగంగానే వ్య‌క్తం చేసింది. కానీ చివ‌రికి 2022లో అక్ష‌య్ కుమార్ స‌ర‌స‌న‌ `సామ్రాట్ పృథ్వీరాజ్` సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల బడే మియాన్ చోటే మియాన్, తేహ్రాన్, మాలిక్ (రాజ్ కుమార్ రావు క‌థానాయ‌కుడు) వంటి చిత్రాల్లో నటించారు. ఇక మానుషి ఒక ఫ్యాషన్ ఐకాన్ గా ఇప్పుడు అంతర్జాతీయ బ్రాండ్లకు అంబాసిడర్‌గా, కేన్స్ వంటి ప్రతిష్టాత్మక వేదికలపై మెరిసే గ్లామర్ ఐకాన్‌గా మారారు.




 


2016లో పక్కింటి అమ్మాయిలా కనిపించిన మానుషి, ఇప్పుడు చాలా ఫిట్‌గా, స్టైలిష్‌గా, మ‌రింత‌ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారు. కానీ త‌న టీనేజీలో క్యూట్ లుక్స్ తో మానుషి కుర్ర‌కారు హృద‌యాల‌ను దోచేసింద‌ని చెప్పాలి.




 


తాను న్యూఢిల్లీలోని AIIMSలో మిస్ ఇండియా స్కౌట్ చేసిన తర్వాత, ఒక సంవత్సరం హన్నా మోంటానా కాలేజీకి వెళుతూనే, అప్ప‌ట్లో కొన్ని షూట్‌లకు వెళ్లేదానిని అని తాజాగా ఇన్ స్టా పోస్ట్ లో తెలిపారు మానుషి. నా కాలేజ్ తరగతుల తర్వాత శనివారం ఎంట్రీ ఫారమ్ కోసం నా మొదటి ఫోటోల‌ను క్లిక్ చేసాను అని తెలిపారు.

త‌న మొదటి క్లినికల్ పోస్టింగ్ జనరల్ సర్జరీ వింగ్ లో ఉండ‌గా, మా(విద్యార్థుల‌)లో ఒకరు ఆ రోజు మూర్ఛపోయారు! అని కూడా స‌ర‌దాగా తెలిపారు. మిస్ ఇండియా పోటీల కోసం అప్ప‌ట్లో ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక‌సారికే చేరాను. కానీ ఇక్కడ మనం ఒక దశాబ్దం తర్వాత కూడా ఉన్నాము!..అని మానుషి రాసారు.

మానుషి చిల్లర్ ప్రస్తుతం బాలీవుడ్ లో వ‌రుస చిత్రాల్లో న‌టిస్తున్నారు. 2024 లో `ఆపరేషన్ వాలెంటైన్`తో టాలీవుడ్ లోను అడుగుపెట్టింది. జాన్ అబ్రహం ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ `తెహ్రాన్‌`లో మానుషి ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా ఆగస్ట్ 14న థియేటర్లలోకి రానుంది. వరుణ్ ధావన్, అర్జున్ కపూర్, దిల్జిత్ దోసాంజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్ టైనర్ నో ఎంట్రీ సీక్వెల్ లో మానుషి ఒక హీరోయిన్ గా ఎంపికయ్యారు. ఇది ఈ ఏడాదిలోనే విడుదలయ్యే అవకాశం ఉంది. నిర్మాత దినేష్ విజన్ మ‌డాక్ ఫిలింస్‌లో నిర్మిస్తున్న ఒక భారీ బడ్జెట్ సినిమాకి మానుషి సంతకం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీని షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది.

Tags:    

Similar News