వయసు తేడాపై ప్రశ్నలు.. భయపడ్డ మణిరత్నం?
తన సినిమా థగ్ లైఫ్ చూడటానికి థియేటర్ కి వచ్చిన ఆడియెన్ కేవలం పాత్రలను మాత్రమే చూడాలని, వయసును కాదని వివరణ ఇచ్చారు.;
ఈ రోజుల్లో ప్రేక్షకుల్లో నిలదీసే స్వభావం ఒక పెద్ద దర్శకుడిని భయపెడుతోంది! అతడు ది గ్రేట్ మణిరత్నం అని చెప్పాల్సి వస్తోంది. 42 ఏళ్ల త్రిషతో 71 ఏళ్ల కమల్ రొమాన్స్ చేయడాన్ని నిలదీస్తుంటే మణిరత్నం సమాధానం కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఆయన థగ్ లైఫ్ లో ఈ జంట రొమాన్స్ గురించి ప్రజలు అడిగే ప్రశ్నకు సమాధానమిస్తున్నారు.
తన సినిమా థగ్ లైఫ్ చూడటానికి థియేటర్ కి వచ్చిన ఆడియెన్ కేవలం పాత్రలను మాత్రమే చూడాలని, వయసును కాదని వివరణ ఇచ్చారు. అసలు ఆ పాత్రలు ఏ కోణంలో ఏ సందర్భంలో రొమాన్స్ చేసాయి అన్నది తెరపై చూసాకే విమర్శించాలని కూడా మణిరత్నం ప్రజలకు సూచించారు. అయితే ప్రేక్షకులకు అంత ఓపిక లేదు. ట్రైలర్ లో నటీనటుల వయసు అంతరం చూడగానే, వెంటనే విమర్శించేసారు. కానీ సినిమా చూసాక విమర్శిస్తారా? అంటే వెయిట్ అండ్ సీ.
ప్రేక్షకుల ప్రతి ప్రశ్నకు మణి సర్ సరైన సమాధానం వెతకాల్సి వస్తోంది. అయినా కథలో పాత్రలు ఏమిటన్నది చూడాలి కానీ, అనవసరంగా వయసు ఎందుకు చూస్తున్నారు? ప్రజలకు మణిరత్నం సూటి ప్రశ్న గట్టిగానే తాకింది! మరి మణిరత్నం ప్రశ్నకు ఎవరు జవాబిస్తారు? ఒక అందమైన కథను దర్శకుడు ప్రెజెంట్ చేస్తారు. అందులో పాత్రలు ఏమిటో ముఖ్యం. జంటలు సూటయ్యాయా లేదా? అన్నది మాత్రమే ప్రేక్షకులు తెరపై చూడాలి. అనవసరంగా వయసులు వెతకకూడదు. ఈ చిత్రంలో కమల్ హాసన్ సరసన నటించిన త్రిష, అభిరామి ఇంచుమించు సగం వయసు వారు. కానీ వారి వయసు అంతరం గురించి చూడకూడదు. కేవలం పాత్రలు, పాత్రధారుల ప్రవర్తన మాత్రమే ప్రేక్షకుడు చూడాలి. థగ్ లైఫ్ వచ్చే నెలలో విడుదలవుతోంది. ఇది ఒక డాన్ కథ. తండ్రి కొడుకుల కథ. మధ్యలో ప్రియురాళ్ల ప్రవేశం ఏమిటన్నది కూడా తెరపైనే చూసి తెలుసుకోవాలి.