మ‌హేష్ బీరువాలో 30 ష‌ర్టులు ఒకే రంగులో!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ స్టైలింగ్ కార‌ణం భార్య న‌మ్ర‌త‌. న‌మ్ర‌త‌తో ప్రేమ‌...అటుపై వివాహం త‌ర్వాత మ‌హేష్ కు సంబంధించిన అన్ని ప‌నులు తానే చూసుకుంటున్నారు;

Update: 2025-07-12 11:30 GMT

సూప‌ర్ స్టార్ మ‌హేష్ స్టైలింగ్ కార‌ణం భార్య న‌మ్ర‌త‌. న‌మ్ర‌త‌తో ప్రేమ‌...అటుపై వివాహం త‌ర్వాత మ‌హేష్ కు సంబంధించిన అన్ని ప‌నులు తానే చూసుకుంటున్నారు. మ‌హేష్ లో స్టైలింగ్ కి కార‌ణం కూడా న‌మ్ర త‌నే. మ‌హేష్ కి కావాల్సిన షాపింగ్ అంతా కూడా న‌మ్ర‌త‌నే చేస్తారు. ఆమె అభిరుచి మేర‌కు మ‌హేష్ కూడా న‌డుచుకుంటాడు. అలా ఇష్టాల విష‌యంలో ఇద్ద‌రికీ బాగా సింక్ అయింది. ముఖ్యంగా మ‌హేష్ ధ‌రించే బ‌ట్ట‌ల‌న్నింటిని కూడా న‌మ్ర‌త ముంబైలోనూ..విదేశాల్లో షాపింగ్ చేసి తీసుకుంటారు.

అయితే మ‌హేష్ ధ‌రించే ష‌ర్ట్ లు ఎక్కువ‌గా నేవీ బ్లూలో ఉంటాయి. అలాగే బ్రౌన్ క‌ల‌ర్ ప్యాంట్లు ధ‌రి స్తుంటారు. సినిమా ఈవెంట్ల‌కు ఎక్కువ‌గా ఇలాంటి క్యాజువ‌ల్స్ లోనే క‌నిపిస్తారు. రిలీకు ముందు జ‌రిగే ఈవెంట్ కు వాటిని ఓ సెంటిమెంట్ గాను భావిస్తుంటారు మ‌హేష్. మ‌రి మ‌హేష్ బీరువాలో ఎన్ని బ్లూ క‌ల‌ర్ ష‌ర్ట్ లు ఉన్నాయో తెలిస్తే? మాత్రం షాక్ అవ్వాల్సిందే. ప‌ది ప‌దిహేను ష‌ర్టులు కాదు ఏకంగా 25-30 మ‌ధ్య‌లో ఒకే రంగు ష‌ర్టులు ఉంటాయ‌ని మ‌హేష్ తెలిపారు.

నేవీ బ్లూ అంటే ఇష్టం కార‌ణంగానే షాపింగ్ చేసిన‌ప్పుడు వాటిని తీసుకోవాల‌నిపిస్తుందన్నారు. సైక‌లా జిక‌ల్ గా బ్లూ వైపు లుక్ వెళ్లిపోతుంద‌న్నారు. ఆ రంగు ష‌ర్టులు ఎన్ని తోడిగినా ఎంత మాత్రం బోర్ కొట్ట ద‌న్నారు. అంటే మ‌హేష్ చిన్న‌ప్పటి నుంచి ఇష్ట‌ప‌డే రంగు కూడా ఇదే. అందుకే ఆ రంగుకి అంత‌గా క‌నెక్ట్ అయ్యారు. సినిమాల్లో మాత్రం కాస్ట్యూమ్స్ విష‌యంలో ఎలాంటి నిబంధ‌న‌లుండ‌వ్. డిజైనర్ ఇచ్చిన దుస్తుల్నే ధ‌రిస్తుంటారు.

కొంత మంది హీరోలు కాస్ట్యూమ్స్ విష‌యంలో డిజైన‌ర్ తో ఇన్వాల్వ్ అవుతుంటారు. కానీ మ‌హేష్ ఆ విష యంలో క‌ల్పించుకోరు. ద‌ర్శ‌క‌, డిజైన‌ర్ ల సూచ‌న మేర‌కు వాళ్లు ఎలాంటి ఇచ్చినా ధ‌రిస్తుంటారు. ప్ర‌స్తుతం మ‌హేష్ హీరోగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తొలి పాన్ ఇండియా చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. హైద‌రాబాద్ లో షూటింగ్ జ‌రుగుతుంది. ఈ షెడ్యూల్ అనంత‌రం కెన్యాలో చిత్రీక‌ర‌ణ ఉంటుంది.

Tags:    

Similar News