• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వైరల్‌ : నువ్వు కాపాడిన...

వైరల్‌ : నువ్వు కాపాడిన 3772వ ప్రాణం మా పి గన్నవరం ది స్వామి

| టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు వేలాది మంది పిల్లలకు గుండె ఆపరేషన్ చేయించడం ద్వారా రియల్‌ సూపర్‌ స్టార్‌ అయ్యాడు.

By - Tupaki Desk
Update: 2024-10-24 10:56 GMT

టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు వేలాది మంది పిల్లలకు గుండె ఆపరేషన్ చేయించడం ద్వారా రియల్‌ సూపర్‌ స్టార్‌ అయ్యాడు. సాధారణంగా అయిదు.. పది.. ఇరవై మందికి సహాయం చేస్తేనే గొప్ప విషయం అన్నట్లుగా పదే పదే మీడియాలో ప్రచారం చేయించుకుంటారు. అలాంటిది మహేష్ బాబు ఇప్పటి వరకు దాదాపు నాలుగు వేల మంది పిల్లల గుండె ఆపరేషన్ కి సహాయం చేశారు. ఆంధ్ర హాస్పిటల్‌ సౌజన్యంతో పిల్లల గుండె సంబంధిత జబ్బులకు ఉచితంగా చికిత్స చేయిస్తున్న మహేష్ బాబు గురించి ఒక వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఆ వీడియోలో భారీ ఫ్లెక్సీపై 'నువ్వు కాపాడిన 3772వ ప్రాణం మా పి గన్నవరం ది స్వామి' అంటూ మహేష్ బాబు ఫోటోలను ముద్రించడం జరిగింది. ఆ ఫ్లెక్సీని ఊరంతా తిప్పుతూ మహేష్ బాబు గొప్పతనం తెలిసే విధంగా అందరికీ ఫ్యాన్స్ ప్రచారం చేయడం జరిగింది. ఇప్పటి వరకు వేలాది మంది కుటుంబాల్లో ఆనందాన్ని నింపిన మహేష్ బాబు భవిష్యత్తులో పది వేల మంది పిల్లల గుండె ఆపరేషన్‌ కి సహకరించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం పి గన్నవరం ఫ్యాన్స్‌ ఫ్లెక్సీ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవ్వడంతో పాటు, మరో సారి మహేష్ బాబు గొప్పతనం గురించి నెట్టింట ప్రధానంగా చర్చ జరుగుతోంది.

మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది ఆరంభంలో గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా పై భారీ అంచనాలు ఉన్నా ఆ అంచనాలను అందుకోవడంలో విఫలం అయింది. మహేష్ బాబును త్రివిక్రమ్‌ బాగానే వాడాడు. కానీ సినిమా ఫలితం మాత్రం అనుకున్నట్లుగా రాలేదు. గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడత పెట్టి పాటకు మాత్రం మంచి స్పందన దక్కింది. ఇప్పటికీ ఆ పాట సోషల్‌ మీడియాలో మ్రోగుతూనే ఉండటం మనం చూస్తూనే ఉన్నాం.

గుంటూరు కారం విడుదల అయి దాదాపు ఏడాది కావస్తున్నా ఇప్పటివరకు తదుపరి సినిమాను మహేష్ బాబు సెట్స్ పైకి తీసుకు వెళ్లలేదు. అందుకు కారణం ఆయన తదుపరి సినిమా రాజమౌళి దర్శకత్వంలో అనే విషయం తెల్సిందే. రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్న సినిమా కోసం కొన్ని నెలలుగా జుట్టు, గడ్డం పెంచుకుని ఉన్నాడు. త్వరలోనే రాజమౌళి లుక్ టెస్ట్‌ చేయబోతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న వీరి కాంబో మూవీ 2025లో సెట్స్ పైకి వెళ్లి 2026 వరకు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు హీరోయిన్‌ ని ఎంపిక చేయలేదు. ఇతర విషయాలపై చాలా పుకార్లు వచ్చినా దేనికీ క్లారిటీ లేదు.

Okosari anipistadi nenu kuda east Godavari lo putti vunte bagundedi ani...Vella Fansim 🥹🥹♥️♥️💥💥🙏🙏#SSMB29 #MaheshBabu pic.twitter.com/gQVO2aceTU

— Nikhil_Prince🚲 (@Nikhil_Prince01) October 23, 2024
Tags:    
  • Maheshbabu 
  • Maheshbabufans 
  • Heartoperations 
  • Gunturkaaram 
  • Ssmb29 
  • Superstar 
  • Rajamouli 
  • Tollywood 
  • Filmindustry 
  • AMB 

Similar News

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS