మహావతార్‌ కి భయపడుతున్న సూపర్‌ స్టార్స్‌

మహావతార్‌ విడుదలైన 16వ రోజు అంటే మూడో శనివారం ఏకంగా రూ.16 కోట్లు వసూళ్లు చేయడం జరిగింది.;

Update: 2025-08-10 08:00 GMT

ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద గత నెల రోజులుగా సయ్యారా, మహావతార్ నరసింహా సినిమాలు సందడి చేస్తున్నాయి. సయ్యార సినిమా మూడు వారాల్లో దాదాపుగా రూ.500 కోట్ల వసూళ్లు సాధించింది. మరో వారం, రెండు వారాలు ఈ సినిమా భారీ వసూళ్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహావతార్ సినిమా సైతం బాక్సాఫీస్‌ వద్ద విధ్వంసం సృష్టిస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. ఇండియన్‌ సినిమా స్క్రీన్‌ పై గతంలో ఎప్పుడూ ఏ యానిమేటెడ్‌ మూవీ కి రాని స్థాయిలో ఈ సినిమా వసూళ్లు నమోదు అవుతున్నాయి. మహావతార్‌ ఇప్పటికే రూ.100 కోట్ల మార్క్‌ను క్రాస్‌ చేసింది. రోజులు గడుస్తున్న కొద్ది సినిమాకు బజ్ పెరుగుతుంది. వసూళ్లు పెరుగుతూ వస్తున్నాయి. మహావతార్‌ థియేటర్‌ల్లో వచ్చిన మొదట్లో రోజుకు రూ.కోటి నుంచి రూ.2 కోట్లు నమోదు కావడం గొప్ప విషయంగా ఉంది.

మహావతార్‌ విడుదలైన 16వ రోజు అంటే మూడో శనివారం ఏకంగా రూ.16 కోట్లు వసూళ్లు చేయడం జరిగింది. వచ్చే వీడికెండ్‌కు ఈ నెంబర్‌ రూ.20 కోట్లను క్రాస్‌ చేసినా ఆశ్చర్యం లేదు. పిల్లలు, పెద్దలు, ఫ్యామిలీ మెంబర్స్ మహావతార్ సినిమాను చూసేందుకు ముందు ముందు మరింతగా థియేటర్ల వద్ద క్యూ కట్టే అవకాశాలు ఉన్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్‌ మౌత్ టాక్ కారణంగా ఎక్కువగా థియేటర్‌లకు వస్తున్నారు. అందుకే మేకర్స్‌ మెల్ల మెల్లగా స్క్రీన్స్ సంఖ్య పెంచుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను గీతా ఆర్ట్స్ వారు విడుదల చేశారు. గతంలో ఏ డబ్బింగ్‌ సినిమాకు రాని ఆదాయంను గీతా ఆర్ట్స్ వారు ఈ సినిమాతో దక్కించుకునే అవకాశాలు ఉన్నాయని బాక్సాఫీస్ వర్గాల వారు అంటున్నారు.

హిందీ వర్షన్‌ ఇప్పటికే వంద కోట్ల వసూళ్లు నమోదు చేసింది. సౌత్‌ ఇండియాలోనూ వంద కోట్ల వసూళ్లు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవర్సీస్‌ నుంచి ఏ స్థాయిలో ఈ సినిమాకు వసూళ్లు నమోదు అవుతాయి అనేది చూడాలి. సినిమా విడుదల అయ్యి వారాలు గడుస్తున్నా మరి కొన్ని వారాల పాటు ఈ సినిమా థియేటర్‌లలో కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఈ వారంలో సూపర్‌ స్టార్స్‌ సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఆ సినిమాల కలెక్షన్స్ పై మహావతార్‌ సినిమా ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. మహావతార్ సినిమా వల్ల రజనీకాంత్‌ కూలీ సినిమా మాత్రమే కాకుండా హిందీలో రాబోతున్న 'వార్‌ 2' సైతం ప్రభావింతం అయ్యే అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సయ్యార, మహావతార్‌ సినిమాలు బాక్సాఫీస్ వద్ద రాబడుతున్న వసూళ్లు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమాలు చేస్తున్న సందడి ముందు రాబోయే సినిమాలు నిలిచేనా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మహావతార్‌ సినిమాకు రోజు రోజుకు మౌత్‌ టాక్ పాజిటివ్‌గా వస్తుంది. దాంతో విడుదలైన అన్ని చోట్ల కూడా వసూళ్లు చాలా పాజిటివ్‌గా ఉన్నాయి. అందుకే వార్ 2, కూలీ సినిమాలకు కొంతలో కొంత అయినా డ్యామేజీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆ సినిమాలు సూపర్‌ హిట్‌ అయితే తప్ప ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్‌ సందడి తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఆ సినిమాలు యావరేజ్‌గా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ రెండు సినిమాలు మరింత తమ జోరు కనబర్చి, రాబోయే రెండు వారాలు దూసుకు పోయే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News