సూపర్ స్టార్ న్యూ ఇయర్ ఎలా స్టార్ట్ అయిందో చూశారా?
సూపర్ స్టార్ మహేష్ బాబు. ఉంటే షూటింగ్ లో ఉంటారు, లేదంటే ఫ్యామిలీతో కలిసి ఉంటారు.;
సూపర్ స్టార్ మహేష్ బాబు. ఉంటే షూటింగ్ లో ఉంటారు, లేదంటే ఫ్యామిలీతో కలిసి ఉంటారు. ఈవెంట్ ఏదైనా సరే మహేష్ మాత్రం ఎప్పుడూ ఫ్యామిలీతోనే ఉంటారు. ఏ పండగొచ్చినా, ఏ సెలవొచ్చినా దాన్ని ఫ్యామిలీతోనే సెలబ్రేట్ చేసుకుంటారు తప్పించి ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా ఎప్పుడూ బయట కనిపించరు. ఫ్యామిలీకి మహేష్ ఇచ్చే ప్రియారిటీ అలాంటిది మరి.
అందుకే ఏదైనా సందర్భం రావడం ఆలస్యం వెంటనే ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు చెక్కేస్తారు మహేష్. ఫ్యామిలీతో కలిసి ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడానికి ఇష్టపడే మహేష్, ఇండియాలో ఉంటే అది కుదరదని, ఎక్కువగా విదేశాలకు వెళ్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మహేష్ వెకేషన్స్ కు వెళ్లడం గతంతో పోలిస్తే బాగా తగ్గింది. దానికి కారణం దర్శకధీరుడు రాజమౌళి.
ఫ్యామిలీతో న్యూ ఇయర్ వెకేషన్ కు వెళ్లిన మహేష్
ఏ హీరో అయినా సరే రాజమౌళితో సినిమా చేస్తున్నారంటే అతనికి వాళ్లు సరెండర్ అవాల్సిందే. అందులో భాగంగానే మహేష్ తో సినిమాను మొదలుపెట్టే ముందే రాజమౌళి మహేష్ పాస్‌పోర్ట్ ను లాగేసుకుని తన వద్ద పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు వారణాసి సినిమా షూటింగ్ కు చిన్న బ్రేక్ దక్కడంతో మహేష్ న్యూ ఇయర్ సందర్భంగా ఫ్యామిలీ తో కలిసి వెకేషన్ కు వెళ్లారు.
ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు సంబంధించిన కొన్ని ఫోటోలను మహేష్ భార్య నమ్రత శిరోద్కర్ తన సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఆ ఫోటోల్లో మహేష్ తన భార్య, పిల్లలతో కలిసి న్యూ ఇయర్ కు ఎలా వెల్‌కమ్ చెప్పారో చాలా క్లియర్ గా తెలుస్తోంది. ప్లాన్ చేయకుండా తీసిన ఈ ఫోటోల్లో పిల్లలు హ్యాపీ న్యూ ఇయర్ క్యాప్స్, హెడ్ బ్యాండ్స్ పెట్టుకుని న్యూ ఇయర్ వైబ్ ను ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపించారు.
నమ్రత షేర్ చేసిన ఫోటోల్లో గ్రూప్ ఫోటోలో కొందరు తెలిసిన వాళ్లు కనిపించగా, ఓ ఫోటోలో మహేష్ తన కూతురు సితారను దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంటున్న ఫోటో అందరినీ ఎట్రాక్ట్ చేస్తోంది. మొత్తానికి మహేష్ తన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను పెద్దగా హడావిడి లేకుండా చాలా సింపుల్ గా ఫ్యామిలీతో కలిసి ఓ రెస్టారెంట్ కు వెళ్లి ప్రశాంత వాతావరణంలో గడిపినట్టు తెలుస్తోంది. ఇక కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం రాజమౌళితో వారణాసి సినిమా చేస్తున్న మహేష్ ఈ మూవీ తర్వాత ఏ స్థాయికి వెళ్తారో ఊహించుకోవడం కూడా కష్టమే. ఇప్పుడందరి దృష్టి వారణాసి పైనే ఉండటంతో రాజమౌళి కూడా ఈ మూవీని నెక్ట్స్ లెవెల్ లో తెరకెక్కిస్తున్నారు.