లెజెండరీ డైరెక్టర్ మళ్లీ అలాంటి సినిమాలు తీయగలరా?
మణిరత్నం. ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దేశంలోని గొప్ప డైరెక్టర్లలో మణిరత్నం కూడా ఒకరని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు;
మణిరత్నం. ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దేశంలోని గొప్ప డైరెక్టర్లలో మణిరత్నం కూడా ఒకరని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తన ప్రత్యేక శైలితో ఇండియన్ సినీ ఇండస్ట్రీని గొప్పగా మలిచిన లెజండరీ డైరెక్టర్ ఆయన. దేశ సమస్యలను ప్రేమ కథలతో ముడిపెట్టి ఎంతో డెప్త్ ఉన్న కథనాలను అందించడంలో ఆయన దిట్ట.
ప్రేమ కథలను తెరకెక్కించడంలో దిట్ట
కేవలం ఓ తరం మాత్రమే కాకుండా అన్ని తరాల ఆడియన్స్ ను ఆకట్టుకునేలా సినిమాలు చేయడం ఆయన స్పెషాలిటీ. ఆయన్నుంచి వచ్చిన గీతాంజలి, రోజా, బొంబాయి, దిల్ సే లాంటి సినిమాలు ఎంత పెద్ద విజయాలుగా నిలిచాయో కొత్తగా చెప్పనక్కర్లేదు. ఇంకా చెప్పాలంటే ప్రేమ కథలను తెరకెక్కించడంలో మణిరత్నం పీహెచ్‌డీ చేశారని చెప్పొచ్చు.
అవుట్‌డేటెడ్ అయ్యారని కామెంట్స్
అలాంటి మణిరత్నం గత కొంత కాలంగా సరైన ఫామ్ లో లేరు. ఆయన్నుంచి వచ్చిన సినిమాలు ఆడియన్స్ ను పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. మధ్యలో పొన్నియన్ సెల్వన్ ఫ్రాంచైజ్ లో రెండు సినిమాలు తీసి ఆ సినిమాతో ఆడియన్స్ ను ఇంప్రెస్ చేశారు కానీ ఆ ముందు వచ్చిన కొన్ని సినిమాలు, రీసెంట్ గా కమల్ తో చేసిన థగ్ లైఫ్ చూసిన ఆడియన్స్ మణిరత్నం అవుట్‌డేటెడ్ అయిపోయారని కామెంట్స్ చేశారు.
ధృవ్ విక్రమ్- రుక్మిణితో లవ్‌స్టోరీ
అయితే థగ్ లైఫ్ తర్వాత ఇప్పుడు మణిరత్నం కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ కొడుకు ధృవ్ విక్రమ్ హీరోగా, రుక్మిణి వసంత్ హీరోయిన్ గా ఓ లవ్ స్టోరీని చేయనున్నారని తెలుస్తోంది. ధృవ్, రుక్మిణితో ఓ అద్భుతమైన ప్రేమ కథను రూపొందించాలని మణిరత్నం ప్లాన్ చేస్తున్నారట. అసలే మణిరత్నం తన ఫామ్ ను కోల్పోయారని కామెంట్స్ వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన్నుంచి మరో రోజా, బొంబాయి, దిల్ సే లాంటి సినిమా వస్తుందని ఆశించొచ్చా అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కానీ మణిరత్నం మాత్రం ఈ సినిమా విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ లవ్ స్టోరీ నవంబర్ నుంచి మొదలవనుందని, ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారని తెలుస్తోంది.