• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'అత్త‌రు సాయిబు'గా మంచు...

'అత్త‌రు సాయిబు'గా మంచు వార‌సుడు!

| ఏడేళ్ల త‌ర్వాత మంచు వార‌సుడు మ‌నోజ్ కెరీర్ మ‌ళ్లీ ఇప్పుడిప్పుడే ప‌ట్టాలెక్కుతుంది. వ్య‌క్తిగ‌త కారణా లుగా ఇంత‌కాలం ఇండ‌స్ట్రీకి దూరంగా ఉన్న మ‌నోజ్ మ‌ళ్లీ గ‌త వైభ‌వాన్ని అందుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు.

By - Srikanth Kontham
Update: 2025-09-05 07:30 GMT

ఏడేళ్ల త‌ర్వాత మంచు వార‌సుడు మ‌నోజ్ కెరీర్ మ‌ళ్లీ ఇప్పుడిప్పుడే ప‌ట్టాలెక్కుతుంది. వ్య‌క్తిగ‌త కారణా లుగా ఇంత‌కాలం ఇండ‌స్ట్రీకి దూరంగా ఉన్న మ‌నోజ్ మ‌ళ్లీ గ‌త వైభ‌వాన్ని అందుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. ఇప్ప‌టికే `భైర‌వం` సినిమాతో కంబ్యాక్ అయ్యాడు. ఫ‌లితం సంగ‌తి ప‌క్క‌న బెడితే? మంచు వార‌బ్బాయి మ‌ళ్లీ వ‌చ్చాడు? అన్న ఆనందాన్ని ఇండ‌స్ట్రీకి క‌లిగించాడు. త్వ‌ర‌లో `మిరాయ్` అనే పాన్ ఇండియా సినిమాతో అల‌రించ‌డానికి రెడీ అవుతుతున్నాడు. తేజ స‌జ్జా హీరోగా న‌టించిన చిత్రంలో మ‌నోజ్ విల‌న్ గా న‌టిస్తున్నాడు.

మంచి కంబ్యాక్ చిత్రంగా:

ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాల‌తో సినిమాపై మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ప్ర‌త్యేకించి మనోజ్ కూడా మంచి కంబ్యాక్ చిత్రంగా నిలుస్తుంద‌ని ఆశిస్తున్నాడు. ఈ విజ‌యంతో తెలుగు ప్రేక్ష‌కుల్లో మ‌ళ్లీ త‌ల‌లో నాలుక‌లా మారుతాడ‌ని భావిస్తున్నాడు. అలాగే తానే హీరోగా `వాట్ ది ఫిష్` అనే మ‌రో చిత్రం కూడా చేస్తున్నాడు. వాస్త‌వానికి ఈ సినిమా ఇప్ప‌టికే రిలీజ్ అవ్వాలి. కానీ షూటింగ్ డిలే కార‌ణంగా ఇంకా సెట్స్ లోనే ఉంది. ఏదీ ఏమైనా ఏడాది ముగింపుక‌ల్లా ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చే అవ‌కాశం ఉంది.

క్యాచీ టైటిల్ తో క్రేజీగా:

ఈ రెండు గాక `డేవిడ్ రెడ్డి`, `ర‌క్ష‌క్` అనే మ‌రో రెండు చిత్రాలు కూడా క‌మిట్ అయిన‌ట్లు తెలుస్తోంది. వీటితో పాటు `అత్త‌రు సాయిబు` అనే మ‌రో చిత్రం కూడా రెడీ అవుతుంద‌ని తాజాగా మ‌నోజ్ తెలిపాడు. `అత్త‌రు సాయిబు` అన్న‌ది క్యాచీ టైటిల్. తెలుగింట ఈ పేరు ఎంతో ఫేమ‌స్. `అత్త‌రు సాయిబు` పాట ఎంత ఫేమ‌స్ అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. ఇప్ప‌టికీ ఆ పాట చాలా చోట్ల మార్మోమ్రోగుతూనే ఉంటుంది. స‌రిగ్గా ఆ ఫేమ‌స్ సాంగ్ నే మ‌నోజ్ త‌న సినిమా టైటిల్ గా ఫిక్స్ చేయ‌డం విశేషం. ఇలాంటి టైటిల్ తో సినిమా జ‌నాల్లోకి సుల‌భంగా వెళ్తుంది.

అభిమానుల ఆకాంక్ష‌:

మ‌నోజ్ సీరియ‌స్ యాక్షన్ పాత్ర‌లే కాదు మంచి కామెడీ టైమింగ్ ఉన్న న‌టుడు కూడా. ఈ నేప‌థ్యంలో `అత్త‌రు సాయిబు` టైటిల్ తో ఓ హాస్యాస్ప‌ద చిత్రం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ ఇంకా చ‌ర్చ‌ల ద‌శ‌లోనే ఉంది. స్టోరీ లాక్ అయింది. కానీ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు ఎవ‌రు? త‌దిత‌ర వివ‌రాలు త్వ‌ర‌లో బ‌య‌ట‌కు రానున్నాయి. మొత్తానికి 2025 లో మంచు వార‌సుడు సినిమాల జోరు షురూ చేసిన‌ట్లే.

'రాజు భాయ్' నుంచి 'ఒక్క‌డు మిగిలాడు' వ‌ర‌కూ సినిమాలు చేసుకుంటూ వ‌చ్చాడు. ఆ త‌ర్వాతే మ‌రో రెండు చిత‌రాలు చేసి ఇండ‌స్ట్రీకి దూర‌మయ్యాడు. ఈ నేప‌థ్యంలో కంబ్యాక్ తో మ‌నోజ్ మ‌ళ్లీ బిజీ అవ్వాల‌ని అభిమానులు ఆశీస్తున్నారు.

Tags:    
  • ManchuManoj 
  • TeluguCinema 
  • Bhairavam 
  • Mirai 
  • AttaruSaibu 
  • ComebackCinema 
  • TeluguMovies 
  • మంచుమనోజ్ 
  • బైరవం 
  • అత్తరుసాయిబు 

Similar News

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

Copyright @2026

Powered by Blink CMS