రాకా ప్రపంచాన్ని చూసి చూసి నోరెళ్లబెట్టిన నటి
ఇలాంటి సమయంలో తాజాగా నటి మంచు లక్ష్మి రాకా మేకింగ్‌పై చేసిన కామెంట్స్ కొత్త ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
అల్లు అర్జున్- అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న రాకా సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. ఫస్ట్ లుక్ రిలీజైనప్పటి నుంచి సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న అప్‌డేట్ ఫ్యాన్స్ లో క్యూరియాసిటీని పెంచుతోంది. అయితే ఇప్పటివరకు సినిమా కథ, పాత్రలు, ప్రపంచం గురించి పూర్తి స్థాయిలో ఎలాంటి వివరాలు బయటకు రాలేదు. ఇలాంటి సమయంలో తాజాగా నటి మంచు లక్ష్మి రాకా మేకింగ్‌పై చేసిన కామెంట్స్ కొత్త ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
రీసెంట్ గా రాకా షూటింగ్ సెట్‌ను సందర్శించిన మంచు లక్ష్మి.. అక్కడ జరుగుతున్న పనులను చూసి ఆశ్చర్యానికి గురయ్యానని, సెట్‌లో ఉన్నంతసేపూ నోరెళ్లబెట్టే చూస్తూ ఉండిపోయానని, తాను మళ్లీ కారులోకి ఎక్కిన తర్వాతే నోరు మూసుకున్నానని చెప్పడం సినిమాపై ఉన్న ఆసక్తిని పెంచేస్తోంది. సాధారణంగా భారీ సినిమాల సెట్స్‌ను చూసిన సెలబ్రిటీలు ప్రశంసలు కురిపించడం కొత్తేమీ కాదు. కానీ రాకా విషయంలో ఆమె ప్రస్తావించిన అంశాలు మాత్రం సినిమాను ఏ స్థాయిలో రూపొందిస్తున్నారనే దానిపై ఆసక్తిని పెంచుతున్నాయి.
ముఖ్యంగా ఇప్పటివరకు తాను చూడని ఎన్నో రకాల జీవులు, భారీ స్థాయిలో రూపొందించిన సెట్స్, అక్కడ కనిపించిన వ్యక్తులు.. ఇవన్నీ కలిసి ఒకే ప్రపంచంలోని సినిమా కోసం భాగమవడం తనకు ఆశ్చర్యంగా అనిపిస్తోందని, సినిమా కోసం ఎన్నో డిపార్ట్‌మెంట్స్ కలిసి వర్క్ చేయడం కూడా తనను ఆశ్చర్యపరిచిందని ఆమె పేర్కొన్నారు. అంటే రాకా సినిమాను కేవలం ఒక కథను తెరకెక్కించే సినిమాగా కాకుండా.. దానికి అవసరమైన పూర్తి ప్రపంచాన్ని ముందుగానే నిర్మించే ప్రయత్నం జరుగుతున్నట్లు ఆమె మాటల ద్వారా అర్థమవుతోంది.
ఇక్కడే రాకాలో వరల్డ్ బిల్డింగ్ ఎంత కీలకంగా ఉండబోతోందనే ప్రశ్న మొదలవుతోంది. ఒక సినిమాలో కథ, హీరో, హీరోయిన్‌తో పాటు ప్రత్యేకమైన వాతావరణం, జీవులు, సెట్స్, క్యారెక్టర్స్ కోసం స్పెషల్ వరల్డ్ ను క్రియేట్ చేయడం ప్రస్తుతం భారీ స్థాయి ఇండియన్ సినిమాల్లో కీలకంగా మారుతోంది. రాకా విషయంలో కూడా ఇదే విధమైన భారీ ప్రయత్నం జరుగుతున్నట్లు మంచు లక్ష్మి కామెంట్స్ సూచిస్తున్నాయి.
ఇక ఆమె చెప్పిన మరో మాట సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచుతోంది. సెట్‌లో చూసిన చాలా విషయాలను అందరితో షేర్ చేసుకోవాలని ఉన్నప్పటికీ.. వాటిని ఇప్పుడే చెప్పేనని చెప్పి రాకాపై అంచనాలను ఆకాశానికెత్తేశారు. ఇప్పటికే ఫస్ట్ లుక్‌తో ఆసక్తి రేకెత్తించిన రాకాకు ఇప్పుడు మంచు లక్ష్మి సెట్ విజిట్ మరో లేయర్‌ను జోడించింది. ఫస్ట్ లుక్‌తో మొదలైన క్యూరియాసిటీ.. ఇప్పుడు సెట్ రియాక్షన్, వరల్డ్ బిల్డింగ్, బయటకు రాని మేకింగ్ వివరాల వైపు మళ్లింది. దీంతో అసలు రాకా ప్రపంచాన్ని తెరపై ఎలా ఆవిష్కరించబోతున్నారనే ఆసక్తి ప్రేక్షకుల్లో మరింత పెరుగుతోంది.