• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మహేష్ మూవీ కోసం రాజమౌళి...

మహేష్ మూవీ కోసం రాజమౌళి కొత్త వ్యూహం

| సూపర్ స్టార్‌ మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ చకచకా జరుగుతోంది.

By - Tupaki Desk
Update: 2024-09-20 06:25 GMT

సూపర్ స్టార్‌ మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ చకచకా జరుగుతోంది. వచ్చే ఏడాది ఆరంభంలో రెగ్యులర్‌ షూటింగ్ ప్రారంభం అవ్వనుండగా, త్వరలో పూజా కార్యక్రమాలతో సినిమాను షురూ చేయాలని రాజమౌళి భావిస్తున్నాడట. సాధారణంగా రాజమౌళి సినిమాలకు వీఎఫ్‌ఎక్స్ వర్క్ కి ఎక్కువ సమయం పడుతుంది. షూటింగ్‌ పూర్తి అయిన తర్వాత ఆరు నెలల నుంచి సంవత్సరం పాటు కేవలం వీఎఫ్‌ఎక్స్ కే ఎక్కువ సమయం పడుతుంది. అందుకే ఈసారి రాజమౌళి కొత్త వ్యూహంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం అందుతోంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు, రాజమౌళి సినిమా షూటింగ్‌ మొదట వీఎఫ్‌ఎక్స్ షాట్స్ ను చిత్రీకరించబోతున్నారట. అందుకు తగ్గట్టుగా రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నాడు. రాజమౌళి ఈసారి వీఎఫ్‌ఎక్స్ కి ఎక్కువ సమయం కేటాయించాలని భావిస్తున్నాడు. వీఎఫ్‌ఎక్స్‌ వర్క్ వల్ల సినిమా విడుదల ఆలస్యం అవ్వద్దు అనే ఉద్దేశ్యంతో మొదటే వీఎఫ్‌ఎక్స్‌ షాట్స్ ను షూట్ చేయాలని భావిస్తున్నారు. వీఎఫ్‌ఎక్స్‌ షాట్స్ ముందు చిత్రీకరించడం ద్వారా గ్రాఫిక్స్ వర్క్ కి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

భారీ అడ్వెంచర్‌ డ్రామాగా రూపొందబోతున్న ఈ సినిమాలో మహేష్ బాబు లుక్ చాలా విభిన్నంగా ఉండబోతున్నట్లు సమాచారం అందుతోంది. హాలీవుడ్‌ వీఎఫ్‌ఎక్స్ సంస్థలతో ఒప్పందాలు కుదర్చుకున్న దర్శకుడు రాజమౌళి మొదట వీఎఫ్‌ఎక్స్‌ షాట్స్ ను షూట్‌ చేసి ఇచ్చేస్తే, ఏడాది లోపు ఆ వర్క్ ను సదరు కంపెనీలు పూర్తి చేసి ఇవ్వడం ఖాయం. తద్వారా 2025 లో షూటింగ్‌ మొదలు పెట్టినా, 2026 లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. అన్ని వర్గాల వారిని ఆకట్టునే పీరియాడిక్ డ్రామా కథ ను విజయేంద్ర ప్రసాద్‌ రెడీ చేయడం జరిగిందట.

రాజమౌళి గత చిత్రాలు 'బాహుబలి', 'ఆర్ఆర్‌ఆర్‌' లు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకోవడం జరిగింది. కనుక ఈ సినిమా పై పాన్‌ ఇండియా స్థాయిని మించి అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమా హాలీవుడ్‌ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఉంటుందనే అభిప్రాయంను వ్యక్తం చేస్తున్నారు. హాలీవుడ్‌ మూవీస్‌ కి ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు రాజమౌళి ఈ సినిమాను రూపొందించబోతున్నాడు. కేఎల్‌ నారాయణ నిర్మాణంలో ఈ సినిమా నిర్మాణం జరగబోతుంది. రూ.500 కోట్లకు మించిన బడ్జెట్‌ తో ఈ సినిమాను రూపొందించబోతున్నారు. బాహుబలి 2 కలెక్షన్స్‌ మించి మహేష్ బాబుతో చేయబోతున్న సినిమా వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల టాక్‌.

Tags:    
  • Rajamouli 
  • Maheshbabu 
  • Tollywood 
  • SSMB29 
  • Maheshrajamoulimovie 
  • Filmindustry 
  • Vfxshots 

Similar News

కాజల్ అగర్వాల్ అభిమానులు హార్ట్!

2026-11-06 19:30 GMT

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS