• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టైటిలే కాదు...హీరో లుక్...

టైటిలే కాదు...హీరో లుక్ షాకింగ్ స‌ర్ ప్రైజ్!

| అమర్ కౌశిక్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. తాజాగా ఆ చిత్ర యూనిట్ ఊహించ‌ని స‌ర్ ప్రైజ్ ఇచ్చింది.

By - Tupaki Desk
Update: 2024-11-13 09:08 GMT

బాలీవుడ్ లో విక్కీ కౌశ‌ల్ స‌క్సెస్ పుల్ గా దూసుకుపోతున్న హీరో. స‌రైన క‌థ‌ల్ని ఎంచుకుంటూ సీనియ‌ర్ హీరోల్నే త‌ల‌ద‌న్నుతున్నాడు. బ్యాడ్ న్యూజ్ తో ఇటీవలే మ‌రో స‌క్సెస్ ఖాతాలో వేసుకున్నాడు. ఏడాది ముగింపులో పీరియాడిక్ ఎంట‌ర్ టైన‌ర్ `ఛావా`తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలు సెట్స్ లో ఉండ‌గానే కొత్త చిత్రాల‌కు అగ్రిమెంట్ చేసుకుంటున్నాడు. ఇటీవ‌లే మ‌డాక్ ఫిలింస్ అధినేత దినేష్ విజ‌న్ తో మ‌రో ఒప్పందం చేసుకున్నాడు.

అమర్ కౌశిక్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. తాజాగా ఆ చిత్ర యూనిట్ ఊహించ‌ని స‌ర్ ప్రైజ్ ఇచ్చింది. విక్కీ కౌశ‌ల్ న్యూ లుక్ సహా చిత్ర టైటిల్ ని రివీల్ చేసారు. టైటిల్ ప్ర‌క‌ట‌న న్యూలుక్ తో ఇది అత‌డి కెరీర్ లోనే భారీ బ‌డ్జెట్ చిత్రంగా తెలుస్తోంది. ఈ త్ర‌యంలో చిత్రానికి `మహావతార్` అనే టైటిల్ ని ప్ర‌క‌టించారు. అలాగే చిరంజీవి ప‌ర‌శ‌రాముడి పాత్ర‌లో విక్కీ కౌశ‌ల్ క‌నిపించ‌నున్నాడు. దానికి సంబంధించిన ప్రీ లుక్ రిలీజ్ అయింది.


లుక్ అదిరిపోయింది. విక్కీ కౌశ‌ల్ లుక్ ఆద్యంతం ఆ శివుడినే పోలింది. లాంగ్ హెయిర్ ...ఉంగ‌రాలు తిరిగిన జుట్టు.. న‌డి నెత్తిన జుట్టు ముడి..క‌ళ్ల‌లో ఆ రౌద్రం..బాడీ షేప్ ప్ర‌తీది విక్కీ కౌశ‌ల్ ని కొత్త‌గా ప్ర‌జెంట్ చేస్తుంది. భ‌ళ్లుమంటోన్న ఆకాశం వైపు చూస్తూ....ముంద‌ర త్రిశూల్ ఆయుధం చూస్తుంటే ఆ పాత్ర ఎంతో శ‌క్తివంత‌మైంద‌ని తెలుస్తోంది. అభిమానుల‌కు గూస్ బంప్స్ తీసుకొచ్చే పోస్ట‌ర్ అనే చెప్పాలిది. ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ నెట్టింట వైర‌ల్ గా మారింది.

దీనికి సంబంధించి కొన్ని పోస్టులు వైర‌ల్ అవుతున్నాయి. `దినేష్ విజన్ ధర్మ యోధుని కథకు జీవం పోసిన‌ట్లే ఉంది. అయితే ఈ ప్రాజెక్ట్ ఇంకా సెట్స్ కివెళ్ల‌లేదు. ఇది ప్రీలుక్ మాత్ర‌మే. మేకర్స్ ఈ ప్రాజెక్ట్ నవంబర్ 2025లో ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. అన్ని ప‌నులు పూర్తి చేసి 2026 క్రిస్మ‌స్ కానుక‌గా రిలీజ్ చేయాల‌ని స‌న్నాహాలు చేస్తున్నారు. విక్కీ కౌశ‌ల్ స‌హా మ‌డాక్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్లాన్ చేస్తోంది. సినిమాకి భారీగానే బ‌డ్జెట్ కేటాయిస్తున్న‌ట్లు తెలుస్తోంది. కెరీర్ ప‌రంగా విక్కీ కౌశ‌ల్ ఓ ప్లానింగ్ ప్ర‌కారం ముందుకెళ్తున్నాడు. ఇప్పుడున్న యంగ్ హీరోల్లో విక్కీ కౌశ‌ల్ వేగంగా 1000 కోట్ల క్ల‌బ్ లో చేరే హీరోగా ఛాన్స్ ఉంది.

Tags:    
  • Mahavatar 
  • Vickykaushal 
  • Amarkaushik 
  • Dineshvijan 
  • Maddockfims 
  • Mahavatarfirstlooks 
  • ChiranjeeviParasurama 
  • Chhava 
  • Stree2 
  • Bollywood 
  • Filmindustry 

Similar News

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

మరిచిపోతున్న సినిమాకి హంగులు ఎందుకు..!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS