డ్రీమ్ వెకేషన్.. మలైకా అరోరా లగ్జరీ రిలాక్స్ మోడ్ వైరల్
అయితే ఈసారి ఆమె తన లగ్జరీ వెకేషన్ పిక్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మాల్దీవుల్లోని ఒక అత్యంత ఖరీదైన, ప్రత్యేకమైన వెల్నెస్ రిసార్ట్‌లో మలైకా లగ్జరీ రిలాక్స్ మోడ్‌లోకి వెళ్ళిపోయింది.
బాలీవుడ్ ఫిట్‌నెస్ బ్యూటీ మలైకా అరోరా ఎప్పుడూ తన స్టైల్, గ్లామర్‌తో వార్తల్లో నిలుస్తుంటుంది. అయితే ఈసారి ఆమె తన లగ్జరీ వెకేషన్ పిక్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మాల్దీవుల్లోని ఒక అత్యంత ఖరీదైన, ప్రత్యేకమైన వెల్నెస్ రిసార్ట్‌లో మలైకా లగ్జరీ రిలాక్స్ మోడ్‌లోకి వెళ్ళిపోయింది. ప్రకృతి ఒడిలో ఆమె గడుపుతున్న ఈ డ్రీమ్ వెకేషన్ విశేషాలు, ఆ లగ్జరీ రిసార్ట్ ప్రత్యేకతలు, విశేషాలు చూద్దాం.
మాల్దీవుల్లో మలైకా సందడి:
రోజువారీ బిజీ లైఫ్ నుండి కాస్త బ్రేక్ తీసుకున్న మలైకా అరోరా, తన బాడీ అండ్ మైండ్‌ను రీఛార్జ్ చేసుకోవడానికి మాల్దీవులను ఎంచుకుంది. అక్కడ దిగిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇక ఈ ఫొటోల్లో ఆమె ఎంతో ప్రశాంతంగా, ఎంజాయ్ చేస్తూ కనిపించడంతో ఫ్యాన్స్ లైకుల వర్షం కురిపిస్తున్నారు.
జోవాలి బీయింగ్ స్పెషాలిటీ:
మలైకా బస చేసిన రిసార్ట్ పేరు ‘జోవాలి బీయింగ్’. ఇది మాల్దీవుల్లోని బోడుఫుషి ఐలాండ్‌లో ఉంది. సాధారణ వెకేషన్ స్పాట్స్ లాగా కాకుండా, ఇది కేవలం మనుషుల మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసమే డిజైన్ చేసిన మాల్దీవుల మొదటి 'నేచర్-ఇమ్మర్సివ్ వెల్నెస్ రిసార్ట్'. ఇక ఇక్కడికి కేవలం రిలాక్స్ అవ్వడానికి మాత్రమే సెలబ్రిటీలు వస్తుంటారు.
ప్రకృతితో ముడిపడిన డిజైన్:
ఈ రిసార్ట్ ఎంట్రన్స్, అక్కడ నడిచే దారి అన్నీ 'బయోఫిలిక్ డిజైన్' పద్ధతిలో నిర్మించారు. అంటే అక్కడి అడవులు పాడు చేయకుండా కట్టారు. ఇక చుట్టూ పెద్ద పెద్ద తాటి చెట్లు, కింద స్వచ్ఛమైన నీటి కొలనుల మధ్యలో ఉండే రాతి నడక దారి ఈ రిసార్ట్ కే హైలైట్.
మనసును కరిగించే థెరపీలు:
ఈ ద్వీపంలో మైండ్, స్కిన్, ఎనర్జీ అనే ముఖ్యమైన విషయాలపై శ్రద్ధ పెడతారు. ఇక్కడ మలైకా కోసం స్పెషల్ సౌండ్ థెరపీ, ప్రత్యేకమైన పోషకాహార డైట్ ఏర్పాటు చేశారు. అంతేకాదు, మలైకా ఇక్కడ సొంతంగా పర్ఫ్యూమ్ తయారు చేసుకునే క్లాస్‌లో కూడా పాల్గొంది.
మలైకా ఏమందంటే?:
తన వెకేషన్ గురించి మలైకా చెప్తూ.. "ఇక్కడ గడిపిన ప్రతి క్షణం ఎంతో అద్భుతంగా అనిపించింది. విల్లాలో ప్రశాంతమైన ఉదయాలు, వెల్నెస్ ఆచారాలు, మనసుకు నచ్చిన భోజనం నన్ను పూర్తిగా రిలాక్స్ చేశాయి. మనల్ని మనం మళ్లీ కొత్తగా ఆవిష్కరించుకోవడానికి, రీఛార్జ్ అవ్వడానికి ఇది ఒక పర్ఫెక్ట్ ప్లేస్" అంటూ రాసుకొచ్చింది.
కంటికి ఇంపుగా కనిపించే బీచులు, లగ్జరీ సదుపాయాలతో కూడిన ఈ వెకేషన్ ఎవరికైనా డ్రీమ్ అనే చెప్పాలి. మలైకా అరోరా షేర్ చేసిన ఈ ఫొటోలు చూస్తుంటే, ఒత్తిడితో వున్న లైఫ్ నుండి దూరంగా వెళ్లి ఇలాంటి ఒక ప్రశాంతమైన చోట గడపాలని ప్రతి ఒక్కరికీ అనిపించక మానదు.