టాలీవుడ్ కథల్లో హైదరాబాదీ ఫ్లేవర్!
పాన్ ఇండియాలో తెలుగు సినిమా స్థాయి ఏంటి? అన్నది ఇప్పటికే ప్రూవ్ అయింది.
పాన్ ఇండియాలో తెలుగు సినిమా స్థాయి ఏంటి? అన్నది ఇప్పటికే ప్రూవ్ అయింది. గ్లోబల్ స్థాయిలో తెలుగోడి సత్తా ఇప్పుడిప్పుడే ప్రూవ్ అవుతుంది. మరో రెండు మూడేళ్లలో అంతర్జాతీయంగానూ తెలుగు సినిమాలు మరింత బలోపేతం అవుతాయి. `వారణాసి`, `రాకా` లాంటి సినిమాలు గ్లోబల్ వైడ్ సక్సెస్ అయ్యాయంటే? హాలీవుడ్ చిత్రాలు ఇండియాలో ఎలా దున్నేస్తాయో? ఇంటర్నేషనల్ మార్కెట్ లోనూ తెలుగు సినిమా అదే రేంజ్ లో దూకుఏడు చూపిస్తుందడనంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే ఓవర్సీస్ లో తెలుగు సినిమాకు ఏ రేంజ్ మార్కెట్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
టాలీవుడ్ ఈ రేంజ్ లో దూసుకుపోతున్నా? స్థానిక కథలకు మాత్రం కొదవ లేదు. లోకల్ మార్కెట్ ను ఆధారంగా చేసుకుని ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. వాటిలో కథా బలం ఉన్న సినిమాలు మంచి ఫలితాలు సాధిస్తున్నాయి. అలాగే లోకల్ హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్‌పై మేకర్స్ దృష్టిని సారిస్తున్నారు. ప్రేక్షకులు ఎప్పుడూ రిలేట్ చేసుకోగలిగే స్వచ్ఛమైన ప్రాంతీయ కథలకు పెద్దపీట వేస్తున్నారు. కొంత మంది మేకర్స్ లోకల్ కథల్నే పాన్ ఇండియాకి కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ చిత్రం `స్పిరిట్` తో పాటు, నేచురల్ స్టార్ నాని - శ్రీకాంత్ ఓదిల కాంబినేషన్‌లో వస్తున్న `ది పారడైస్` వంటి సినిమాలు పూర్తిగా పక్కా లోకల్ స్టోరీలతో తెరకెక్కుతున్నాయి. ఈ చిత్రాలు నగరంలోని మురికివాడలు .. స్థానిక సంస్కృతి నేపథ్యంలో సాగుతాయని ప్రచారం జరుగుతోంది. అలాగే ఇటీవల కాలంలో వస్తున్న కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా హైదరాబాద్ నేపథ్యాన్నే నమ్ముకుంటున్నాయి.
ఇప్పటికే విడుదలైన `అమీర్ లోగ్` కూడా పూర్తిగా హైదరాబాద్ బేస్డ్ స్టోరీ కావడం గమనార్హం. నగరంలోని స్థానిక వాతావరణం, అక్కడి మనుషుల జీవన శైలిని ప్రతిబింబించేలా సినిమా తెరకెక్కింది. ఈ చిత్రానికి ప్రేక్షకులు ..విమర్శకుల నుంచి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. లోకల్ ఫ్లేవర్ మిస్ కాకుండా దర్శకులు తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కంటెంట్‌లో అసలు సిసలైన నేటివిటీ ఉంటే ప్రేక్షకులు ఏ విధంగా ఆదరిస్తారనేదానికి ఈ సినిమా విజయమే నిదర్శనంగా నిలిచింది.
ఇంటర్నేషనల్ హంగులతో సాగే సినిమాలతో పాటు నగరపు వీధుల్లో జరిగే కథలను చూపించడం ద్వారా నేటి యువత - ఫ్యామిలీ ఆడియన్స్‌కు మరింత చేరువ కావచ్చని మేకర్స్ భావిస్తున్నారు. హైదరాబాద్ పాతబస్తీ లేదా ఇతర లోకల్ ప్రాంతాల నేపథ్యంలో వచ్చే ఎమోషన్స్, యాక్షన్ సీన్స్ ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్‌ను పంచు తున్నాయి. టాలీవుడ్ డైరెక్టర్ల ఆలోచన మార్పు ఇండస్ట్రీకి కొత్త ఊపునిస్తోంది.