మమితా బైజు టాలీవుడ్ లో మరో ఛాన్స్!
తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ య్యేందుకు సొగసరి వరుసగా పెద్ద ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెడుతున్నారు.
`ప్రేముల`తో యువత హృదయాలను కొల్లగొట్టిన అందాల భామ మమితా బైజు సౌత్ ఇండియన్ చిత్రసీమలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోతుంది. క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో, సహజమైన నటనతో అభిమానులను సంపాదిం చుకున్న యంగ్ సెన్సేషన్ టాలీవుడ్‌లో దూకుడు పెంచారు. ఇప్పటికే టాలీవుడ్‌లో విశ్వనాధ్ అండ్ సన్స్ లో నటించిన అమ్మడు తాజాగా మరో భారీ అవకాశం అందుకుందని ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది.
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుంచి రాబోతున్న ప్రతిష్టాత్మక పాన్-ఇండియా చిత్రం `జై హనుమాన్` లో మమితా బైజు కీలక పాత్రలో ఎంపికైందనే వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొని ఉండగా ఇందులో రిషబ్ శెట్టి హనుమంతుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో మమిత భాగమైతే.. అమ్మడి కెరీర్‌కు ఇది బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ కావడం ఖాయం.
అయితే టాలీవుడ్‌లో మమితా బైజు హడావుడి ఇక్కడితో ఆగిపోలేదు.
తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ య్యేందుకు సొగసరి వరుసగా పెద్ద ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెడుతున్నారు. కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి జోరుగా సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. తన పీఆర్ టీమ్ ఇక్కడా చురుకుగా పని చేస్తుందని తెలిసింది. మరోవైపు మేనేజర్లు నిర్విరామంగా కొత్త అవకాశాల వేటలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఒకవైపు మలయాళ చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు టాలీవుడ్‌లోనూ టాప్ మేకర్స్ దృష్టిని ఆకర్షిస్తోంది మమిత. `ప్రేముల` సక్సెస్ ఇచ్చిన జోరును కంటిన్యూ చేస్తూ తెలుగులోనూ బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ఆఫర్లను సొంతం చేసుకుంటోంది. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ సౌత్ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన మార్కెట్‌ను క్రియేట్ చేసుకుంటోంది.
మమితా బైజు కమిట్ అవుతోన్న చిత్రాల ప్రచార సరళిని చూస్తే? రాబోయే రోజుల్లో టాలీవుడ్‌లో మలయాళ భామ హవా మరింత జోరుగా సాగడం ఖాయమనిపిస్తోంది. కంటెంట్ ఓరియెంటెడ్ పాత్రలతో పాటు, స్టార్ హీరోల సరసన పాన్-ఇండియా స్థాయి ప్రాజెక్ట్‌లను దక్కించుకుంటూ దూసుకెళ్తున్న తీరు యువ నటీమణులకు స్పూర్తిగా నిలుస్తుంది.