మమితా మరో సాయి పల్లవి అవ్వాలంటే..?
ఐతే సాయి పల్లవి తన కెరీర్ లో చాలా ప్రయోగాలు చేసింది. కానీ మమితా ఇప్పుడే కెరీర్ మొదలు పెట్టింది కాబట్టి ఆమెకు ఇంకా అలాంటి ఛాన్స్ లు రాలేదు.;
కొంతమంది హీరోయిన్స్ కి స్టార్ రేంజ్ వచ్చినా అది వాళ్ల గ్లామర్ తోనే అని తెలుస్తుంది. గ్లామర్ షోతో అలరించే భామలు కొందరైతే కేవలం తమ అభినయంతో మెప్పించే వారు ఇంకొంతమంది ఉంటారు. అలాంటి వారిలో మలయాళ భామ మమితా బైజు కూడా వస్తుంది. మమితా బైజు మలయాళ పరిశ్రమలో ఏడేళ్ల నుంచి సినిమాలు చేస్తుంది. ఐతే ప్రతి సినిమాలో మమితా తన టాలెంట్ తో అలరిస్తూ వస్తుంది. ప్రేమలు సినిమాతో ఆమె సౌత్ ఆడియన్స్ అందరికీ బాగా దగ్గరైంది. ప్రేమలు సినిమా తెలుగు ఆడియన్స్ కు కూడా బాగా నచ్చేసింది. అందుకే ఆమెను తెలుగు ప్రేక్షకులు కూడా ఇష్టపడుతున్నారు.
ప్రదీప్ రంగనాథన్ తో డ్యూడ్..
ఐతే తెలుగులోనే కాదు తమిళంలో కూడా మమితాకు మంచి క్రేజ్ ఏర్పడింది. ఆల్రెడీ అమ్మడు అక్కడ సినిమాలు చేస్తుంది. దళపతి విజయ్ జన నాయగన్ తో సినిమా చేస్తున్న మమితా లేటెస్ట్ గా ప్రదీప్ రంగనాథన్ తో డ్యూడ్ లో ఆకట్టుకుంది. డ్యూడ్ సినిమాలో ఆమె రోల్ చూసిన ఆడియన్స్ మరోసారి మమితా ప్రేమలో పడిపోతున్నారు. ప్రతి పాత్ర కథ విన్నప్పుడు ఎలా ఉన్నా తన అభినయంతో మెస్మరైజ్ చేస్తుంది మమితా బైజు.
అందుకే ఆమెను సహజ నటిగా పొగిడేస్తున్నారు ఆడియన్స్. ఇక కొందరైతే మమితాను సాయి పల్లవితో పోల్చేస్తున్నారు. సాయి పల్లవి కూడా అంతే కేవలం పాత్ర ప్రాధాన్యత ఉంది అనిపిస్తే చాలు అది ఎలాంటి సినిమా అయినా చేస్తుంది. ఐతే సాయి పల్లవి తన కెరీర్ లో చాలా ప్రయోగాలు చేసింది. కానీ మమితా ఇప్పుడే కెరీర్ మొదలు పెట్టింది కాబట్టి ఆమెకు ఇంకా అలాంటి ఛాన్స్ లు రాలేదు. కచ్చితంగా సౌత్ ఆడియన్స్ మమితా మీద చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే సాయి పల్లవి తర్వాత ఆమె అనిపించేలా క్రేజ్ తెచ్చుకుంటుంది.
అభినయంతో ఆడియన్స్ ని మెప్పిస్తూ..
మమితా కూడా ఆడియన్స్ లో తనపై ఉన్న నమ్మకాన్ని తగ్గించకూడదని ఫిక్స్ అయ్యింది. గ్లామర్ షో చేయడం వల్ల సినిమా ఛాన్స్ లు వస్తాయేమో కానీ ఒక ఐదారు సినిమాల తర్వాత బోర్ కొట్టేస్తారు. కానీ అభినయంతో ఆడియన్స్ ని మెప్పిస్తూ.. సినిమా సినిమాకు.. ప్రతి పాత్రలో కొత్తగా కనిపిస్తే మాత్రం వాళ్లకి ఎక్కువ కెరీర్ ఉంటుంది. సో మమితాకు కచ్చితంగా మలయాళం మాత్రమే కాదు మిగతా సౌత్ భాషల్లో కూడా మంచి ప్రేక్షకాదరణ లభిస్తుందని చెపడంలో సందేహం లేదు. తెలుగులో వెంకీ అట్లూరి సూర్య సినిమాలో మమితా హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది. ఆ సినిమాతో మరోసారి తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరించనుంది అమ్మడు.