51 వయసులో నడుము స్ట్రెచ్ చేస్తూ మలైకా
తాజాగా మలైకా స్పెషల్ క్లాస్ యూత్ లోకి దూసుకెళుతోంది. ఇది నడుము, పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును కరిగించి, సోగ దేహాన్ని అందించడంలో సహకరించే యోగా అండ్ ఫిట్నెస్ వ్యాయామం.;
51 వయసులోను కుర్రకారును కిల్ చేయడమెలానో మలైకాకు తెలిసినంతగా ఎవరికీ తెలీదేమో! ఈ భామ నిరంతర ఇన్ స్టా పోస్టులు దీనికి ప్రత్యక్ష సాక్ష్యం. యోగా, ధ్యానం, జిమ్ వంటి రెగ్యులర్ దినచర్యతో ఫిట్ గా కనిపించే ఈ భామ నేటితరానికి గొప్ప స్ఫూర్తి.
తాజాగా మలైకా స్పెషల్ క్లాస్ యూత్ లోకి దూసుకెళుతోంది. ఇది నడుము, పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును కరిగించి, సోగ దేహాన్ని అందించడంలో సహకరించే యోగా అండ్ ఫిట్నెస్ వ్యాయామం. ఈ వీడియోలో మలైకా తల వెనుక చేతులు ఉంచి మడమల మీద కూర్చొని నడుమును నెమ్మదిగా పద్ధతిగా కదిలిస్తోంది. ఎడమ నుండి కుడికి, కుడి నుంచి ఎడమకు కదులుతూ నడుముపై ఒత్తిడి పెంచే సింపుల్ వ్యాయామమిది. ఆఫీస్ లో ఎక్కువ సేపు కూర్చుని పని చేసేవారికి ఈ వ్యాయామం గొప్పగా డిటాక్స్ చేస్తుందని మలైకా చెబుతోంది. ప్రతివైపు 10 సార్లు దీన్ని చేయాలని సూచించింది.
ఈ ప్రత్యేక వ్యాయామం కోసం మలైకా ఎంపిక చేసుకున్న దుస్తులు అందరి దృష్టిని ఆకర్షించాయి. మెటాలిక్ షార్ట్స్, మ్యాచింగ్ స్పోర్ట్స్ బ్రాలో మలైకా ఫ్యాషనిస్టా వైబ్స్ ని వెదజల్లుతోంది. మలైకా అరోరా లేటు వయసులోనూ నాజూకు శరీరాన్ని ప్రదర్శించడాన్ని గర్వంగా ఫీలవుతోంది. ఇటీవల ఈ భామ సినిమాలతో కంటే రియాలిటీ షోల జడ్జిగానే బిజీగా గడిపేస్తోంది. ముఖ్యంగా డ్యాన్స్ రియాలిటీ షోలతో మలైకా నిరంతరం అభిమానులకు టచ్ లో ఉంది. అర్జున్ కపూర్ నుంచి విడిపోయాక సోలో లైఫ్‌ని ముందుకు నడిపించేస్తోంది.