'ఢీ' సీక్వెల్ రెడీ అవుతోందా?
'కన్నప్ప' కథకు అక్కడ లోకేషన్లు అయితే బాగుంటుందని 80 శాతం చిత్రీకరణ అక్కడే నిర్వహించారు.;

మంచు విష్ణు 'కన్నప్ప'తో పాన్ ఇండియాలో పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విజయం సాధిస్తే విష్ణు రేంజ్ మారిపోతుంది. తదుపరి అన్ని పాన్ ఇండియా సినిమాలే చేస్తాడు. విష్ణు ఆలోచనలన్నీ అంతర్జాతీయ రేంజ్ లోనే ఉంటాయి. 'కన్నప్ప' సక్సెస్ అయితే ఏకంగా గ్లోబల్ రేంజ్ లోనే ప్లాన్ చేసే అవకాశం ఉంటుంది. 'కన్నప్ప' షూటింగ్ అంతా న్యూజిలాండ్ లోనే చేసిన సంగతి తెలిసిందే.
'కన్నప్ప' కథకు అక్కడ లోకేషన్లు అయితే బాగుంటుందని 80 శాతం చిత్రీకరణ అక్కడే నిర్వహించారు. అదీ కన్నప్ప రేంజ్. ఇప్పటికే ప్రచారం పనులు కూడా ప్రారంభమయ్యాయి. గుంటూరులో రోడ్ షో నిర్వహించారు. భారీ ఎత్తున ప్రేక్షకులు కనిపిస్తున్నారు. ఆ సంగతి పక్కన బెడితే విష్ణు హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో 'ఢీ 'సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నట్లు గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే.
కానీ ఆ తర్వాత మళ్లీ ఈ టాపిక్ తెరపైకి రాలేదు. సీక్వెల్ విషయంలో వైట్ల కంటే విష్ణు సీరియస్ గానే ఉన్నాడు. ఢీ సక్సెస్ అవ్వడంతో సీక్వెల్ చేస్తే బాగుటుంది? అన్నది విష్ణు ఐడియానే. ఈ నేపథ్యంలో కన్నప్ప రిలీజ్ తర్వాత డీ సీక్వెల్ ఆలోచన చేసే అవకాశం ఉందా? అంటే అవుననే అనాలి. అయితే అది 'కన్నప్ప' రిజల్ట్ మీద ఆధారపడి ఉండొచ్చు. 'కన్నప్ప' సక్సెస్ అయితే విష్ణు వెంటనే ఢీ సీక్వెల్ చేసే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
ఎందుకంటే 'ఢీ' అనేది రీజనల్ మార్కెట్ సినిమా మాత్రమే. అది పాన్ ఇండియా కంటెంట్ కాదు. ఒకవేళ కన్నప్ప ప్రతికూల ఫలితం సాధిస్తే ఢీ సీక్వెల్ వేగంగా చేసే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతం శ్రీను వైట్ల కూడా అవకాశాలు లేక ఖాళీగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఫాం లో ఉన్నంత కాలం బాగానే కొనసాగాడు. కానీ ఆ తర్వాత చేసిన సినిమాలు సరిగ్గా ఆడ లేదు.