అక్కా-చెల్లితో పాటు కుటుంబ‌మే దిక్కు!

ఫిట్‌నెస్ ఐకాన్, నటి మలైకా అరోరా వ్యక్తిగత జీవితం - వృత్తిపరమైన విషయాలు ఎంతో ఓపెన్ గా పంచుకుంటారు.;

Update: 2026-05-03 02:45 GMT

ఫిట్‌నెస్ ఐకాన్, నటి మలైకా అరోరా వ్యక్తిగత జీవితం - వృత్తిపరమైన విషయాలు ఎంతో ఓపెన్ గా పంచుకుంటారు.ఈ నేప‌థ్యంలో తాజాగా ఎప్పుడైనా? జీవితంలో ఏదైనా సంక్షోభం ఎదురైతే ఎవరి సహాయం కోరుకుంటాను అనే విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కష్ట సమయాల్లో అండగా నిలిచే వ్యక్తులు జీవితంలో ఎంత ముఖ్యమో మ‌లైకా ఈ సందర్భంగా చెప్పే ప్ర‌య‌త్నం చేసారు. మలైకా తన జీవితంలో కుటుంబానికే ప్రథమ ప్రాధాన్యత ఇస్తానన్నారు. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు మొట్టమొదట సంప్రదించేది తన కుటుంబాన్నే అన్నారు.

ముఖ్యంగా తల్లి జాయిస్ పాలీకార్ప్ - సోదరి అమృతా అరోరా తనకు కొండంత అండగా ఉంటారన్నారు. వారితో ఉన్న అనుబంధం తనను మానసికంగా ఎంతో దృఢంగా మారుస్తుందని చెప్పుకొచ్చారు. రక్త సంబంధీకులు ఇచ్చే ధైర్యం మరేదీ ఇవ్వలేదని అభిప్రాయపడ్డారు. కుటుంబంతో పాటు త‌న ప్రాణ స్నేహితులైన కరీనా కపూర్ ఖాన్ - కరిష్మా కపూర్ గురించి కూడా మలైకా ప్రత్యేకంగా ప్రస్తావించారు. వీరిద్దరూ తన జీవితంలో విడదీయలేని భాగమని, ఏ చిన్న ఆపద వచ్చినా వెన్నంటే ఉంటారని గర్వంగా చెప్పారు. `గర్ల్ గ్యాంగ్` గా పిలవబడే వీరి స్నేహం బాలీవుడ్‌లో ఎంతో ఫేమస్.

ఒత్తిడిలో ఉన్నప్పుడు, క‌ష్ట కాలంలో ఉన్నప్పుడు వారిచ్చే సలహాలు, చూపించే చొరవ తనను సేఫ్ జోన్‌లో ఉంచుతాయన్నారు. ఈ సందర్భంగా మలైకా కుమారుడు అర్హాన్ ఖాన్ గురించి కూడా ఎమోషనల్ అయ్యారు. అర్హాన్ ఖాన్ ఇప్పుడెంతో పరిణతి చెందాడని తన కష్టసుఖాలను పంచుకోగలిగే స్నేహితుడిగా మారాడని కొనియాడారు. తల్లిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే, కొడుకు నుండి లభించే నైతిక మద్దతు తనను మరింత ముందుకు నడిపిస్తుందన్నారు. తన చుట్టూ ఉన్న ఈ వ్యక్తులే తన బలం అని మ‌లైకా స్పష్టం చేశారు.

కెరీర్ పరంగా - వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా? మలైకా వాటిని ధైర్యంగా ఎదుర్కోవడానికి కారణం ఆమె ఎంచుకున్న ఈ సపోర్ట్ సిస్టమ్ అని చెప్పొచ్చు. గ్లామర్ ప్రపంచంలో నిజమైన బంధాలను కనుగొనడం కష్టమని భావించే వారికి మలైకా కుటుంబం -స్నేహితులతో కొనసాగిస్తున్న సుదీర్ఘ అనుబంధం చూస్తే చాలు. బాహ్య ప్రపంచానికి కనిపించే గ్లామర్ కంటే? మనశ్శాంతిని ఇచ్చే వ్యక్తులే ముఖ్యమని మ‌లైకా చెప్ప‌క‌నే చెప్పారు. అలాగే మలైకా ఫిట్‌నెస్ ప్రయాణం - యోగా పట్ల ఉన్న మక్కువ గురించి కూడా ప్రస్తావించారు. మానసిక ఆరోగ్యం - శారీరక దృఢత్వం రెండూ ఒకదానికొకటి తోడైతేనే జీవితంలో ఎలాంటి సంక్షోభానైనా జయించొచ్చ‌ని సూచించారు. తన చుట్టూ ఉన్న ఆత్మీయులు ఇచ్చే ధైర్యంతో మరిన్ని కొత్త ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరించేందుకు తానెప్పుడు సిద్ధంగా ఉంటానని పేర్కొన్నారు.

Tags:    

Similar News