• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చరణ్ ఇంట్లో కొంతకాలం...

చరణ్ ఇంట్లో కొంతకాలం ఉన్నా - మంచు లక్ష్మి

| తాజాగా యక్షిణీ అనే వెబ్ సిరీస్ లో మంచు లక్ష్మి కీలక పాత్రలో నటించింది. అలాగే రెండు సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి

By - Tupaki Desk
Update: 2024-07-01 11:31 GMT

మంచు మోహన్ బాబు కూతురు అనే ఇమేజ్ తో టాలీవుడ్ లోకి నటిగా అడుగుపెట్టిన మంచు లక్ష్మి తక్కువ కాలంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకుంది. మొదటి అనగనగా ఒక ధీరుడు సినిమాలో విలన్ గా నటించిన మంచు లక్ష్మి పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. తరువాత నటిగా గుర్తుండిపోయే పాత్రలు చేస్తూ వచ్చింది. అలాగే నిర్మాతగా కూడా మారి తానే లీడ్ రోల్ లో కొన్ని సినిమాలు చేసింది. వాటిలో చాలా వరకు వర్క్ అవుట్ కాలేదు.

తాజాగా యక్షిణీ అనే వెబ్ సిరీస్ లో మంచు లక్ష్మి కీలక పాత్రలో నటించింది. అలాగే రెండు సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. ఇదిలా ఉంటే గత కొంతకాలం నుంచి మంచు లక్ష్మి ముంబైలో ఉంటోంది. హిందీ సినిమాలలో అవకాశాల కోసం ముంబై లో అడుగుపెట్టింది. ఏదైనా ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం మంచు లక్ష్మి నైజం. ఎవరు ఎన్ని రకాలుగా తన మాటలని చేతులని ట్రోల్ చేసిన వాటిని కేర్ చేయదు.

ముంబై అడుగుపెట్టిన తర్వాత మంచు లక్ష్మి రెగ్యులర్ గా ఫోటోషూట్ లు చేస్తూ అక్కడి మేకర్స్ కి టచ్ లోకి వెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఇదిలా ఉంటే తాజా ఓ ఇంటర్వ్యూలో మంచు లక్ష్మి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో ఇంటరెస్టింగ్ విషయాన్ని రివీల్ చేసింది. ముంబైకి వచ్చిన కొత్తలో తాను స్టే చేయడానికి హౌస్ దొరకలేదని, అలాంటి సమయం రామ్ చరణ్ తన ముంబై ఇంట్లో ఉండమని చెప్పాడని పేర్కొంది.

నీకు ఎన్ని రోజులు ఉండాలని అనిపిస్తే అన్నిరోజులు ఉండు అని రామ్ చరణ్ తన ఇంటి తాళాలు నాకు ఇచ్చేసాడని మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది. నేను ఎంత కాలం ఉన్నానో అనే విషయం కూడా చరణ్ కి తెలియదని చెప్పింది. చరణ్ చేసిన సాయం చాలా గొప్పదని లక్ష్మి కొనియాడింది. అలాంటి ఫ్రెండ్ ఉండటం నిజంగా తన అదృష్టం అని పేర్కొంది. అయితే ఈ విషయం బయటపెట్టకపోవడానికి కారణం ఉంది.

ఏమైనా చెబితే దానిపై రకరకాల పుకార్లు ప్రచారంలోకి వస్తాయి. అలాంటి వాటికి దూరంగా ఉండాలని చరణ్ కూడా ఈ విషయాన్ని ఎక్కడా చెప్పే ప్రయత్నం చేయలేదు. నాకు ఆ అవసరం లేదు. ఇప్పుడు అతని వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పడానికి ఈ విషయాన్ని పంచుకుంటున్న అని మంచు లక్ష్మి ఇంటర్వ్యూలో పేర్కొంది.

Tags:    
  • Manchulakshmi 
  • Mumbaihouse 
  • Filmindustry 
  • Ramcharan 
  • Mohanbabu 
  • Upasana 
  • Megafamily 
  • Gamechangerfilm 
  • Ramcharanhouse 

Similar News

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

Copyright @2026

Powered by Blink CMS