అందుకే కన్నప్ప పోస్ట్ పోన్ చేసుకున్నాడు : మనోజ్
మంచు మనోజ్ మరోసారి మీడియా ముందుకు వచ్చి తన అన్న మంచు విష్ణుపై తీవ్ర ఆరోపణలు చేశారు.;
మంచు మనోజ్ మరోసారి మీడియా ముందుకు వచ్చి తన అన్న మంచు విష్ణుపై తీవ్ర ఆరోపణలు చేశారు. తన ఇంటిని విష్ణు ధ్వంసం చేశాడని ఇదివరకే పోలీసులకు ఫిర్యాదు చేసిన మనోజ్, తాజాగా నేరుగా విమర్శలు గుప్పించారు. ధైర్యం ఉంటే వెండితెరపై పోటీ పడాలని సవాల్ విసిరారు.
"నేను 'భైరవం' సినిమాను విడుదల చేస్తానని చెప్పగానే, విష్ణు తన 'కన్నప్ప' సినిమాను వాయిదా వేసుకున్నాడు. నిజమైన మగాడిలా పోటీ పడదామని నేను 'భైరవం' విడుదల చేద్దామనుకున్నాను. దాంతో అతను భయపడిపోయాడు. 'కన్నప్ప' వాయిదా వేసుకోవడంతో కోపం వచ్చి, నేను ఊర్లో లేని సమయంలో నా ఇంటిపై దాడి చేశాడు. ఇది మగతనం కాదు," అని మనోజ్ విమర్శించాడు.
గతంలో తన తండ్రి మోహన్ బాబు , విష్ణు కోసం ఎంతో చేశానని, రూపాయి కూడా తీసుకోకుండా పనిచేశానని గుర్తు చేశారు. ఆ కృతజ్ఞత కూడా లేకుండా తన ఇంటిపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వివాదం హైకోర్టులో నడుస్తున్నప్పటికీ, కింది కోర్టు నుండి ఉత్తర్వులు తెచ్చుకొని తనను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు.
"విష్ణు కెరీర్ కోసం నాతో ఆడ వేషం వేయించారు. నేను లేడీ గెటప్ వేయకపోతే విష్ణు కెరీర్ నిలబడదని నన్ను భావోద్వేగంగా బ్లాక్ మెయిల్ చేసి చేయించారు. అన్నయ్య కోసం ఇష్టం లేకపోయినా అమ్మాయిలా నటించాను. గ్రాఫిక్స్, స్టంట్స్, పాటలు ఇలా ఎన్నో పనులు చేశాను. ఎంతో కష్టపడ్డాను, కానీ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. వారికి కనీసం కృతజ్ఞత కూడా లేదు," అని మనోజ్ వాపోయారు.
తాను గ్రాఫిక్స్ నేర్చుకుంటే విష్ణు గ్రాఫిక్ కంపెనీ పెట్టాడని, తన తండ్రి మోహన్ బాబు థియేటర్ పెడితే విష్ణు అందులో సమోసాలు అమ్ముకున్నాడని ఎద్దేవా చేశారు. దొంగ దెబ్బలు తీయడం ఆపి, మగాడిలా ముందుకు వచ్చి పెద్దల సమక్షంలో తనతో చర్చలు జరపాలని మనోజ్ డిమాండ్ చేశారు.