• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మహేష్ బర్త్ డే.. ఈ విషెస్...

మహేష్ బర్త్ డే.. ఈ విషెస్ చాలా స్పెషల్

| ప్రతి సంవత్సరం మాదిరిగానే, ఈసారి కూడా మహేష్ బాబుకు శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది.

By - Tupaki Desk
Update: 2024-08-09 09:25 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు, తెలుగు చిత్ర పరిశ్రమలో తన 25 ఏళ్ల ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని, ఈరోజు (ఆగస్ట్ 9) తన 49వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భాన్ని ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు, మరియు నెటిజన్లు ఎంతో ఆసక్తిగా, ఆనందంతో జరుపుకుంటున్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే, ఈసారి కూడా మహేష్ బాబుకు శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది.


కానీ, ఈ ఏడాది పుట్టిన రోజు మరింత ప్రత్యేకంగా నిలిచింది. ఇటీవలే తన లుక్స్ తో మహేష్ బాబు మళ్ళీ వార్తల్లో నిలిచారు. తన బాడీ, హెయిర్ స్టైల్ లో చేసిన మార్పులతో కొత్త లుక్‌లో కనిపిస్తూ, తదుపరి ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నారు. ఈ సారి రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటించబోతున్నారనే వార్తలు సినీ ప్రపంచంలో సంచలనం రేపుతున్నాయి. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రం, ఇండస్ట్రీలో నెవ్వర్ బిఫోర్ అనేలా హైప్ క్రియేట్ చేసుకోబోతోంది.


ఇక మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా తన కుమారుడు గౌతమ్, కుమార్తె సితార సోషల్ మీడియాలో తండ్రికి స్పెషల్ విషెస్ తెలియజేశారు, వారి ప్రేమను ఈ విధంగా పంచుకున్నారు. గౌతమ్ తన పోస్ట్‌లో "మీరు చేసే ప్రతి పనిలో మీరే సూపర్ స్టార్" అంటూ తన తండ్రిని ప్రశంసించాడు. అలాగే ఈ రోజే కాదు ప్ర‌తి రోజు మీకు అద్భుత‌మైన రోజు కావాల‌ని కోరుకుంటున్నాను. అని వివరణ ఇచ్చారు. ఇక సితార తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో "మీరు ఈ ప్రపంచంలో ఉత్తమ తండ్రి" అంటూ నేను మిమ్మ‌ల్ని ఎప్ప‌టికీ ప్రేమిస్తూనే ఉంటాను అని తన ప్రేమను వ్యక్తం చేసింది.

మరియు ఇదే సందర్భంగా మహేష్ బాబు అభిమానులు రీ-రిలీజ్ అయిన మురారి సినిమాను థియేటర్లలో ఆస్వాదిస్తున్నారు. ఈ చిత్రం మహేష్ బాబు కెరీర్‌లో ఒక బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ రీ-రిలీజ్‌తో మహేష్ అభిమానులు తిరిగి తమ హీరోను వెండితెరపై చూసి ఆనందం పొందుతున్నారు.

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోయే మహేష్ బాబు కొత్త చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ త్వరలోనే పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుందని సమాచారం. ఈ సినిమాలో మహేష్ బాబు మరింత పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తారని, సినిమా పరిశ్రమలో ఇది ఒక కొత్త ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు.

Tags:    
  • Tollywood 
  • Filmindustry 
  • Maheshbabu 
  • HappyBirthday 
  • BirthdayWishes 
  • Sitara 
  • Gautham 
  • MurariRerelease 

Similar News

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

మరిచిపోతున్న సినిమాకి హంగులు ఎందుకు..!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS