బెట్టింగ్ యాప్ ను ప్రచారం చేశా.. అందుకే వెళ్లా: మంచు లక్ష్మి

ఆ సమయంలో బెట్టింగ్‌ యాప్‌ ల నుంచి తీసుకున్న పారితోషికం, కమీషన్లపై ఈడీ అధికారులు మంచు లక్ష్మిని ప్రశ్నించారు.;

Update: 2025-09-13 07:44 GMT

బెట్టింగ్‌ యాప్‌ లకు ప్రచారం కేసును విచారిస్తున్న ఎన్ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఎదుట ఇటీవల సినీ నటి మంచు లక్ష్మి హాజరైన విషయం తెలిసిందే. నిషేధిత బెట్టింగ్‌ యాప్‌ లకు ప్రచారం చేసిన వ్యవహారంలో విచారణకు రావాలని ఇటీవల సమన్లు జారీ చేయగా, ఆమె ఆగస్టు 13వ తేదీన ఈడీ కార్యాలయానికి వెళ్లారు లక్ష్మి.

ఆ సమయంలో బెట్టింగ్‌ యాప్‌ ల నుంచి తీసుకున్న పారితోషికం, కమీషన్లపై ఈడీ అధికారులు మంచు లక్ష్మిని ప్రశ్నించారు. ఒప్పందానికి సంబంధించిన పత్రాలతోపాటు బ్యాంకు ఖాతాలను పరిశీలించినట్లు సమాచారం. యాప్‌ నిర్వాహకుల కార్యకలాపాలపై తనకు సమాచారం లేదని ఈడీ అధికారులకు విన్నవించినట్లు వినికిడి.

తాను మరోసారి ప్రచారం చేయనని కూడా మంచు డాటర్ చెప్పినట్లు తెలిసింది. అయితే ఇప్పుడు ఆ వ్యవహారంపై మంచు లక్ష్మి తాజాగా మాట్లాడారు. ఓ ఇంటర్వ్యూలో రెస్పాండ్ అవుతూ.. దర్యాప్తు జరిగిన దాన్ని కొన్ని మీడియాలు పూర్తిగా పక్కనపెట్టాయని ఆరోపించారు. కేవలం మరో విషయాన్ని హైలైట్‌ చేశాయని అసహనం వ్యక్తం చేశారు.

అసలు కేసులో చిట్టచివరి వ్యక్తిని విచారించాలని ఈడీ భావించడం హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించిన లక్ష్మి.. అసలు ఇది ఎక్కడ మొదలైందనే దానిపై వారు ఫోకస్ చేయాలని సూచించారు. ముఖ్యంగా విచారణ అంశంపై కొన్ని మీడియాలో తనపై వచ్చిన న్యూస్ లను చూసి చాలా బాధపడ్డానని మంచు లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు.

తాము విచారణ ఒక విషయంలో ఎదుర్కొంటే, తప్పుడు కథనాలు ప్రచారం చేశారని ఆరోపించారు. బెట్టింగ్‌ యాప్స్‌ వ్యవహారంలో డబ్బు ఎలా సమకూరుతోందని, ఎక్కడి నుంచి వస్తుందోనని, ఎటు వెళ్తుందోనని ఈడీ దర్యాప్తు చేస్తోందని తెలిపారు. ముఖ్యంగా ఉగ్రవాదులకు నిధులు వెళ్తున్నాయా అనే దానిపై కూడా దృష్టి పెట్టారని చెప్పారు.

కానీ అవేం తనకు తెలియదని, మొత్తంగా 100 మంది బెట్టింగ్‌ యాప్స్‌ ను ప్రమోట్‌ చేశారని తెలిపారు లక్ష్మి. ఆ లిస్ట్ లో తాను కూడా ఉండడం వల్ల విచారణకు వెళ్లానని చెప్పారు. కానీ ఏదోదో రాశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదేమైనా బెట్టింగ్ యాప్స్ ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయోనని విషయంపై అధికారులు ఎందుకు పరిష్కారం చూపించడం లేదని ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. ప్రస్తుతం ఆమె కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

Tags:    

Similar News