మౌళికి మరో బంపరాఫర్
సినీ ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ అనేది ఎంట్రీ వరకే పనికొస్తుంది తప్పించి ఆ తర్వాత సొంత టాలెంట్ లేకపోతే వాళ్లని ఆడియన్స్ ఎంకరేజ్ చేయరు.;
సినీ ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ అనేది ఎంట్రీ వరకే పనికొస్తుంది తప్పించి ఆ తర్వాత సొంత టాలెంట్ లేకపోతే వాళ్లని ఆడియన్స్ ఎంకరేజ్ చేయరు. టాలెంట్ ఉంటే కాస్త లేటైనా సరే స్టార్లుగా మారొచ్చని ఇప్పటికే ఎంతోమంది ప్రూవ్ చేశారు. టాలెంట్ ఎవరి సొత్తూ కాదు అని అదేదో పాటలో ఉన్నట్టు మంచి కథ, దాన్ని ఆడియన్స్ వరకు తీసుకెళ్లే టాలెంట్ ఉంటే ఎవరైనా సక్సెస్ అవొచ్చు.
మిరాయ్ తో సూపర్ సక్సెస్
ఇదే విషయాన్ని చెప్తున్నారు మంచు మనోజ్. మోహన్ బాబు కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మనోజ్, ఆ తర్వాత తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ కొంత కాలంగా మనోజ్ కెరీర్ ఫామ్ లో లేదు. రీసెంట్ గా మిరాయ్ సినిమాతో మంచి సక్సెస్ ను అందుకున్న మనోజ్, మిరాయ్ సక్సెస్‌మీట్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సక్సెస్ అవాలంటే స్టార్ల కొడుకులే కానక్కర్లేదు
టాలీవుడ్ లో రీసెంట్ గా సక్సెస్ అయిన సినిమాల గురించి మాట్లాడుతూ లిటిల్ హార్ట్స్ సక్సెస్ గురించి ప్రస్తావించారు మనోజ్. ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకోవాలంటే చిరంజీవి, మోహన్ బాబు కొడుకులే కానక్కర్లేదని, మంచి టాలెంట్, కష్టపడే తపన ఉండే ఎవరైనా సక్సెస్ అవొచ్చని రీసెంట్ గా లిటిల్ హార్ట్స్ మూవీతో యూట్యూబర్ మౌళి నిరూపించాడని మనోజ్ ప్రశంసించారు.
మిరాయ్ కు దక్కిన పెద్ద కాంప్లిమెంట్ అదే!
అక్కడితో ఆగకుండా నీ సినిమాలో ఎప్పుడైనా విలన్ పాత్ర ఉంటే నేను తప్పకుండా చేస్తానని మౌళికి మీడియా ముఖంగా బంపరాఫర్ ఇచ్చారు మంచు మనోజ్. మిరాయ్ మూవీ సక్సెస్ విషయంలో ఎమోషనల్ అయిన మనోజ్, సినిమా చూశాక తన తల్లి తనను హగ్ చేసుకుని ఎమోషనల్ అవడంతో పాటూ మహావీర్ లామా క్యారెక్టర్ లో నా బిడ్డ అదరగొట్టాడని చెప్పడమే తనకు దక్కిన పెద్ద కాంప్లిమెంట్ అని చెప్పారు మనోజ్.
రాజాసాబ్ రికార్డులు తిరగరాస్తుంది
ఈ మధ్య ఆడియన్స్ థియేటర్లకు రావడం లేదనే అపోహ జనాల్లో బాగా ఉండిపోయిందని, కానీ మంచి కంటెంట్ తో వస్తే తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తారని చెప్పిన మనోజ్, టి.జి విశ్వప్రసాద్ లాంటి మంచి నిర్మాతను తానెప్పుడూ చూడలేదని, సినిమా కోసం ఆయన ఏమైనా చేస్తారని, ప్రభాస్ హీరోగా రాబోయే రాజా సాబ్ రికార్డులు తిరగరాస్తుందని చెప్పారు. తన నెక్ట్స్ మూవీగా డేవిడ్ రెడ్డి రానుందని, ఆ తర్వాత అబ్రహం లింకన్, రక్షక్ సినిమాలు చేస్తున్నట్టు మనోజ్ వెల్లడించారు.