నా అసలు వయసు ఏంటంటే..!
బాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండియాలోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్న ముద్దుగుమ్మ మలైకా అరోరా.;
బాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండియాలోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్న ముద్దుగుమ్మ మలైకా అరోరా. ఈమె చేసింది తక్కువ సినిమాలే అయినా ఈమెకు ఐటెం సాంగ్స్ మంచి ఫేమ్‌ను తెచ్చి పెట్టాయి. ఈ మధ్య కాలంలో ఈమె సినిమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తున్న అందాల ఆరబోత ఫోటోలు, వీడియోలు, బుల్లి తెరపై ఈమె చేస్తున్న రియాల్టీ షో ల కారణంగా ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంది. ఆకట్టుకునే అందం తో పాటు మంచి ఫిజిక్ ఈమె సొంతం అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంతో మంది అయిదు పదుల వయసులోనూ మలైకా అరోరా ఫిట్ నెస్ చూడండి అంటూ సోషల్ మీడియా ద్వారా ఆమె ఫోటోలు, వీడియోలను షేర్ చేయడం మనం చూస్తూనే ఉంటాం. రెగ్యులర్‌గా ఇప్పటికీ వర్కౌట్స్ చేస్తూ ఉండే మలైకా అరోరా వయసు గురించి ఇప్పుడు గందరగోళం ఉంది.
మలైకా అరోరా వయస్సు...
సాధారణంగా సెలబ్రిటీల వయసు, వారి పుట్టిన రోజు తెలుసుకోవాలి అంటే దాదాపు అందరూ గూగుల్‌ను ఆశ్రయిస్తారు. దాదాపు అందరు సెలబ్రిటీల యొక్క పుట్టిన తేదీ, అలాగే వయసును గుగూల్ చెబుతుంది. దాన్నే అంతా ఫాలో అవుతారు. ఇక మలైకా అరోరా విషయానికి వస్తే ఆమె వయసును గూగుల్‌ను అడిగిన వెంటనే 52 ఏళ్లు అని చెబుతుంది. వికీపీడియాలోనూ మలైకా అరోరా పేజ్ లో ఆమె వయసు 52 అని ఉంది. కానీ ఇటీవల ఆమె తన పుట్టిన రోజు సందర్భంగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నట్లు చెప్పడంతో అంతా కూడా షాక్ అవుతున్నారు. గత కొన్నాళ్లుగా మలైకా అరోరా వయసు రెండు ఏళ్లు ఎక్కువగా ప్రచారం జరుగుతోంది. అందుకు కారణం 2019లో మలైకా అరోరా వయసు 46 ఏళ్లు అన్నట్లుగా ప్రకటన వచ్చింది. దాంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు లెక్కిస్తే ఆమె వయసు 52 ఏళ్లు అవుతుంది. కానీ అది నిజం కాదని ఆమె స్వయంగా చెప్పింది.
50 ఏళ్లు దాటిన మలైకా అరోరా
తన పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా ద్వారా మలైకా అరోరా ఆసక్తికర ఫోటోలు, వీడియోలను షేర్ చేసింది. ఆసమయంలో తాను 50 ఏళ్ల వయసు పూర్తి చేసుకున్నట్లుగా పేర్కొంది. ఆమె పోస్ట్‌లో వయసు గురించి క్లారిటీ ఇచ్చింది. దాంతో మలైకా అసలు వయసు విషయంలో క్లారిటీ వచ్చినట్లు అయింది. గూగుల్, వికీపీడియా వంటి ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ లో ఇప్పటికీ మలైకా అరోరా వయసు 52 అని చూపిస్తుంది. ఆమె స్వయంగా తన వయసు 50 అని చెప్పడంతో త్వరలోనే ఆమె వయసును అన్ని ప్లాట్‌ఫామ్స్‌లోనూ మార్చుతారేమో చూడాలి. లేదంటే ఆమె వయసుకు సంబంధించి రచ్చ మరింత ముదురుతుందో చూడాలి. మలైకా కావాలనే తన రెండు ఏళ్ల వయసును తగ్గించింది అంటూ కొందరు కామెంట్స్ చేస్తే, మరికొందరు మాత్రం ఆన్ లైన్ లో ఇలాంటి తప్పులు కామన్ అన్నట్లుగా లైట్ తీసుకుంటున్నారు.
బాలీవుడ్‌లో వరుస సినిమాలు...
మలైకా అరోరా ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపు మూడు దశాబ్దాలు అవుతుంది. ఇప్పటికీ ఆమెకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆకట్టుకునే అందంతో పాటు మంచి డాన్స్ ప్రతిభ ఉండటం వల్ల కెరీర్ ఆరంభం నుంచి మలైకా అరోరా తెగ సందడి చేస్తూనే వచ్చింది. ఆకట్టుకునే అందంతో పాటు లక్ కలిసి రావడం వల్ల ఇప్పటికీ బుల్లి తెర లేదా మరో రకంగా అభిమానులకు వినోదాన్ని అందిస్తూనే ఉంది. మలైకా అరోరా వ్యక్తిగత విషయాలు ఎప్పటికప్పుడు వైరల్ కావడం మనం చూస్తూనే ఉన్నాం. ఆమధ్య భర్తతో విడాకులు తీసుకున్నప్పుడు ఒక యంగ్ హీరోతో ప్రేమలో ఉందనే వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ ఇద్దరు కలిసి ఉన్నట్లు కనిపించడం లేదు. ఇద్దరి మధ్య వయసు తేడా, ఇంకా ఇతర విషయాల కారణంగా బ్రేకప్ అయ్యి ఉంటుందని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వారి నుంచి మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.