• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఎంటర్టైన్మెంట్ విత్...

ఎంటర్టైన్మెంట్ విత్ ఎమోషన్.. వాళ్లని చూసి రాసి కథ ఇది..!

| మల్లి అంకం డైరెక్ట్ చేసిన ఈ సినిమాను చిలక ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాజీవ్ చిలక నిర్మించారు.

By - Tupaki Desk
Update: 2024-04-29 13:02 GMT

అల్లరి నరేష్ కొద్దిపాటి గ్యాప్ తర్వాత ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా చేసిన సినిమా ఆ ఒక్కటీ అడక్కు. ఈవీవీ గారి సూపర్ హిట్ సినిమా టైటిల్ ని వాడుతూ అల్లరోడు చేస్తున్న ఈ సినిమా మే 3న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మల్లి అంకం డైరెక్ట్ చేసిన ఈ సినిమాను చిలక ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాజీవ్ చిలక నిర్మించారు. ఫరియా అబ్ధుల్లా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ట్రైలర్ తో మంచి బజ్ క్రియేట్ చేసింది. మే 3న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా గురించి మరిన్ని డీటైల్స్ డైరెక్టర్ మల్లి అంకం మీడియాతో పంచుకున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.


ఆ ఒక్కటీ అడక్కు క్లాసిక్ టైటిల్ కదా.. ఈ సినిమాకి పెట్టాలన్నపుడు బరువుగా అనిపించలేదా?

ఆ ఒక్కటీ అడక్కు ఈ కథకు యాప్ట్ టైటిల్. ఈ టైటిల్ పెట్టాలనే ఆలోచన కూడా నరేష్ గారిదే. కేవలం టైటిల్ వరకే తీసుకున్నాం. ఈ కథకు, ఆ సినిమాకు సంబంధం లేదు. పెళ్లి చుట్టూ ఎలాంటి ఎమోషన్స్ ఉంటాయి? కొందరు ఆ ఎమోషన్స్ ని ఎలా క్యాష్ చేసుకుంటారు? ఇలాంటి అంశాలని చాలా వినోదాత్మకంగా చూపిస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అయ్యేలా ప్రెజెంట్ చేశాం. ఇందులో వుండే కంటెంట్ అందరూ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. ఇది అందరినీ అలరించే మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్.

ఆ ఒక్కటీ అడక్కు అనేది ఇందులో ఎవరి మాట ?

హీరోని పెళ్లి గురించి అందరూ అడుగుతున్నప్పుడు ఆయన సమాధానంగా చెప్పే మాట ఆ ఒక్కటీ అడక్కు. నిజానికి పెళ్లి గురించి అందరూ చాలా తేలిగ్గా అడిగేస్తారు కానీ.. తీసుకున్నవారు దాన్ని చాలా పెయిన్ ఫీల్ అవుతారు. ఆ కుటుంబంలో కూడా అదో బాధలా ఉంటుంది. ఇందులో ఆ ఎమోషన్ ని వినోదాత్మకంగా చూపించే ప్రయత్నం చేశారు. ఇందులోని కామెడీ, ఎమోషన్ ఆడియన్స్ ని హత్తుకునేలా ఉంటాయి.

ఇందులో సందేశం ఏవైనా ఉందా ?

ప్రత్యేకంగా సందేశంలా ఉండదు కానీ.. పెళ్లి ఎప్పుడు? అని అడగడం కన్నా మీ దగ్గర ఏదైనా మంచి సంబంధం ఉంటే చూసి పెట్టండనే ఆలోచనని రేకెత్తించేలా ఈ సినిమా ఉంటుంది. అలాగే పెళ్లి సంబంధాల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో కూడా చూపించే ప్రయత్నం చేశాం.

కామెడీ సినిమాల్లో నరేష్ గారికి ఇది రీ ఎంట్రీ లాంటి సినిమా కదా.. ఆయన్ని ఎలా ఒప్పించారు ?

నరేష్ గారిని అమ్మిరాజు గారి ద్వారా కలిశాను. అప్పటికే ఆయన నాలుగు సినిమాలతో బిజీగా వున్నారు. కామెడీ కథ అనేసరికి మొదట అంత ఉత్సాహం చూపించలేదు. అయితే నేను కథ చెప్పడం మొదలుపెట్టాను. ఫస్ట్ హాఫ్ విని షేక్ హ్యాండ్ ఇచ్చి ఈ కథ మనం చేసేద్దాం అన్నారు. నాలుగు సినిమాల్లో రెండు వెనక్కి పెట్టి ఈ సినిమా ముందుకు తీసుకొచ్చారు. అంతలా ఈ కథ ఆయనికి నచ్చింది. ఇందులో కామెడీ తో పాటు చాలా మంచి ఎమోషన్ వుంది. నరేష్ గారి క్యారెక్టరైజేషన్, పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులని అద్భుతంగా అలరిస్తాయి.

ఫరియా అబ్దులా గురించి ?

ఫరియా పాత్ర ఇందులో చాలా కీలకంగా ఉంటుంది. కథ ఆమె పాత్ర ద్వారానే మలుపు తిరుగుతుంది. ఫరియాలో మంచి కామెడీ టైమింగ్ వుంది. ఇందులో తన పాత్రని చాలా అద్భుతంగా చేసింది. సినిమాకు చాలా హెల్ప్ అయ్యింది.

ఈ కథకు స్ఫూర్తి ఉందా ? ఎలాంటి రీసెర్చ్ చేశారు ?

సమాజంలో జరిగే సంఘటనల స్ఫూర్తి వుంది. నా ఫ్రెండ్స్ లో కొంతమందికి పెళ్లి కాలేదు. వారంతా ఒక వేడుకకు వచ్చినపుడు వేదికపైకి రాలేదు. కారణం అడిగితే.. అందరూ పెళ్లి గురించి అడుగుతారు. వారికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక రాలేదని చెప్పారు. అది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. వాళ్ళ పెయిన్ ని ఫీలయ్యాను. అలాగే మ్యాట్రిమోనీకి సంబంధించిన సంఘటనలు, పేపర్ లో వచ్చే కొన్ని వార్తలు కూడా ఆశ్చర్యపరుస్తుంటాయి. వీటన్నిటికీ ఫిక్షన్ జోడించి ఈ కథ చేయడం జరిగింది.

నిర్మాత గురించి ?

చిలక ప్రొడక్షన్ రాజీవ్ గారు చాలా సపోర్ట్ చేశారు. ఈ కథకు కావాల్సిన బడ్జెట్ ని సమకూర్చారు. వారితో నాకు ముందే అనుబంధం వుంది. ఛోటా బీమ్స్ కి సంబంధించిన కొన్ని పనులు నేనే చేసేవాడిని. వారికి ఎప్పటినుంచో సినిమా చేయాలని వుంది. అలాంటి సమయంలో ఈ కథ చెప్పాను. వారికి నచ్చడంతో ప్రాజెక్ట్ మొదలైయింది.

డైలాగ్ రైటర్ అబ్బూరి రవి గురించి ?

అబ్బూరి రవి గారు ఎమోషన్ ని అద్భుతంగా రాస్తారు. ఇందులో కూడా మాటలు ఆకట్టుకునేలా ఉంటాయి. రవి గారు సినిమాకి చాలా హెల్ప్ అయ్యారు.

సినిమాలపై మీకు ఆసక్తి ఎప్పుడు ఏర్పదింది ?

నేను బియస్సీ పూర్తి చేశాను. ఒకసారి మా కాలేజ్ కి దాసరి నారాయణ గారు అతిధిగా వచ్చారు. అప్పుడు నేనో స్కిట్ రాశాను. చాలా బాగా రాశావ్ అని ఆయన మెచ్చుకున్నారు. తెలియకుండానే అప్పటి నుంచి పరిశ్రమలోకి రావాలనే ఆసక్తి ఏర్పడింది. ఇక్కడి వచ్చిన తర్వాత భాను శంకర్ గారు, సాయి కిరణ్ అడవి తో పాటు మరికొన్ని చోట్ల పని చేశాను.

గోపీసుందర్ మ్యూజిక్ గురించి ?

గోపీసుందర్ చాలా అద్భుతమైన పాటలు ఇచ్చారు. అవుట్ పుట్ చూశాక చాలా ఆనందంగా అనిపించింది. నేపథ్య సంగీతం హత్తుకునేలా చేశారు.

జామీ లివర్ ని తెలుగు పరిచయం చేయడం గురించి ?

జామీ లివర్ ఇందులో నరేష్ గారి తమ్ముడి భార్య పాత్రలో కనిపిస్తారు. ఆ పాత్ర చాలా హిలేరియస్ గా ఉంటుంది. ఆమె చేసిన ఓ వెబ్ సిరిస్ చూశాం. మా పాత్ర ఆమె అయితే సరిగ్గా సరిపోతారనిపించింది. తీరా చూస్తే ఆమె జానీ లీవర్ గారి కుమార్తె. జామీ చాలా చక్కని తెలుగు మాట్లాడుతుంది. ఇందులో హర్ష, వెన్నెల కిషోర్ పాత్రలు కూడా వినోదాత్మకంగా వుంటాయి. పాత్రలన్నీ ఎంటర్టైనింగ్ గా ఉంటూనే ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాయి.

ఫస్ట్ కాపీ చూసిన తర్వాత నరేష్ గారి రియాక్షన్ ఏమిటి ?

నరేష్ గారు ఫస్ట్ కాపీ చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ఇది వారి నాన్నగారి టైటిల్. ఖచ్చితంగా భాద్యత మరింతగా వుంటుంది. సినిమా చూసిన తర్వాత నమ్మకాన్ని నిలబెట్టాననే భావన ఆయనలో కనిపించింది. టీం అంతా అవుట్ పుట్ పై చాలా ఆనందంగా, నమ్మకంగా వున్నాం.

సినిమా సెన్సార్ పూర్తయింది. సెన్సార్ వాళ్ళు మంచి పాయింట్ చెబుతున్నారని చాలా హ్యాపీగా ఫీలయ్యారు. చాలామందికి తెలియని విషయాలు చెబుతున్నారని అభినందించారు.

కొత్తగా చేయబోయే ప్రాజెక్ట్స్ ?

కొన్ని కథలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం నా దృష్టి ఈ సినిమా విడుదలపైనే వుంది.

Tags:    
  • Tollywood 
  • AaOkkatiAdakku 
  • AllariNaresh 
  • FariaAbdullah 
  • VennelaKishore 
  • JamieLever 
  • MalliAnkam 
  • RajivChilaka 
  • ChilaProductions 

Similar News

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

సల్మాన్ ఖాన్ స్టైల్‌లో మలైకా అరోరా రియాక్షన్!

2026-11-02 09:48 GMT

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

ఇక నిర్మాతలు ముందే అన్ని చూసుకోవాల్సిందే.. లాస్ట్ మినిట్ ప్లానింగ్‌కు చెక్..!

2026-11-02 07:34 GMT

మహేష్ బాబు నెక్స్ట్ మూవీ పై క్లారిటీ వచ్చేసిందా? తన డ్రీమ్ రోల్ లో కనిపిస్తాడా?

2026-11-02 07:34 GMT

Copyright @2026

Powered by Blink CMS