ఆహారం పట్ల మారిన మనీషా కోయిరాల దృక్కోణం!
నిరంతరం గ్లామర్ ఒత్తిడిని ఎదుర్కొనే నటీమణులలో మనీషా కోయిరాల ఒకరు. అయితే తాజాగా మనీషా ఆహారం, శరీరం పట్ల తన దృక్కోణంలో వచ్చిన మార్పును సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
నిరంతరం గ్లామర్ ఒత్తిడిని ఎదుర్కొనే నటీమణులలో మనీషా కోయిరాల ఒకరు. అయితే తాజాగా మనీషా ఆహారం, శరీరం పట్ల తన దృక్కోణంలో వచ్చిన మార్పును సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. గతంలో ఆహారం అంటే పరిమితులు ..దాని వల్ల కలిగే అపరాధభావన మాత్రమే ఉండేదని కానీ ఇప్పుడు అది పూర్తిగా మారిపోయిందని వెల్లడించారు. శరీరం పట్ల కఠినంగా వ్యవహరించే రోజులు పోయాయని శరీరానికి పోషణను అందించడంపై దృష్టి పెట్టానని మనీషా పేర్కొన్నారు. శరీరంతో పోరాడటం కంటే దానికి దగ్గరగా ఉండటం ...దాన్ని ఆస్వాదించడం తనకు ఎంతో ప్రశాంతతను ఇస్తోందని వెల్లడించారు.
ఈ మార్పు తన జీవనశైలిలో ..మానసిక స్థితిలో సానుకూల ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆహారపు అలవాట్ల గురించి ఓపెన్ అయ్యారు. శరీర అవసరాలను గుర్తించడం చాలా ముఖ్యమని మనీషా తెలిపారు. కడుపు నింపుకోవడం కంటే శరీరానికి ఏం కావాలి? ఎలా పోషణ అందాలి? అనే అంశాలపై శ్రద్ధ పెట్టినప్పుడే అసలైన ఆరోగ్యం లభిస్తుందని నమ్ముతున్నారు. గతంలో ఫాలో అయిన కఠినమైన ఆహార నియమాల వల్ల కలిగిన ఒత్తిడి కంటే ఇప్పుడున్న సహజమైన పద్ధతులే సంతోషాన్నిస్తున్నాయన్నారు.
ఆరోగ్యమే మహాభాగ్యమనే నానుడిని నిజం చేస్తూ మనీషా కోయిరాల జీవితంలో అనుసరిస్తున్న సానుకూల మార్పు ఆదర్శంగా నిలుస్తోంది. ఒకప్పుడు అందం, బరువు నియంత్రణే పరమావధిగా బతికిన సినీ తారలు నేడు సంపూర్ణ ఆరోగ్యం , మానసిక ప్రశాంతత వైపు అడుగులు వేయడం శుభపరిణామం. ముఖ్యంగా మనీషా అనుభవాల ద్వారా యువతకు ఇస్తున్న ఫిట్‌నెస్ ... డైట్ సందేశాలు సమాజంలో మంచి మార్పునకు నాంది పలుకుతున్నాయి.
వ్యక్తిగత జీవితంలోనూ, వృత్తిపరమైన ప్రయాణంలోనూ సరికొత్త సవాళ్లను స్వీకరిస్తూ మనీషా ముందుకు సాగుతున్నారు. వరుస ప్రాజెక్ట్‌లతో నటిగా బిజీగా ఉంటూనే తనకంటూ వ్యక్తిగత సమయాన్ని కేటాయించుకోవడం మానసిక ఉల్లాసానికి తోడ్పడుతోంది. రాబోయే రోజుల్లో తెరపై మరిన్ని వైవిధ్యమైన పాత్రలతో అలరించడానికి సిద్ధమవుతున్న మనీషా కోయిరాలా నిజ జీవితంలోనూ నిజమైన ఫైటర్‌గా నిలుస్తూ ప్రశంసలను అందు కుంటున్నారు.
అలాగే ఇటీవల మనీషా కోయిరాల పుట్టినరోజును కుటుంబ సభ్యులు .. సన్నిహితుల మధ్య ఎంతో సరదాగా జరుపుకున్నారు. ఆమె తల్లిదండ్రులు స్వయంగా ఈ వేడుకను ప్లాన్ చేయగా స్నేహితుడు ..సైక్లింగ్ పార్ట్‌నర్ సరోష్ ప్రధాన్ వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. కుటుంబంతో గడిపిన క్షణాలు మనీషాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయని ఫోటోలు చూస్తుంటే అర్థమవుతోంది. ప్రస్తుతం మనీషా కోయిరాలా అర్బాజ్ ఖాన్ నిర్మిస్తున్న `రాజ్దార్` అనే చిత్రంలో నటిస్తున్నారు.