సారా స్టార్ హీరోయిన్స్‌ను సైడ్ చేసిందా?
చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన సారా, రీసెంట్ గా ధురంధర్ తో మరింత గుర్తింపు పొందింది.;
భారతీయ సినీ పరిశ్రమలో మరో ప్రతిష్టాత్మక బయోపిక్ చుట్టూ ఆసక్తికరమైన చర్చ మొదలైంది. లెజెండరీ నటి మధుబాల జీవితం ఆధారంగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్‌లో యువ నటి సారా అర్జున్ పేరు ప్రధానంగా వినిపించడం, పరిశ్రమలోనే కాకుండా అభిమానుల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఈ పాత్ర కోసం జరిగిన పోటీ.. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌కు మరింత హైప్‌ను తెచ్చింది.
ఈ బయోపిక్ కోసం తొలుత పలువురు ప్రముఖ నటీమణుల పేర్లు పరిశీలనలోకి వచ్చినట్లు సమాచారం. అందులో సాయి పల్లవి, కియారా అద్వానీ పేర్లు బలంగా వినిపించాయి. వీరిద్దరూ తమదైన శైలి, నటనతో ప్రేక్షకాదరణ పొందిన వారే. అయితే, చివరకు ఈ కీలక పాత్రకు సారా అర్జున్‌ను ఎంపిక చేసినట్లు వార్తలు రావడం ఆసక్తికరంగా మారింది. టాప్ హీరోయిన్స్ మధ్య జరిగిన ఈ రేస్‌లో సారా ముందుకు రావడం, ఆమె కెరీర్‌లో పెద్ద మలుపుగా చూడవచ్చు.
చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన సారా, రీసెంట్ గా ధురంధర్ తో మరింత గుర్తింపు పొందింది. ఆ సినిమాతో వచ్చిన మైలేజ్ ఆమెకు ఈ భారీ అవకాశాన్ని తెచ్చిపెట్టిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవైపు కెరీర్ టర్నింగ్ పాయింట్‌గా నిలిచే అవకాశం కాగా, మరోవైపు ఇది ఆమెకు పెద్ద పరీక్ష కూడా. ఇక ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరో మెయిన్ ఎట్రాక్షన్, దాని క్రియేటివ్ టీమ్. జస్మీత్ కె రీన్ దర్శకత్వంలో, ప్రముఖ దర్శక నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ నిర్మాణంలో సినిమా తెరకెక్కనుండటం విశేషం. భన్సాలి సినిమాలకు ఉండే విజువల్ గ్రాండియర్, భావోద్వేగ గాఢత ఈ బయోపిక్‌కి కూడా ఉంటుందని అంతా భావిస్తున్నారు.
ఇటీవలి కాలంలో భారతీయ సినిమాల్లో బయోపిక్స్‌కు మంచి డిమాండ్ ఏర్పడింది. నిజ జీవిత కథలను, ముఖ్యంగా సినీ లెజెండ్స్ జీవితాలను తెరపైకి తీసుకురావడంలో డైరెక్టర్లు ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మధుబాల జీవితం ఆధారంగా సినిమా రావడం మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఆమె అందం, మిస్టరీ, వ్యక్తిగత జీవితంలోని విషాదం.. అన్నీ కలిసిన కథ కావడంతో, ఇదొక ఎమోషనల్ జర్నీగా ఉండే అవకాశం ఉంది.
అయితే, ఈ కాస్టింగ్‌పై సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. “మధుబాల పాత్రకు సారా సరిపోతుందా?” అనే ప్రశ్న సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఒకవైపు ఆమెకు వచ్చిన అవకాశాన్ని ప్రశంసిస్తున్నవారు ఉంటే, మరోవైపు ఈ ఐకానిక్ పాత్రకు అవసరమైన గ్రేస్, స్క్రీన్ ప్రెజెన్స్‌ను సారా అందించగలదా అనే చర్చ కూడా సాగుతోంది. ఈ మూవీ విషయంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ, ఈ వార్తలతోనే సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.