మహేష్.. మరో అప్డేట్ పడితే..
ఒక్క అప్డేట్.. సినిమాపై అంచనాలను అమాంతం పెంచేయగలదు. అదే సరైన సమయంలో సరైన కంటెంట్ వస్తే సోషల్ మీడియాను షేక్ చేయగలదు.
ఒక్క అప్డేట్.. సినిమాపై అంచనాలను అమాంతం పెంచేయగలదు. అదే సరైన సమయంలో సరైన కంటెంట్ వస్తే సోషల్ మీడియాను షేక్ చేయగలదు. ఇప్పుడు మహేష్ బాబు- రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న వారణాసి విషయంలోనూ ఇదే చర్చ జరుగుతోంది. ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా.. ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా జక్కన్న నుంచి ఏదైనా స్పెషల్ అప్డేట్ వస్తే ప్రాజెక్టుపై హైప్ మరో స్థాయికి వెళ్లడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికే వారణాసి నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా మహేష్ బాబును కొత్త తరహా పాత్రలో చూపించబోతున్నారనే విషయం అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. అయితే భారీ సినిమాలకు కేవలం కంటెంట్ మాత్రమే కాదు.. దానిని ఏ సమయంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారనేది కూడా కీలకమే. ఈ విషయంలో మహేష్ బాబు పుట్టినరోజు మూవీ టీమ్ సరైన వేదికగా మారే అవకాశం కనిపిస్తోంది.
గతేడాది మహేష్ పుట్టినరోజు సందర్భంగా సినిమా నుంచి అప్డేట్ వస్తుందని అభిమానులు భారీగా ఆశించారు. కానీ అప్పట్లో ఎలాంటి కంటెంట్ విడుదల కాలేదు. దీంతో ఫ్యాన్స్ కొంత నిరాశకు గురయ్యారు. ఆ తర్వాత టీమ్ సరైన సమయం తీసుకుని విడుదల చేసిన కంటెంట్ కు మంచి స్పందన లభించింది. రాజమౌళి సినిమాల విషయంలో తొందరపడరని, పూర్తి స్థాయిలో సాటిస్ఫై అయిన తర్వాతే కంటెంట్ తీసుకొస్తారనే విషయం ప్రూవ్ అయింది.
అయితే ఇప్పుడు పరిస్థితి వేరు. సినిమా విడుదల సమయం క్రమంగా దగ్గరపడుతోంది. దీంతో రాబోయే రోజుల్లో ప్రమోషన్స్ ను పెంచాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సమయంలో మహేష్ పుట్టినరోజును ఉపయోగించుకుని ఒక టీజర్ లేదా రోల్ కు సంబంధించిన గ్లింప్స్ విడుదల చేస్తే సినిమాపై హైప్ మరింత పెరిగే అవకాశం ఉంది. నిజానికి వారణాసికి కొత్తగా హైప్ తీసుకురావాల్సిన అవసరం లేదు. మహేష్-రాజమౌళి కాంబినేషన్ ఒక్కటే సినిమాపై అంచనాలను భారీగా పెంచింది.
ఆ అంచనాలను కొనసాగిస్తూ.. ఎప్పటికప్పుడు ప్రేక్షకుల్లో సినిమా గురించి చర్చ జరిగేలా చేయడం కూడా ముఖ్యమే. అందుకే ఆగస్టు 9న సరైన కంటెంట్ పడితే సోషల్ మీడియాలో దాని ఎఫెక్ట్ భారీగా ఉండొచ్చనే అభిప్రాయం వినిపిస్తోంది. మరోవైపు ఆ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. మహేష్ రోల్, స్టోరీ బ్యాక్ డ్రాప్, యాక్షన్ సీన్స్ గురించి అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. కొన్ని ఫొటోలు కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
నిజానికి రాజమౌళి సినిమా నుంచి వచ్చే చిన్న అప్డేట్ కే భారీ స్థాయిలో రెస్పాన్స్ ఉంటుంది. అలాంటిది మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అంచనాలకు తగ్గ కంటెంట్ విడుదలైతే వారణాసి పేరు మరోసారి మార్మోగే అవకాశం ఉంది. ముఖ్యంగా రోల్ ను పరిచయం చేసే వీడియోనో, కథా ప్రపంచాన్ని చూపించే చిన్న టీజర్ నో విడుదల చేస్తే అభిమానులకు బర్త్ డే ట్రీట్ గా నిలవడమే కాకుండా సినిమా ప్రమోషన్స్ కు కూడా కొత్త ఊపు తీసుకురావచ్చు. మరేం జరుగుతుందో అంతా వేచి చూడాలి.