'సౌత్ లో బొడ్డు జూమ్ చేసి మరీ..' రాజాసాబ్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్
మాలీవుడ్ బ్యూటీ మాళవిక మోహనన్ గురించి అందరికీ తెలిసిందే.;
మాలీవుడ్ బ్యూటీ మాళవిక మోహనన్ గురించి అందరికీ తెలిసిందే. మాస్టర్ మూవీతో టాలీవుడ్ కు పరిచయమైన అమ్మడు.. ఆ తర్వాత వివిధ సినిమాల్లో యాక్ట్ చేసి తన నటనతో మెప్పించింది. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు జోడీగా రాజాసాబ్ లో యాక్ట్ చేస్తున్న మాళవిక.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది. హౌటర్ ప్లై ఇంటర్వ్యూలో అమ్మడు పాల్గొనగా, దక్షిణాది సినిమాల్లో నాభి వ్యామోహం ఎక్కువగా ఉంటుందనేది నిజమేనా అని హోస్ట్ అడిగారు. దీంతో అది నిజమే, సౌత్ సినిమాల్లో బొడ్డు చూపించడానికి ఎక్కువ ఇష్టపడతారని మాళవిక వ్యాఖ్యానించింది.
"దక్షిణాది చిత్రాల్లో నాభి, నడుము అందాలపైనే ఎక్కువ ఫోకస్ పెడతారు. హీరోయిన్స్ విషయంలో.. నడుము, ఒంపులు ఎక్కువగా ఉన్న వారినే ఇష్టపడతారు. నేను ముంబైలో పెరిగా. కాబట్టి అలా చూసి షాకయ్యా. అది నాకు చాలా కొత్త విషయం. నాభిపై అంత మక్కువ ఏంటో మరి" అంటూ మాళవిక మోహనన్ చెప్పుకొచ్చింది.
సోషల్ మీడియాలో హీరోయిన్స్ పిక్స్ చూసినప్పుడు.. ఫుల్ గా జూమ్ చేస్తారని, అప్పుడు వాళ్ల బాడీ పార్టులు చూస్తారని మాళవిక తెలిపింది. అదే సమయంలో కెరీర్ స్టార్టింగ్ లో సన్నగా ఉండడం ట్రోల్స్ వచ్చాయని గుర్తు చేసుకుంది. 21 ఏళ్ల వయసులో డెబ్యూ ఇచ్చిన తనను చూసి చాలా ట్రోల్ చేశారని తెలిపింది.
"20 ఏళ్లప్పుడు బాగా సన్నబడ్డా. అప్పుడు చూసి అంతా ట్రోల్స్ చేస్తే ఎంతో బాధపడ్డా. ఆ సమయంలో చాలా కష్టంగా అనిపించేది. ఎముకల గూడు, ఎమ్ముకల మీద చర్మం అని కామెంట్ చేసేవారు. వీటి కన్నా ఇంకా చాలా అవమానకర మాటలు పడ్డాను. ఎన్నో సార్లు నన్ను చాలా మంది అవమానించారు" అని చెప్పింది.
అయితే యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు ఒకరు తమ బాడీపై అవమానకరంగా కామెంట్స్ చేయడం అస్సలు మంచి విషయం కాదని తెలిపింది. చెప్పాలంటే.. అది కూడా ఒక బెదిరింపు లాంటిదేనని చెప్పిన మాళవిక.. తాను చాలా ఇబ్బంది పడ్డానని, బాధపడ్డానని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం మాళవిక కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.