SSMB29 టీమ్ తిరిగి వచ్చేదప్పుడే!
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఎస్ఎస్ఎంబీ29.;
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఎస్ఎస్ఎంబీ29. ఈ సినిమాపై కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఆసక్తిగా ఉన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు సినిమా స్థాయిని ఆస్కార్ వరకు తీసుకెళ్లిన జక్కన్న ఇప్పుడు ఈ సినిమాను దానికి మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.
అనౌన్స్‌మెంట్ లేకుండానే సెట్స్‌పైకి..
ఫారెస్ట్ యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను రాజమౌళి చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఎలాంటి అనౌన్స్‌మెంట్ లేకుండా సెట్స్ పైకి వెళ్లి షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇప్పటికే పలు షెడ్యూళ్ల షూటింగ్ ను పూర్తి చేసుకుంది. కాగా ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ సౌత్ ఆఫ్రికాలోని అడవుల్లో జరుగుతోంది.
లాంగ్ షెడ్యూల్ ను ప్లాన్ చేసిన జక్కన్న
ఈ షెడ్యూల్ ను రాజమౌళి చాలా లెంగ్తీగా ప్లాన్ చేశారని, ఇదే షెడ్యూల్ లో మహేష్ బాబు, ప్రియాంక చోప్రాపై కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి రాజమౌళి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా లో జరుగుతున్న షెడ్యూల్ పూర్తయ్యాక, చిత్ర యూనిట్ మొత్తం తిరిగి ఎస్ఎస్ఎంబీ29 షూటింగ్ కోసం హైదరాబాద్ కు రానుంది.
సెట్ల కోసమే భారీ ఖర్చు
కాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ఇటీవల గ్లోబ్ ట్రోటర్ హ్యాష్ ట్యాగ్ తో ఓ ఫోటోను రిలీజ్ చేయగా, నవంబర్ లో సినిమా నుంచి ప్రీ లుక్ ను రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. కాగా ఈ సినిమా కోసం రాజమౌళి సెట్స్ కోసమే చాలా భారీగా ఖర్చు పెడుతున్నట్టు తెలుస్తోంది. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కె. ఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.