• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  SSMB 29: వర్క్ షాప్ లో...

SSMB 29: వర్క్ షాప్ లో మహేష్ అలా..

| సడెన్ గా ఇప్పుడు సూపర్ స్టార్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో తళుక్కుమంది. SSMB 29 మూవీ వర్క్ షాప్ లో దిగిన పిక్.. ఇప్పుడు ఫుల్ ట్రెండ్ అవుతోంది.

By - Tupaki Desk
Update: 2025-01-26 04:39 GMT

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళితో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. యాక్షన్ అడ్వెంచర్ జోనర్ లో తెరకెక్కుతున్న ఆ సినిమా పూజా కార్యక్రమాలు కొద్ది రోజుల క్రితం చాలా సీక్రెట్ గా జరిగాయి. ఎలాంటి పిక్ గానీ.. వీడియో గానీ ఇప్పటి వరకు బయటకు రాలేదు. మేకర్స్ కూడా రిలీజ్ చేయలేదు.

 

కొన్ని నెలల పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరగ్గా.. రెగ్యులర్‌ షూటింగ్ గురించి మేకర్స్ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. కానీ రీసెంట్ గా జక్కన్న.. సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ వీడియోను షేర్ చేసిన విషయం తెలిసిందే. పరోక్షంగా అప్డేట్ ఇచ్చిన ఆయన.. క్యాప్చర్డ్‌ అంటూ సింహాన్ని లాక్‌ చేసినట్లు అర్థం వచ్చేలా ఓ వీడియోను పోస్ట్ చేశారు.

వీడియోలో రాజమౌళి పాస్ పోర్ట్ పట్టుకుని నవ్వడం.. బ్యాక్ గ్రౌండ్ లో మహేష్ స్పైడర్ మూవీ మ్యూజిక్ ను యూజ్ చేయడం.. అంతా చర్చనీయాంశంగా మారింది. నిజానికి మహేష్ ఎక్కువగా ఫారిన్ ట్రిప్స్ వెళ్తుంటారు. అందుకే సరదాగా ఇప్పుడు మహేష్ పాస్ట్ పోర్ట్ ను తీసుకుని బందీని చేసినట్లు సరదాగా పెట్టనట్లున్నారు జక్కన్న!

అదే సమయంలో మహేష్ కూడా.. ఒక్కసారి కమిట్‌ అయితే నా మాట నేనే వినను అంటూ క్రేజీగా రిప్లై ఇచ్చారు. అలా రాజమౌళి పోస్ట్ అండ్ మహేష్ కామెంట్ వైరల్ అవుతుండగా.. సడెన్ గా ఇప్పుడు సూపర్ స్టార్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో తళుక్కుమంది. SSMB 29 మూవీ వర్క్ షాప్ లో దిగిన పిక్.. ఇప్పుడు ఫుల్ ట్రెండ్ అవుతోంది.

వాస్తవానికి రాజమౌళి.. తన ప్రతి సినిమాకు వర్క్ షాప్ ను నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే. ఇప్పుడు హైదరాబాద్ లింగంపల్లి సమీపంలో అల్యూమినియం ఫ్యాక్టరీలో SSMB 29 వర్క్ షాప్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అందులో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా సహా పలువురు పాల్గొన్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఇప్పుడు అందుకు సంబంధించిన మహేష్ పిక్ వైరల్ గా మారింది. అందులో సూపర్ స్టార్ ఫుల్ యాక్టివ్ గా కనిపించారు. బ్లూ కలర్ టీ షర్ట్ లో చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు. దీంతో ఆయన ఫ్యాన్స్, నెటిజన్లు స్పందిస్తున్నారు. పిక్ సూపర్ అని కామెంట్లు పెడుతున్నారు. వెయిటింగ్ ఫర్ మూవీ అప్డేట్ అని చెబుతున్నారు. లుక్ అదిరిపోయిందని అంటున్నారు.

Tags:    
  • MaheshBabu 
  • Rajamouli 
  • SSMB29 
  • TollywoodUpdates 
  • PriyankaChopra 
  • SSMB29Workshop 
  • RajamouliMovie 
  • TollywoodBuzz 

Similar News

ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లిగా సాయిప‌ల్ల‌విపై మ‌రో ప్ర‌యోగం!

2026-11-11 18:30 GMT

టీటీడీ చైర్మ‌న్ రేసులో సినీ ప్ర‌ముఖులు.. !

2026-11-11 18:30 GMT

నువ్వు ఇండస్ట్రీని ఏలుతావు..యంగ్ హీరోపై అట్లీ మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

2026-11-11 17:30 GMT

దేవరకొండ ఫ్యామిలీ.. ఒక్క సినిమా పడితే!

2026-11-11 16:39 GMT

స్టార్ జాతకాన్ని ముందే పసిగట్టిన త్రివిక్రమ్ శిష్యుడు

2026-11-11 16:38 GMT

6 రోజుల్లో 100 కోట్ల క్ల‌బ్.. సౌత్‌లో ఈ ఒక్క‌డికే

2026-11-11 16:37 GMT

వివేక్‌ సాగర్‌కి జరిగిన నష్టం ఇతర మ్యూజిక్‌ డైరెక్టర్స్‌కి పాఠం..!

2026-11-11 16:37 GMT

అనిరుధ్ పెళ్లి సర్ ప్రైజ్.. ఇక సన్ పిక్చర్స్‌తో కొత్త ఎమోషన్

2026-11-11 16:33 GMT

కావ్య మార‌న్‌తో అనిరుధ్ పెళ్లి మొద‌టి ఫోటో

2026-11-11 14:00 GMT

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

Copyright @2026

Powered by Blink CMS