• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'రాజాసాబ్‌' బ్యూటీ నిఖత్‌...

'రాజాసాబ్‌' బ్యూటీ నిఖత్‌ లుక్‌ స్టన్నింగ్‌

| ఇటీవల విడుదల అయిన తంగలాన్‌ సినిమాలో నటించి, తన నటనతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న ముద్దుగుమ్మ మాళవిక మోహనన్‌.

By - Tupaki Desk
Update: 2024-08-27 20:30 GMT

ఇటీవల విడుదల అయిన తంగలాన్‌ సినిమాలో నటించి, తన నటనతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న ముద్దుగుమ్మ మాళవిక మోహనన్‌. ఇన్నేళ్ల కెరీర్‌ లో తంగలాన్ లో చేసిన మంత్రగత్తె పాత్ర చాలా విభిన్నమైనదిగా ఆమె ఫ్యాన్స్ తో పాటు, మీడియా వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు. తమిళనాట ఈ అమ్మడు వరుసగా సినిమాలు చేస్తూనే మరో వైపు ఇతర భాషల సినిమాల్లో కూడా కనిపిస్తూ మెప్పిస్తోంది. తెలుగు లో ప్రభాస్‌ కు జోడీగా రాజాసాబ్‌ సినిమాలో ఈ అమ్మడు నటిస్తున్న విషయం తెల్సిందే. ఆమె ఫ్యాన్స్ ప్రస్తుతం రాజాసాబ్ సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నారు.


టాలీవుడ్‌ మూవీ రాజా సాబ్ కంటే ముందు హిందీలో ఎంట్రీ ఇవ్వబోతున్న యుధ్ర సినిమా నుంచి ఆమె లుక్ రివీల్‌ అయ్యింది. సిద్దాంత్‌ చతుర్వేది హీరోగా రవి ఉద్యవర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ మూవీ యుధ్ర లో మాళవిక మోహనన్‌ నిఖత్‌ పాత్రలో కనిపించబోతుంది. తాజాగా ఆమె పాత్రకు సంబంధించిన పోస్టర్ ను అధికారికంగా విడుదల చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఆమెను చూసిన పాత్రలతో పోల్చితే ఈ పాత్ర మరింత ఆకర్షణీయంగా, అందంగా ఉండబోతుందని, అంతే కాకుండా చాలా పవర్ ఫుల్‌ గా నిఖత్‌ పాత్ర ఉంటుందని ఈ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్ ను చూస్తే అనిపిస్తోంది.

యుధ్ర సినిమాను సెప్టెంబర్‌ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఇప్పటి వరకు తమిళంలో ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాల్లో కనిపించిన మాళవిక మొదటి సారి హిందీ సినిమా చేసిన నేపథ్యంలో ఆమె ఫ్యాన్స్‌ తో పాటు, కోలీవుడ్‌ మీడియా మొత్తం కూడా యుధ్ర సినిమా వైపు ఆసక్తిగా చూస్తున్నారు. హిందీలో మొదటి సినిమాతోనే కమర్షియల్‌ గా మంచి విజయాన్ని మాళవిక అందుకోవడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. విడుదలకు మరో మూడు వారాల గడువు ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేసి సినిమా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

మాళవిక మోహనన్ టాలీవుడ్‌ ఎంట్రీ విషయానికి వస్తే ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజాసాబ్‌ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్‌ లో ఒక్క హీరోయిన్‌ గా మాళవిక మోహనన్ నటిస్తుంది. ఆమె పాత్ర గురించి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్‌ లేదు. రాజాసాబ్ సినిమా కమిట్‌ అయిన తర్వాత టాలీవుడ్‌ లో ఒకటి రెండు ఆఫర్లు వచ్చినా కూడా ఆమె తిరస్కరించినట్లుగా తెలుస్తోంది. రాజా సాబ్ తర్వాత స్టార్‌ హీరోల సినిమాలకు మోస్ట్‌ వాంటెడ్‌ గా మాళవిక మారే అవకాశాలు ఉన్నాయని ఆమె సన్నిహితులు భావిస్తున్నారు. ఆమె కూడా రాజాసాబ్‌ పై చాలా ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తోంది.

Tags:    
  • Malavikamohanan 
  • Actress 
  • Filmindustry 
  • Movies 
  • Yudhra 
  • Firstlook 
  • Rajasaab 
  • Tollywood 

Similar News

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

Copyright @2026

Powered by Blink CMS