• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రెండో పెళ్లికి...

రెండో పెళ్లికి సిద్ధమవుతున్న స్టార్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

| బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి 'బిచ్చో' అనే సినిమాతో అరంగేట్రం చేసిన ఈమె కెరియర్ పీక్స్ లో ఉండగానే అర్బాజ్ ఖాన్ ను వివాహం చేసుకుంది.

By - Madhu Reddy
Update: 2025-08-17 21:30 GMT

ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో చాలామంది అలా పెళ్లి చేసుకుని ఇలా విడిపోతున్నారు. విడిపోయిన వారు మళ్లీ జీవితంలో కొత్త తోడును వెతుక్కుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాను కూడా రెండో పెళ్లికి సిద్ధం అంటూ 51 ఏళ్ల వయసులో షాకింగ్ కామెంట్స్ చేసింది హాట్ హీరోయిన్. ఆమె ఎవరో కాదు మలైకా అరోరా. అటు వ్యక్తిగత విషయాలతో నిత్యం వార్తల్లో నిలిచే ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు రెండో పెళ్లికి సిద్ధమయ్యాను అంటూ చెప్పడంతో పలువురు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్. అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..


బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి 'బిచ్చో' అనే సినిమాతో అరంగేట్రం చేసిన ఈమె కెరియర్ పీక్స్ లో ఉండగానే అర్బాజ్ ఖాన్ ను వివాహం చేసుకుంది. వివాహం తర్వాత ఒక కుమారుడు కూడా జన్మించారు.. కానీ వీరి బంధం ఎక్కువ కాలం నిలవలేదు. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో 2017లో విడాకులు తీసుకున్నారు. వైవాహిక బంధంలో ఇద్దరు విడిపోయినా.. కుమారుడి బాధ్యతలను మాత్రం ఇద్దరూ సమానంగా తీసుకోవడం ఇక్కడ గమనించదగ్గ విషయం.ఇకపోతే భర్త నుంచి విడిపోయిన తర్వాత మలైకా తనకంటే 12 ఏళ్ళు చిన్నవాడైన అర్జున్ కపూర్ తో డేటింగ్ చేసింది. కొంతకాలం పార్టీలకు, వెకేషన్ లకి వెళ్లి ఫుల్ ఎంజాయ్ చేశారు.. త్వరలోనే పెళ్లి చేసుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ అనూప్యంగా విడిపోయి అందరికి షాక్ ఇచ్చారు ఈ జంట.

ఇలాంటి సమయంలో ఇప్పుడు మళ్లీ మలైకా ఇంకో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది. మలైకా మాట్లాడుతూ.." నేను, అర్భాజ్ ఖాన్ భార్య భర్తలుగా విడిపోయినా మా కొడుకు కోసం తల్లిదండ్రులుగా నిలబడ్డాము. ప్రస్తుతం వాడికి 22 ఏళ్ళు వచ్చాయి. ఎక్కడ ఎలా మాట్లాడాలో అతడికి బాగా తెలుసు. విడాకుల వల్ల నా కొడుకు జీవితం ఎఫెక్ట్ కాకూడదని ఇద్దరం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాము. నిజానికి నా భర్త నుండి నేను విడాకులు తీసుకోవాలని అనుకోలేదు. కలిసే ఉండాలని అనుకున్నాను. కానీ తప్పని పరిస్థితుల్లో విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. అప్పుడు చాలామంది నన్నే నిందించారు. వేలెత్తి చూపించారు. సెల్ఫిష్ అంటూ విమర్శించారు. కానీ అన్నింటిని ఓర్చుకున్నాను.

ప్రస్తుతం నేను ఆనందంగా ఉండాలని.. గతంలో వివాహ బంధం నుంచి బయటకు వచ్చాను. ఆ నిర్ణయం నన్ను ఇప్పుడు మెరుగైన వ్యక్తిగా మార్చడానికి సహాయపడింది. నేను ఒక హార్డ్ కోర్ రొమాంటిక్ వ్యక్తిని. నేను ప్రేమను చాలా బలంగా నమ్ముతాను. కాబట్టి మంచి వ్యక్తి దొరికితే మళ్ళీ కచ్చితంగా రెండో పెళ్లి చేసుకుంటాను". అంటూ మలైకా అరోరా కామెంట్లు చేసింది. ఇందుకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ వయసులో మళ్లీ రెండో పెళ్లి ఏంటి అంటూ పలువురు పలు కామెంట్లు చేస్తున్నారు. మరి మలైకా అరోరా మనసును మెచ్చే ఆ వ్యక్తి ఎప్పుడు ఎక్కడ దొరుకుతాడో చూడాలి.

Tags:    
  • MalaikaArora 
  • SecondMarriage 
  • BollywoodNews 
  • LoveAndLife 
  • ArbaazKhan 
  • ArjunKapoor 
  • 51YearsYoung 
  • CelebrityUpdate 
  • వీడ్కోలు 
  • రెండోపెళ్లి 
  • మలైకా అరోరా 
  • MalaikaAroraNews 

Similar News

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

Copyright @2026

Powered by Blink CMS