• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మంచు మనోజ్ ఫ్యామిలీలోకి...

మంచు మనోజ్ ఫ్యామిలీలోకి పులిబిడ్డ

| మంచు లక్ష్మి మంచు మనోజ్, మోనికని ఈ సందర్భంగా ట్విట్టర్ లో కంగ్రాట్స్ చేయడంతో తమ కుటుంబంలోకి పులిబిడ్డ వచ్చింది అంటూ ట్వీట్ చేసింది.

By - Tupaki Desk
Update: 2024-04-13 08:04 GMT

టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ గత ఏడాది భూమా మౌనికని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అతి కొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో మంచు లక్ష్మి ఇంట్లో వీరిద్దరి పెళ్లి జరిగింది. గత జీవితంలో వారి పరిస్థితులు ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో బెస్ట్ కపుల్స్ గా క్యూట్ ఫొటోలతో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు.

 

ఇక వీరిద్దరూ ప్రేమలో పడిన తరువాత.. కుటుంబ సభ్యులని ఒప్పించి గత ఏడాది వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఎక్కడికి వెళ్లిన ఇద్దరూ జంటగా కనిపిస్తూ కనువిందు చేసేవారు. మౌనిక కొడుకుని కూడా మనోజ్ తన సొంత బిడ్డలా ప్రేమగా చూసుకుంటున్నాడు. మనోజ్ ఫ్యామిలీ మ్యాన్ గా కూడా నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు.ఇదిలా ఉంటే తాజాగా భూమా మౌనిక పండంటి ఆడపిల్లకి జన్మనిచ్చింది.

 

ఈ విషయాన్ని మనోజ్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ధృవీకరించారు. మంచు మనోజ్ సోదరి యాక్టర్ మంచు లక్ష్మి మంచు మనోజ్, మోనికని ఈ సందర్భంగా ట్విట్టర్ లో కంగ్రాట్స్ చేయడంతో తమ కుటుంబంలోకి పులిబిడ్డ వచ్చింది అంటూ ట్వీట్ చేసింది. మంచు మనోజ్, మౌనికల కూతురు ముద్దు పేరు ఇదే అని కూడా మంచు లక్ష్మి రివీల్ చేసింది. ఇక వారి ఫ్యామిలీ ఎంతో సంతోషంగా ఉందని ఆమె తెలియజేశారు.

అలాగే ఎంఎం పులి అని ఆప్యాయంగా పిలుస్తున్నాం అంటూ మంచు లక్ష్మి ట్వీట్ చేసింది. దాంతో పాటు పులి ఒడిలో సేదతీరుతున్న పసిపాప ఇమేజ్ ని షేర్ చేసింది. దాంతో పాటుగా బైక్ పై ఇద్దరు పిల్లలు, భార్య, భర్త కలిసి వస్తోన్న AI ఇమేజ్ షేర్ చేసి ఇప్పుడు నలుగురు అయిన మంచు మనోజ్ కుటుంబానికి దేవుడి ఆశీర్వాదం ఉండాలని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మంచు లక్ష్మి పెట్టిన ట్వీట్ పై నెటిజన్లు డిఫరెంట్ గా రియాక్ట్ అవుతున్నారు. మెజారిటీ మంచు ఫ్యామిలీ అభిమానులు విషెస్ చేస్తూ ఉన్నారు. మంచు ఫ్యామిలీలోకి మరో మంచు లక్ష్మి వచ్చిందంటూ ట్వీట్ చేస్తున్నారు. మంచు మనోజ్, మౌనికలకి కంగ్రాట్స్ చేస్తూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక మనోజ్ గతకొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలని ప్రస్తుతం కొన్ని కథలు అయితే వింటున్నాడు. అలాగే ఉస్తాద్ అనే షో ద్వారా మనోజ్ ఆడియెన్స్ కు మరింత దగ్గరవుతున్నాడు.


⭐️ ANNOUNCEMENT 📣

🌟 And just like that, they are four! Blessed by the Gods, a little Goddess has arrived! We are thrilled to announce that Manoj and Mounika have welcomed their much-awaited baby girl. Dhairav is overjoyed as her big brother. Cherishing her nickname, we all… pic.twitter.com/yfoabjWpwr

— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) April 13, 2024


Tags:    
  • Manchumanoj 
  • Maunikabhuma 
  • Lakshmiprasanna 
  • Socialmediapost 
  • Manchufamily 
  • Babygirl 
  • Dhairav 
  • Athagoals 

Similar News

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS