మహేష్ 'అతడు'.. బ్రహ్మీ, హేమ సీన్ రీ క్రియేషన్ చూస్తే నవ్వాగదు!

ఇప్పుడు ఆ సీన్ ను అచ్చం గుద్దినట్లు రీ క్రియేట్ చేయగా.. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.;

Update: 2025-08-10 04:21 GMT

టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మహేష్ బాబు అతడు మూవీ రీసెంట్ గా రీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ 50వ బర్త్ డే సందర్భంగా మేకర్స్ మరోసారి థియేటర్స్ లోకి తీసుకొచ్చారు. దీంతో అభిమానులు, సినీ ప్రియులు ఫుల్ గా సందడి చేస్తున్నారు. మరోసారి క్లాసిక్ అతడు చూసి థియేటర్స్ లో ఎంజాయ్ చేస్తున్నారు.

అదే సమయంలో థియేటర్స్ లో సీన్స్ రీ క్రియేట్ చేయడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. హీరో సన్నివేశాలతో పాటు పాటలను చాలా మంది రీ క్రియేట్ చేస్తున్నారు. అవి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు చక్కర్లు కొడుతూనే ఉంటాయి. తెగ వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు అతడు మూవీకి గాను కూడా ఓ సీన్ రీ క్రియేట్ అయింది.

అయితే అది మహేష్, త్రిషకు సంబంధించిన సీన్ కాదు. బ్రహ్మానందం, హేమ కామెడీ సన్నివేశం. నిజానికి.. వారిద్దరి మధ్య సీన్స్ సినిమాలో ఓ రేంజ్ లో ఉంటాయి. ఇప్పటికీ సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి. రీల్స్ రూపంలో సందడి చేస్తుంటాయి. మీమ్స్ లో కూడా ఉంటాయి. ఇప్పుడు బ్రహ్మీ, సీన్ ను ఓ ఇద్దరు మూవీ లవర్స్ థియేటర్ లో రీ క్రియేట్ చేశారు.

బ్రహ్మనందం ఓ ఊరు వెళ్లి వచ్చాక.. హేమ అప్పుడే వస్తారా అని అడుగుతారు. అప్పుడు స్టేషన్ లో పడుకుని మళ్లీ వస్తా అని చెబుతాకు. స్టేషన్ కు కార్ పంపలేదని అనగా.. అమాయకంగా హేమ ఎప్పుడు వస్తారో తెలియదుగా అని అంటుంది. అక్కడి కాసేపటికే నాజర్ రాగా.. బ్రహ్మీ ఏం తెలియనట్లు వొంగి వొంగి దండాలు పెడతారు.

ఇప్పుడు ఆ సీన్ ను అచ్చం గుద్దినట్లు రీ క్రియేట్ చేయగా.. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదరగొట్టేశారుగా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. చాలా బాగా చేశారని చెబుతున్నారు. ఎవర్ గ్రీన్ కామెడీ సీన్ అని అంటున్నారు. నెట్టింట షేర్ చేస్తూ.. ఫుల్ గా ట్రెండ్ చేస్తున్నారు.

కాగా.. 20 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన అతడు ఇప్పుడు మళ్లీ సందడి చేస్తోంది. త్రిష హీరోయిన్ గా నటించిన ఆ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. మహేష్ బాబు కెరీర్ లోనే బెస్ట్ ఫిల్మ్ గా నిలిచిపోయింది. ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. టీవీలో కొన్ని వందల సార్లు రాగా.. ప్రతి సారి మంచి టీఆర్పీ రేట్ వచ్చింది. ఇప్పుడు రీ రిలీజ్ లో ఎంత వసూళ్లు సాధిస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News