ఆ సినిమాలో హీరో విలన్ మెగాస్టారేనా!
మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి సినీ ప్రయాణం ఐదుదశాబ్ధాలుగా కొనసాగుతుంది. వెండి తెరపై ఆయన పోషించని పాత్ర అంటూ లేదు.;
మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి సినీ ప్రయాణం ఐదుదశాబ్ధాలుగా కొనసాగుతుంది. వెండి తెరపై ఆయన పోషించని పాత్ర అంటూ లేదు. ఏడాదికి ఎనిమిది సినిమాలైనా ఆయన నుంచి రిలీజ్ అవుతుంటాయి. కథా బలమున్న చిత్రాల్లో స్టార్ ఇమేజ్ దాటొచ్చి పనిచేసే నటుడాయన. ఒకే జానర్ కు పరిమితం కాకుండా కంటెంట్ బేస్డ్ చిత్రాల్లో నటించడం ఆయన ప్రత్యేకత. అందుకే మాలీవుడ్లో ఓ లెజెండ్ గా ఎదిగారు. ఐదు దశాబ్దాల ప్రయాణంలో ఎన్నో విజయాలు అందుకున్నారు. ఈ ఏడాది ఇప్పటికే మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు.
`బజూక` ,` డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్` లాంటి చిత్రాలతో మంచి విజయాలు అందుకున్నారు. తాజాగా మరో కొత్త కథతో ముందుకు రాబోతున్నారు. మమ్ముట్టి ప్రధాన పాత్రలో `కళాంకావల్` అనే చిత్రం తెరకె క్కుతోంది. ఈ చిత్రానికి జితిన్. కె. జోస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధిం చిన పోస్టర్ కూడా నెట్టింట వైరల్ అవుతోంది. మీరు ఊహించిన దాని కంటే ఘోరమైనది ఇది. త్వరలో మరి న్ని సర్ ప్రైజ్ లు ఉంటాయంటూ ప్రకటించారు. అయితే ఈ సినిమాలో హీరోగా, విలన్ గా మమ్ముట్టి ఒక్కరే నటిస్తున్నారని వార్తలొస్తున్నాయి.
ఓ పాత్ర పూర్తిగా నెగిటివ్ కోణంలో కొనసాగుతుందని ప్రచారంలో ఉంది. గతంలో మమ్ముట్టి పోషించిన పాత్రలన్నింటికంటే భిన్నంగా ఈ నెగిటివ్ రోల్ ఉంటుందని అంటున్నారు. ఆ పాత్రలో మమ్ముట్టి ఆ హార్యం సహా గెటప్ పూర్తిగా కొత్తగా ఉంటుందని..ఆ పాత్ర రివీల్ అనంతరం ప్రేక్షకులు థ్రిల్ ఫీలవుతారని కథనాలొస్తున్నాయి. ఇదే సినిమాలో వినాయకన్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అతడి పాత్ర కూడా విలన్ గా కనిపిస్తుందని అంటున్నారు. దీంతో సినిమాలో ప్రధాన విలన్ ఎవరో? అర్దం కానీ సన్నివేశం ఎదురవుతుంది.
మమ్ముట్టికి సంబంధించి పాజిటివ్ రోల్ మాత్రం అత్యంత శక్తివంతంగా డిజైన్ చేసినట్లు మేకర్స్ ప్రకటిం చారు. ఈ పాత్రలో కూడా మమ్ముట్టి ఆహార్యం రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా ఉంటుందంటున్నారు. మరి ఈ తరహా ప్రచారం వెనుక అసలు వాస్తవాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మమ్ముట్టి హీరోగా రెండు సిని మాలు తెరకెక్కుతున్నాయి. అందులో ఒకటి `పేట్రియేట్` కాగా, మరోపేరు లేని చిత్రంలో నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు ఏడాది చివర్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.