• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వారికి ప్ర‌త్యేక స్థానం!...

వారికి ప్ర‌త్యేక స్థానం! మ‌లైకా పోస్ట్ ఎవ‌రినుద్ధేశించి?

| ఇలాంటి స‌మ‌యంలో మలైకా ఇటీవల తన ఇన్‌స్టా కథనంలో ఒక రహస్య పోస్ట్‌ను షేర్ చేసారు.

By - Tupaki Desk
Update: 2024-09-10 21:30 GMT

చాలా కాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్న అర్జున్ కపూర్ - మలైకా అరోరా జంట‌ విడిపోయారని ఇటీవ‌ల క‌థ‌నాలొచ్చిన సంగ‌తి తెలిసిందే. వారి రిలేషన్ స్టాట‌స్ గురించి ర‌క‌ర‌కాలుగా పుకార్లు షికార్ చేస్తున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో మలైకా ఇటీవల తన ఇన్‌స్టా కథనంలో ఒక రహస్య పోస్ట్‌ను షేర్ చేసారు. దాని సారాంశం ఇలా ఉంది.

''మీ ఆనందంలో పాలుపంచుకునే వారి పట్ల శ్రద్ధ వహించండి.. మీ బాధను అనుభవించండి.. వారు మీ హృదయంలో ప్రత్యేక స్థానానికి నిజంగా అర్హులు'' అని పోస్ట్‌లో ఉంది.. మ‌లైకా ఎవ‌రి పేరును దీనికి జ‌త చేయ‌లేదు. క్యాప్షన్‌ను చేర్చలేదు. కానీ అర్జున్ కపూర్ నుంచి విడిపోయిందనే పుకార్ల కారణంగా మ‌లైకా పేరు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అంతకుముందు మలైకా అరోరా గత నెలలో అర్జున్ పుట్టినరోజు వేడుకలు అతడి నివాసంలో సెల‌బ్రేట్ చేయ‌గా వాటికి స్కిప్ చేసింది. ఇది బ్రేకప్ పుకార్లకు ఆజ్యం పోసింది. మ‌లైకా బ‌ర్త్ డే వేడుక‌ల‌ను అర్జున్ స్కిప్ కొట్టాడు. ఈ రెండు సంద‌ర్భాలు సందేహాల‌ను రాజేసాయి.

త‌న బ్రేక‌ప్ గురించిన‌ చ‌ర్చ పేరుతో ఆన్ లైన్ లో ఎలాంటి ప్ర‌తికూల‌త‌ను వ్యాప్తి చేసారో చెబుతూ మ‌లైకా క‌ల‌త‌కు గురైంది. గతంలో హలో మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంటర్నెట్ విషపూరిత స్వభావం గురించి మలైకా వెల్లడించింది. నేను ఒక మెకానిజం లేదా షీల్డ్‌ను అభివృద్ధి చేసాను.. ఇక్కడ ప్రతికూలత నన్ను ప్రభావితం చేయనివ్వదు! అని మ‌లైకా వెల్లడించింది. నేను ప‌ని చేసే చోట‌.. సోషల్ మీడియా లేదా ట్రోల్‌లు అన్నిటి నుండి నన్ను రక్షించుకున్నాను. నేను ఆ ప్రతికూల శక్తిని తెలుసుకున్న మ‌రుక్షణం వాటికి దూరంగా ఉంటాను. ఇది నేను కాలక్రమేణా నేర్చుకున్న నైపుణ్యం. గతం.. అది నన్ను ప్రభావితం చేస్తుంది. ప్రభావితం చేయదని చెబితే అది అబద్ధం. నేను మ‌నిషిని.. ఏడుస్తాను.. బ్రేక్ అవుతాను. ట్రోలింగ్ జ‌రిగిన‌ప్పుడు అన్ని భావోద్వేగాలను అనుభవిస్తాను... కానీ మీరు నేను ఎలా ఉన్నానో పబ్లిక్‌గా చూడలేరు..! అని అన్నారు.

మలైకా- అర్జున్ 2018లో డేటింగ్ ప్రారంభించారు. ఇద్దరూ తమ రిలేషన్ షిప్ గురించి పెద్దగా బ‌హిరంగంగా చ‌ర్చించ‌క‌పోయినా వెకేష‌న్ల నుంచి ఫోటోలు, వీడియోల‌ను షేర్ చేసారు. అలాగే ఒకరికొకరు పుట్టినరోజులు సెల‌బ్రేట్ చేసారు. కానీ అవేవీ ఇప్పుడు లేవు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. అర్జున్ విల‌న్‌గా నటించిన `సింగం ఎగైన్` విడుదలకు సిద్ధమవుతోంది. అజయ్ దేవగన్, దీపికా పదుకొణె, టైగర్ ష్రాఫ్, రణ్‌వీర్ సింగ్ , అక్షయ్ కుమార్ తదితరులు నటించిన ఈ చిత్రం దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. మ‌లైకా బుల్లితెర రియాలిటీ షోలు, ప్ర‌క‌ట‌న‌ల ద్వారా భారీగా ఆర్జిస్తోంది.

Tags:    
  • Bollywood 
  • Filmindustry 
  • Arjunkapoor 
  • Malaikarora 
  • Relationship 
  • InstagramStory 
  • Arjunbirthday 
  • Malaikabirthday 
  • Interview 

Similar News

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

మరిచిపోతున్న సినిమాకి హంగులు ఎందుకు..!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS