మారెమ్మ అంటున్న మాధవ్.. లుక్కు అదిరింది..!
మాధవ్ కూడా తన ఫస్ట్ సినిమాతోనే ఆడియన్స్ లో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయాలని చూస్తున్నాడు.;
మాస్ మహారాజ్ రవితేజ ఫ్యామిలీ నుంచి మాధవ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. రవితేజ సోదరుడు రఘు తనయుడు మాధవ్ లీడ్ రోల్ లో వస్తున్న సినిమాకు మారెమ్మ అనే టైటిల్ లాక్ చేశారు. ఈ టైటిల్ పోస్టర్ లో రఫ్ లుక్ తో మాధవ్ ఇంప్రెస్ చేశాడు. వెనక ఎద్దు.. దాని ముందు రఫ్ లుక్ తో మాధవ్ తో మారెమ్మ పోస్టర్ ఇంప్రెస్ చేసింది.
మాస్ లుక్ తో మారెమ్మ ఫస్ట్ లుక్ అదిరిపోయింది. మారెమ్మ సినిమాను మచల నాగరాజు డైరెక్ట్ చేస్తున్నారు. రూరల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ మూవీని మయూర్ రెడ్డి బండారు నిర్మిస్తున్నారు. మారెమ్మ సినిమాలో మాధవ్ కి జతగా దీప బాలు నటిస్తుంది. మాధవ్ ఫస్ట్ లుక్ చూస్తే రవితేజ ఫ్యామిలీ హీరో కూడా ఆయన పంథాలో మాస్ మూవీస్ తోనే వస్తున్నాడని అనిపిస్తుంది.
మాధవ్ కూడా తన ఫస్ట్ సినిమాతోనే ఆడియన్స్ లో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయాలని చూస్తున్నాడు. ఇంట్లో స్వయంగా ఎదిగిన స్టార్ రవితేజ ఉన్నాడు కాబట్టి సినిమా పట్ల ఆయన చూపించే కమిట్మెంట్ మాధవ్ కూడా తెలుసుకుంటే కచ్చితంగా అతను కూడా మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకునే ఛాన్స్ ఉంటుంది.
మారెమ్మ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఐతే పోస్టర్ కలర్ ఇంకా బ్యాక్ డ్రాప్ చూస్తుంటే మాత్రం ఈ సినిమా కచ్చితంగా మాస్ ఆడియన్స్ కి ఒక మంచి మాస్ ఫీస్ట్ అందిచేలా ఉందని చెప్పొచ్చు. మారెమ్మ అంటూ ఒక పవర్ ఫుల్ టైటిల్ తో వస్తున్న మాధవ్ తొలి సినిమాతో ఏమేరకు ప్రేక్షకులను మెప్పిస్తాడు అన్నది చూడాలి.
ఎంత వెనుక రవితేజ ఉన్నా కూడా మాధవ్ తన టాలెంట్ చూపించాల్సిన అవసరం ఉంది. సో ఆడియన్స్ కు నచ్చే కంటెంట్.. వాళ్లని మెప్పించే టాలెంట్ ఉంటే ఎలాంటి నేపథ్యం ఉన్నా లేకపోయినా ఆదరణ లభిస్తుంది. సో ఈ విషయంలో చాలామంది ఇప్పటికే ప్రూవ్ చేయబడ్డారు. మాధవ్ విషయంలో రవితేజ సపోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి అతను కాస్త ఎఫర్ట్ పెట్టి ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయగలిగితే ఇండస్ట్రీలో హీరోగా మంచి మార్కులు కొట్టే అవకాశం ఉంటుంది.