కన్నప్ప వాయిదా వార్తలపై విష్ణు క్లారిటీ
మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా కన్నప్ప. విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కిన ఈ సినిమాను తన తండ్రి మోహన్ బాబు కీలక పాత్రలో నటిస్తూ నిర్మించాడు.;

మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా కన్నప్ప. విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కిన ఈ సినిమాను తన తండ్రి మోహన్ బాబు కీలక పాత్రలో నటిస్తూ నిర్మించాడు. ఈ సినిమా కథపై తాను దాదాపు నాలుగేళ్లుగా వర్క్ చేశానని, కన్నప్ప సినిమా తన కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాగా నిలుస్తుందని మంచు విష్ణు ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.
ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో భారీ స్టార్ క్యాస్టింగ్ కూడా ఉంది. ఒక్క తెలుగు నుంచి మాత్రమే కాకుండా వివిధ భాషల్లోని స్టార్లు కన్నప్పలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో పాటూ బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, మలయాళ అగ్ర హీరో మోహన్ లాల్, టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో నటించారు.
వాస్తవానికి కన్నప్ప సినిమా ఎప్పుడో రిలీజవాల్సింది. కానీ వీఎఫ్ఎక్స్ వర్క్స్ మరియు కొన్ని కారణాల వల్ల కన్నప్ప రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే ఆలోచనతో విష్ణు ముందు ఈ వీఎఫ్ఎక్స్ వర్క్స్ ను ఎలాంటి ఎక్స్‌పీరియెన్స్ లేని వాళ్ల చేతిలో పెట్టడం వల్లే సినిమా రిలీజ్ ఆలస్యమైందనే కారణం కూడా చెప్తున్నారు.
ఇప్పుడు అన్ని సమస్యలనూ అధిగమించి కన్నప్ప జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయింది. అందులో భాగంగానే ఆల్రెడీ మేకర్స్ కన్నప్ప ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు. ఓ వైపు ప్రమోషన్స్ జరుగుతున్నప్పటికీ కన్నప్ప మరోసారి వాయిదా పడుతుందనే కామెంట్స్ నెట్టింట వినిపిస్తున్న నేపథ్యంలో మంచు విష్ణు ఈ విషయంలో క్లారిటీ ఇచ్చాడు. కన్నప్ప సినిమా ఎట్టి పరిస్థితుల్లో జూన్ 27న థియేటర్లలోకి వస్తుందని బల్ల గుద్ది మరీ చెప్తున్నాడు.ఆల్రెడీ తాను రెండు తెలుగు స్టేట్స్ లో పెద్ద ఎత్తున ఈవెంట్స్ ను కూడా ప్లాన్ చేసుకున్నానని, ఎట్టి పరిస్థితుల్లో సినిమా వాయిదా పడదని విష్ణు క్లారిటీ ఇచ్చాడు.