• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కన్నప్ప 'లవ్' - రొమాంటిక్...

కన్నప్ప 'లవ్' - రొమాంటిక్ ట్రాక్ లో ఊహించని సాంగ్

| మంచు విష్ణు, ప్రీతి ముకుందన్ జంట మీద చిత్రీకరించిన ఈ పాటలో నీటి మధ్య, అడవుల మధ్య రొమాంటిక్ ఎమోషన్లు ప్రధానంగా చూపించారు.

By - Tupaki Desk
Update: 2025-03-10 12:44 GMT

మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పాన్-ఇండియా చిత్రం ‘కన్నప్ప’ నుండి మరో లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విష్ణు సరసన ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా నటిస్తోంది. భారీ మైథలాజికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమా ఏప్రిల్ 25న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

సినిమాలో మోహన్ బాబు, మోహన్‌లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, శరత్‌కుమార్ వంటి స్టార్ క్యాస్ట్ ప్రత్యేక పాత్రల్లో నటిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. తాజాగా విడుదలైన లవ్ లిరికల్ వీడియో "సగమై చేరి సగమై.." ప్రేమ, భావోద్వేగాలతో నిండిన పాటగా సాగింది. స్టీఫెన్ దేవసీ సంగీతం అందించగా, రేవంత్, హరిచరన్, చిన్మయి, సాహితి, షాన్, నజీమ్ అర్షద్ వంటి గాయకులు ఈ పాటను భాషలకు తగ్గట్టుగా ఆలపించారు.

తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైన ఈ పాటలో హీరోహీరోయిన్ మధ్య కెమిస్ట్రీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రభుదేవా - బృంద మాస్టర్ కలిసి ఈ పాటకు కొరియోగ్రఫీ అందించగా, లొకేషన్స్ కూడా అందంగా కుదిరాయి. పాట విజువల్స్ పరంగా చూస్తే.. ప్రకృతి సోయగాలతో కూడిన లొకేషన్లు ఆకట్టుకున్నాయి.

మంచు విష్ణు, ప్రీతి ముకుందన్ జంట మీద చిత్రీకరించిన ఈ పాటలో నీటి మధ్య, అడవుల మధ్య రొమాంటిక్ ఎమోషన్లు ప్రధానంగా చూపించారు. ప్రీతి ముకుందన్ గ్లామర్ లుక్, నేచురల్ లొకేషన్స్ పాటకు ప్లస్ పాయింట్ అయితే, కంపోజిషన్ పరంగా చూసుకుంటే అదోకే ఓకే అనిపించే స్థాయిలో ఉంది. అయితే కన్నప్ప లాంటి సినిమాలో ఇలాంటి లవ్ రొమాంటిక్ సాంగ్ ఉంటుందని ఎవరు ఊహించలేదు.

మేకర్స్ కన్నప్ప కథను సరికొత్తగా ప్రజెంట్ చేయనున్నట్లు తెలుస్తోంది. విష్ణు, ప్రీతి ముకుందన్ మధ్య రొమాంటిక్ మూమెంట్స్ హైలైట్ అయ్యాయి. అలాగే మ్యూజిక్ పరంగా స్టీఫెన్ దేవసీ మంచి బాణీలను ఇచ్చారు. పూర్తిగా మైథలాజికల్ టచ్‌తో రొమాన్స్ మిక్స్ చేసినట్లు కనిపిస్తోంది. ఇక బిగ్ స్క్రీన్‌పై ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

Full View
Tags:    
  • Kannappa 
  • ManchuVishnu 
  • PreetiMukundan 
  • LoveSong 
  • MythologicalFilm 
  • RomanticSong 
  • KannappaFilm 
  • FilmPromotion 

Similar News

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

Copyright @2026

Powered by Blink CMS