మెగా బాక్సాఫీస్ మ్యాజిక్.. 'MSG' మొదటి రోజు లెక్క ఎంతంటే..

సంక్రాంతి సందడి మొదలవ్వకముందే మెగాస్టార్ తన 'మన శంకర వరప్రసాద్ గారు' (MSG) సినిమాతో బాక్సాఫీస్ దగ్గర హీట్ పెంచేశారు.;

Update: 2026-01-13 04:34 GMT

సంక్రాంతి సందడి మొదలవ్వకముందే మెగాస్టార్ తన 'మన శంకర వరప్రసాద్ గారు' (MSG) సినిమాతో బాక్సాఫీస్ దగ్గర హీట్ పెంచేశారు. అనిల్ రావిపూడి తన మార్క్ ఫన్ తో చిరంజీవిని వింటేజ్ లుక్ లో చూపించడంతో ఆడియన్స్ కు ఫుల్ మీల్స్ దొరికినట్లు అయ్యింది. ఫ్యామిలీ అంతా కలిసి వెళ్లేలా సినిమా ఉండటంతో థియేటర్ల దగ్గర రద్దీ మామూలుగా లేదు. ఎక్కడ చూసినా ఈ మెగా ఎంటర్టైనర్ గురించే చర్చ నడుస్తోంది.




 


సాధారణంగా ఫ్యామిలీ సినిమాలంటే మెల్లగా పుంజుకుంటాయి కానీ ఈ సినిమా మాత్రం ఓపెనింగ్స్ లోనే రికార్డులను తిరగరాస్తోంది. బుక్ మై షోలో ఈ సినిమా టికెట్ల కోసం జనం ఏ రేంజ్ లో ఎగబడ్డారంటే.. కేవలం 24 గంటల్లోనే సుమారు 4.88 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. ఒక రీజినల్ ఫిల్మ్ కు, అది కూడా వీక్ డేస్ లో ఈ స్థాయిలో టికెట్స్ సేల్ అవ్వడం అంటే బాస్ ఇమేజ్ కు ఇది నిదర్శనం. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లను నింపేస్తుండటంతో హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.

ఇక వసూళ్ల విషయానికి వస్తే, చిరంజీవి తన కెరీర్ లోనే ఎన్నడూ చూడని రేంజ్ లో మొదటి రోజే 84 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. సంక్రాంతి సీజన్ లో బాస్ వస్తే బాక్సాఫీస్ రికార్డులు గల్లంతవ్వాల్సిందే అని ఈ కలెక్షన్లు ప్రూవ్ చేస్తున్నాయి. పక్కా ఫ్యామిలీ కంటెంట్ తో వచ్చి కూడా ఈ రేంజ్ లో మాస్ ఓపెనింగ్స్ రాబట్టడం ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది.

రిలీజ్ టైమింగ్ విషయంలో చాలా మందికి డౌట్స్ ఉండేవి. సోమవారం రోజున సినిమా రిలీజ్ అవ్వడం ఏంటి అని అందరూ అనుకున్నారు. కానీ ఆ అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తూ ఈ వీక్ డే లో కూడా సినిమా బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ వైబ్స్ ని క్రియేట్ చేసింది. రెండో రోజు బుకింగ్స్ కూడా చూస్తుంటే సంక్రాంతి సెలవులు ముగిసేలోపు ఈ సినిమా మరిన్ని రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమనిపిస్తోంది.

కేవలం మన దగ్గరే కాదు, అమెరికాలో కూడా మెగా సందడి పీక్స్ లో ఉంది. నార్త్ అమెరికాలో ఈ చిత్రం ఇప్పటికే 1.7 మిలియన్ డాలర్ల మార్కును దాటేసి, 2 మిలియన్ డాలర్ల వైపు వేగంగా దూసుకుపోతోంది. చిరంజీవి కెరీర్ లోనే ఓవర్సీస్ లో ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచేలా ఉంది. అక్కడి తెలుగు ఫ్యామిలీలు కూడా బాస్ వింటేజ్ మేనరిజమ్స్ కు ఫుల్ గా కనెక్ట్ అయిపోతున్నారు.

రేపటి నుండి సంక్రాంతి సెలవులు ఫుల్ గా మొదలవుతున్నాయి కాబట్టి, బాక్సాఫీస్ దగ్గర ఈ మెగా ర్యాంపేజ్ ఇంకో లెవల్ లో ఉండబోతోంది. అనిల్ రావిపూడి హిట్ ట్రాక్ రికార్డ్, చిరంజీవి ఎనర్జీ తోడవ్వడంతో నిర్మాతలకు పండగ ముందే వచ్చేసినట్లు అయ్యింది. మొత్తానికి ఈ పండుగ విన్నర్ గా 'మన శంకర వరప్రసాద్ గారు' రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లతో దూసుకుపోతున్నారు. ఇక రాబోయే రోజుల్లో ఇంకెన్ని రికార్డులు క్తియేట్ అవుతాయో చూడాలి.

Tags:    

Similar News