SSMB 29: నందిపై త్రిశూలంతో మహేష్.. టైటిల్ ఇదే..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో భారీ బడ్జెట్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే.;

Update: 2025-11-15 15:50 GMT

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో భారీ బడ్జెట్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ తో అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే పలు షెడ్యూల్స్ ను రాజమౌళి.. తన ప్లాన్ కు అనుగుణంగా కంప్లీట్ చేశారు.

అయితే కొద్ది రోజులుగా మేకర్స్ వరుస అప్డేట్స్ తో సందడి చేస్తున్నారు. సంచారి సాంగ్ తో లీడ్ రోల్స్ కు సంబంధించిన ఫస్ట్ లుక్స్ ను విడుదల చేశారు. మహేష్ లుక్ తోపాటు టైటిల్ పై ఇప్పటి వరకు ఉన్న సస్పెన్స్ కు తాజాగా మేకర్స్ తెరదించారు. హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన భారీ ఈవెంట్ టైటిల్ ను అనౌన్స్ చేశారు. మహేష్ లుక్ ను రివీల్ చేశారు.

ముందు నుంచి అనుకున్నట్లుగానే సినిమాకు వారణాసి అనే టైటిల్ ను మేకర్స్ ఫిక్స్ చేశారు. ఈ మేరకు ఈవెంట్లో  స్క్రీన్ పై టైటిల్ గ్లింప్స్ ను ప్లే చేశారు. అందులో ముందుగా మహేష్ బాబు లుక్ ను రివీల్ చేశారు. చేతిలో త్రిశూలం పట్టుకుని సూపర్ స్టార్.. నందిలా కొలిచే ఎద్దుపై వస్తూ యాక్షన్ అవతార్ లో కనిపించారు.

ఆ తర్వాత వారణాసి అంటూ టైటిల్ ప్లే అవ్వగా.. మహేష్ లుక్ మాత్రం అదిరిపోయిందని చెప్పాలి. ప్రస్తుతం సోషల్ మీడియాలో మహేష్ లుక్ కు సంబంధించిన ఫోటోలు, స్క్రీన్ షాట్లు ఫుల్ వైరల్ గా మారాయి. ఓ రేంజ్ లో ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అద్భుతమని కొనియాడుతున్నారు. అంచనాలు భారీగా పెరిగాయని చెబుతున్నారు.

అయితే మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో మూవీ అని అనౌన్స్మెంట్ రాగానే.. ఒక్కసారిగా ఆడియన్స్ లో పెద్ద ఎత్తున అంచనాలు క్రియేట్ అయ్యాయి. అప్డేట్స్ కోసం తెగ వెయిట్ చేశారు. కానీ రాజమౌళి మాత్రం సైలెంట్ గానే పని కానిచ్చారు. పూజా కార్యక్రమాలు సీక్రెట్ గా నిర్వహించారు. షూటింగ్ కు సంబంధించిన అప్డేట్స్ కూడా ఇవ్వలేదు.

కానీ రీసెంట్ గా మాలీవుడ్ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌ ను కుంభగా, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాను మందాకినిగా పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ చేశారు. అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇప్పుడు మహేష్ లుక్ తోపాటు టైటిల్ ను రివీల్ చేశారు. త్వరలో మరిన్ని అప్డేట్స్ ను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరి చూడాలి అవి ఎలా ఉంటాయో..

Tags:    

Similar News