49 ఏళ్ల మ‌హేష్ 30 ఏళ్ల సూప‌ర్ స్టార్ గా!

మ‌రి మ‌హేష్ ఏజ్ ఎంతో తెలుసా? ఇప్పుడు అక్ష‌రాలా ఆయ‌న వ‌య‌సు 49 ఏళ్లు. మ‌రో ఏడాదిలో 50 లోకి అడుగు పెడ‌తాడు.;

Update: 2025-06-20 22:30 GMT

సూప‌ర్ స్టార్ మ‌హేష్ క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. కోట్లాది మంది అభిమానించే పెద్ద‌ స్టార్. అందు లోనూ గాళ్స్ ఫాలోయింగ్ లో నెంబ‌వ‌ర్ స్టార్ మ‌హేష్‌. ఈ విష‌యంలో మ‌హేష్ ని కొట్టే స్టార్ మ‌రొక‌రు లేరు. బాలీవుడ్ హీరోయిన్లే మ‌హేష్ బ్యూటీకి ఫిదా అవుతుంటారు. త్వ‌ర‌లోనే పాన్ ఇండియా మార్కెట్ లో కి ఎంట‌ర్ అవుతున్నాడు. ఎస్ ఎస్ ఎంబీ 29 తో ఇండియానే షేక్ చేయ‌బోతున్నాడు.

అటుపై అత‌డి రేంజ్ ఆకాశాన్నే అంటుతుంది. నేరుగా హాలీవుడ్ కి వెళ్లిపోయినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌ని లేదు. ఆ క‌టౌట్ అలాంటిది. మ‌రి మ‌హేష్ ఏజ్ ఎంతో తెలుసా? ఇప్పుడు అక్ష‌రాలా ఆయ‌న వ‌య‌సు 49 ఏళ్లు. మ‌రో ఏడాదిలో 50 లోకి అడుగు పెడ‌తాడు. మ‌హేష్ కి ఏజ్ అన్న‌ది జ‌స్ట్ నెంబ‌ర్ మాత్ర‌మే. మ‌హేష్ వ‌య‌సు గురించి ఎక్క‌డా ఎప్పుడు చ‌ర్చ‌కు రాదు.

కానీ విదేశాల్లో మ‌హేష్ ఫోటో చూపించి ఇత‌డు వ‌య‌సు ఎంత ఉంటుంది? అని విను వీధుల్లో అడిగితే ఏమ‌న్నారో తెలుసా? 27 ఏళ్లు అని ఒక‌రు...30 అని మ‌రోక‌రు...25 ఏళ్లు అని మ‌రొక‌రు చెబుతున్నారు. విదేశీ యులే మ‌హేష్ వ‌య‌సు క‌నిపెట్ట లేక‌పోతున్నారంటే? అత‌డు ఏ రేంజ్ లో మెయింటెన్ చేస్తున్నాడో చెప్పొ చ్చు. నిజానికి మ‌హేష్ ఎవ‌రో వాళ్లెవ్వ‌రికీ తెలియ‌దు. ఎందుకంటే అత‌డు హాలీవు స్టార్ కాదు కాబ‌ట్టి. ఓ 40 మందిని ఇదే ప్ర‌శ్న అడిగితే అంతా 30 ఏళ్ల లోపే చెప్పారు. మ‌హేషా మజాకానా.

ప్ర‌స్తుతం మ‌హేష్ ఎస్ ఎస్ ఎంబీ 29 లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని రాజ‌మౌళి తెర‌కెక్కి స్తున్నాడు. ఇదొక ఆప్రిక‌న్ అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్. సాహ‌స యోధుడిగా మ‌హేష్ ఇందులో క‌నిపించ‌నున్నారు. ఈసినిమా కోసం మ‌హేష్ ప్ర‌త్యేకంగా కొంత శిక్ష‌ణ కూడా తీసుకుని బ‌రిలోకి దిగాడు.

Tags:    

Similar News