వారమంతా డిఫరెంట్ వర్కవుట్స్.. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ క్రేజీ ఫిట్‌నెస్ సీక్రెట్!

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఎంతో చిక్ అండ్ కంఫర్టబుల్ జిమ్ అవుట్‌ఫిట్‌లో కనిపిస్తున్నారు.

Update: 2026-10-10 17:30 GMT

బాలీవుడ్ హాట్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఫిట్‌నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ పర్‌ఫెక్ట్ షేప్‌లో ఉంటూ కుర్రకారును మైమరపించే ఈ భామ, తాజాగా తన వీక్లీ వర్కవుట్ రూటీన్‌కు సంబంధించిన పిక్స్, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. "ఎప్పుడూ జిమ్‌లోనే ఎందుకు ఉంటావు?"ఈ ప్రశ్నలకు ఆమె పాట, డ్యాన్స్‌తో ఫన్నీగా సమాధానమిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

జిమ్ వేర్ లో జాక్వెలిన్ మెరుపులు:

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఎంతో చిక్ అండ్ కంఫర్టబుల్ జిమ్ అవుట్‌ఫిట్‌లో కనిపిస్తున్నారు. వైట్ షార్ట్ స్లీవ్ అథ్లెటిక్ టీ-షర్ట్, దానికి మ్యాచింగ్‌గా సైడ్ స్ట్రైప్స్ ఉన్న వైట్ హై-వేస్టెడ్ ట్రాక్ ప్యాంట్స్ ధరించి చాలా స్టైలిష్‌గా మెరిసిపోయారు. జిమ్‌లో కేవలం వర్కవుట్స్ మాత్రమే కాకుండా ఓ పాటకు హుషారుగా డాన్స్ చేస్తూ, తన వర్కవుట్ టైమ్‌ను ఎంతగా ఎంజాయ్ చేస్తారో అభిమానులకు చూపించారు.

రోజూ ఒకే వర్కవుట్ అయితే బోర్ కొడుతుంది:

ఫిట్‌నెస్ విషయంలో జాక్వెలిన్ ఒకే రకమైన రూటీన్‌ను అస్సలు ఫాలో అవ్వరు. ప్రతిరోజూ ఒకే జిమ్ వర్కవుట్ చేస్తే బోర్ కొడుతుందని భావించే ఈ భామ, వారం మొత్తానికి సరిపోయేలా విభిన్నమైన ప్లాన్ చేసుకుంటారు. సోమవారం లోయర్ బాడీపై ఫోకస్ చేస్తూ లెగ్స్, గ్లూట్స్ స్ట్రెంగ్త్ వర్కవుట్స్ చేయగా, మంగళవారం తెల్లవారుజామునే తన ట్రైనర్, ఫ్రెండ్స్‌తో కలిసి మెరైన్ డ్రైవ్‌లో రన్నింగ్, స్ట్రెచింగ్ చేస్తూ గడిపారు.

రోజో రకం.. ఆల్ రౌండ్ ఫిట్‌నెస్:

ఇక బుధవారం ప్యాడెల్ కోర్టులో స్పోర్టిగా గడిపిన జాక్వెలిన్, గురువారం కోర్ స్ట్రెంగ్త్ కోసం పిలాటేస్ సెషన్స్ చేశారు. శుక్రవారం అప్పర్ బాడీ వర్కవుట్స్ చేయగా, వీకెండ్ రాగానే మైండ్ రిలాక్స్ అయ్యేలా శనివారం డాన్స్ క్లాస్‌కు వెళ్లారు. ఇక ఆదివారం మాత్రం ఇంటి పెంపుడు జంతువులతో ఆడుకుంటూ సరదాగా గడిపేశారు. ఈ డిఫరెంట్ రూటీన్ వల్ల శరీరం దృఢంగా మారడమే కాకుండా మైండ్ కూడా ఎప్పుడూ రిఫ్రెష్‌గా ఉంటుందని ఆమె చెబుతున్నారు.

పోల్ డాన్స్ విన్యాసాలు:

ఫిట్‌నెస్ కోసం స్ట్రెంగ్త్ ట్రైనింగ్, రన్నింగ్‌తో పాటు పోల్ ఏరియల్ వర్కవుట్స్‌తోనూ జాక్వెలిన్ తనను తాను ఫిట్‌గా ఉంచుకుంటారు. గతంలో ఆమె షేర్ చేసిన పోల్ డాన్స్ వీడియోలు ఆమెలోని అంతులేని ఫ్లెక్సిబిలిటీని, స్టామినాను నిరూపించాయి. ఇలా డైనమిక్‌గా ప్రతీరోజూ వర్కవుట్‌ను ఒక ఆటలా మార్చుకోవడం వల్లే ఆమె అంత ఫిట్‌గా ఉండగలుగుతున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇక మొత్తానికి, వర్కవుట్ అంటే కేవలం బరువులు ఎత్తడమే కాదు.. నచ్చిన రీతిలో శరీరాన్ని కదిలిస్తూ ఎంజాయ్ చేయడమే అని జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నిరూపించారు. డ్యాన్స్ నుంచి రన్నింగ్ వరకు రకరకాల వర్కవుట్స్‌తో ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టే ఆమె రొటీన్ అందరినీ ఆకట్టుకుంటోంది.

Tags:    

Similar News