మల్లా రెడ్డి స్పీచ్‌నా ఇది మజాకానా? 20ఏళ్ల జెన్-జి పిల్లాడు!
రాకింగ్ స్టార్ యష్ నటించిన పాన్-ఇండియా చిత్రం `టాక్సిక్` హైదరాబాద్ ప్రీ-రిలీజ్ వేడుకలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లా రెడ్డి తనదైన మాస్ శైలి ప్రసంగంతో హంగామా చేశారు.
రాకింగ్ స్టార్ యష్ నటించిన పాన్-ఇండియా చిత్రం `టాక్సిక్` హైదరాబాద్ ప్రీ-రిలీజ్ వేడుకలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లా రెడ్డి తనదైన మాస్ శైలి ప్రసంగంతో హంగామా చేశారు. మల్లా రెడ్డి కాలేజ్ గ్రౌండ్స్‌లో జరిగిన ఈ గ్రాండ్ ఈవెంట్‌లో ఆయన వేదికపైకి రాగానే ''హాయ్.. అందరికీ నమస్కారం'' అంటూ ఊపేసి.. ఈవెంట్‌కు సరికొత్త జోష్ తెచ్చారు. తమ యూనివర్సిటీ ప్రాంగణంలో యష్‌తో పాటు దేశంలోనే నంబర్ వన్ హీరోయిన్లు.. టాలెంటెడ్ చిత్రబృందం సందడి చేయడం తమ విద్యార్థులందరికీ ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
అక్కడికి తరలివచ్చిన వేలాది మంది యువతను ఉద్దేశించి మాట్లాడిన మల్లా రెడ్డి, ``మా బంగారం.. మా డైమండ్స్.. మా జెన్-జీ జనం!`` అంటూ విద్యార్థులను ఆకాశానికెత్తేశారు. ఈవెంట్ ప్రారంభంలో భారీగా తరలివచ్చిన క్రౌడ్‌ను చూసి నిర్మాత కేవీఎన్ గారు కాస్త కంగారు పడిన విషయాన్ని గుర్తుచేస్తూ.. తమ విద్యార్థుల ప్రవర్తనపై తనకు సంపూర్ణ నమ్మకం ఉందన్నారు. ``మల్లా రెడ్డి డిసిప్లిన్ అంటే డిసిప్లిన్.. మా విద్యార్థులు చాలా పర్ఫెక్ట్‌గా.. క్రమశిక్షణతో ఉంటారు`` అని గర్వంగా చాటిచెప్పారు.
ప్రసిద్ధ నిర్మాత దిల్‌రాజుతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ''మా దిల్ రాజు దిల్ బడా హై.. దిల్ వాలా హై.. దిల్ ఖులా హై.. మల్లా రెడ్డి యూనివర్సిటీ బాప్.. మా దోస్త్!" అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. అలాగే ఈ మైదానం ఎంతో పవిత్రమైనదని.. ఇక్కడికి విచ్చేసిన 75,000 మంది విద్యార్థుల వయస్సు 18 నుంచి 22-23 ఏళ్ల లోపేనని వివరించారు. ఈ `జెన్-జీ` జనరేషన్ చేతుల్లోనే ప్రపంచ భవిష్యత్తు ఉందని.. తమ క్యాంపస్ నుంచి వచ్చే ప్రతి విద్యార్థి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతలో రాణించి ప్రపంచాన్ని శాసించాలని ఆకాంక్షించారు.
తన విద్యా సంస్థల విజయపరంపరను గుర్తుచేసుకుంటూ.. భారతదేశంలోనే అత్యధిక సంఖ్యలో మెడికల్- పీజీ -ఇంజనీరింగ్ కాలేజీలను స్థాపించిన ఘనత తమదేనని మల్లా రెడ్డి స్పష్టం చేశారు. తాను కేవలం బిజినెస్‌లోనే కాకుండా సాధించిన విజయాల్లో ఇండియాలోనే `బ్లాక్‌బస్టర్` అని తనదైన ఆత్మీయ శైలిలో ప్రకటించారు. ఆయన ఆవేశపూరితమైన- మాస్ స్పీచ్‌కు కాలేజ్ ప్రాంగణమంతా విద్యార్థుల ఈలలు, కేకలతో హోరెత్తిపోయింది.
ప్రసంగం ముగిసిన అనంతరం వ్యాఖ్యాత సుమ స్పందిస్తూ.. ఈవెంట్ రన్-డౌన్ ప్రోగ్రామ్ షీట్‌లో లేనిది.. ముందస్తు ఫ్లోలో ఊహించనిది ఏదైనా ఉందంటే అది కేవలం మల్లా రెడ్డి గారి `సడన్ స్పార్క్` స్పీచ్ మాత్రమేనని నవ్వులు పూయించారు. మొత్తానికి `టాక్సిక్` వేడుకలో యష్ గ్లామర్, కేవీఎన్ విజన్‌తో పాటు మల్లా రెడ్డి ఆవేశపూరిత ప్రసంగం ప్రత్యేక ఆకర్షణగా నిలిచి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.