ఫ్యాన్స్‌కి కిక్‌ ఇచ్చే 'లవ్ & వార్’ ఫస్ట్ లుక్‌

బాలీవుడ్‌ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'లవ్‌ అండ్‌ వార్‌' మూవీ షూటింగ్‌ దాదాపుగా పూర్తి అయినట్లు తెలుస్తోంది.

Update: 2026-09-24 09:23 GMT

బాలీవుడ్‌ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'లవ్‌ అండ్‌ వార్‌' మూవీ షూటింగ్‌ దాదాపుగా పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు సినిమా నుంచి ఎన్నో అప్‌డేట్స్ వస్తూ వచ్చాయి. ఈ సినిమాలో రణబీర్ కపూర్‌, విక్కీ కౌశల్‌, ఆలియా భట్‌లు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇద్దరు యంగ్‌ స్టార్‌ హీరోలు, ఒక స్టార్‌ హీరోయిన్‌ ఈ సినిమాలో నటిస్తున్న నేపథ్యంలో మొదటి నుంచి అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందని దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ మరోసారి నిరూపించారు. సంజయ్‌ లీలా భన్సాలీ సినిమాలంటే గ్రాండ్‌గా ఉంటాయి అని ప్రతి ఒక్కరి నమ్మకం, ఆ నమ్మకంను నిలబెడుతూ మరోసారి సంజయ్‌ లీలా భన్సాలీ అద్భుతమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఈ సినిమాతో రెడీ అవుతున్నాడు అనడంలో సందేహం లేదు.




 


లవ్ & వార్ సినిమాతో రణబీర్‌ కపూర్‌...

లవ్ & వార్ సినిమా నుంచి రణబీర్ కపూర్‌ ఫస్ట్‌ లుక్‌ను మేకర్స్ రివీల్‌ చేయడంతో ఫ్యాన్స్‌ సర్‌ప్రైజ్ అవుతున్నారు. ఓపెన్ టాప్‌ కారులో స్టైలిష్ లుక్‌లో రణబీర్‌ వెళ్తున్న ఈ స్టిల్‌ ఆకట్టుకుంటుంది. చేతికి గాయంతో ఒక చేయితో డ్రైవ్‌ చేస్తూ రణబీర్‌ కపూర్‌ ఈ ఒక్క స్టిల్‌లోనే చాలా మ్యాటర్‌ చెబుతున్నట్లుగా ఉందని, ఈ సినిమాలో ప్రేమ ఏ స్థాయిలో ఉంటుందో యాక్షన్‌ అదే స్థాయిలో ఉంటుందని ఈ పోస్టర్‌ ను చూస్తే అర్థం అవుతుందని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో రణబీర్‌ కపూర్‌ మూవీ అనగానే ఒక వర్గం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారందరినీ కచ్చితంగా సంతృప్తి పరచే విధంగా సినిమా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులతో పాటు, బాలీవుడ్‌ వర్గాల వారు, మీడియా సర్కిల్స్ వారు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

సంజయ్‌ లీలా భన్సాలీ సినిమాతో...

సంజయ్‌ లీలా భన్సాలీ బ్రాండ్‌ ఇమేజ్‌కి తగ్గట్లుగానే సినిమా ఉంటుంది. ఈ సినిమాను జనవరి 21, 2027న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేసేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి. బాలీవుడ్‌తో పాటు, ఇతర భాషల్లోనూ సినిమాను విడుదల చేసే విధంగా మేకర్స్ ప్లాన్‌ చేస్తున్నారు. ఆలియా భట్‌, ఇతర నటీనటులు సౌత్‌లోనూ మంచి క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు. కనుక ఈ సినిమా కచ్చితంగా సౌత్‌లో మంచి బిజినెస్‌ చేసే అవకాశాలు ఉన్నాయి అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్‌. సంజయ్‌ లీలా భన్సాలీ మూవీకి ఓవర్సీస్‌లోనూ మంచి మార్కెట్‌ ఉంటుంది. అందుకే ఈ సినిమా అక్కడ కూడా రికార్డ్‌ స్థాయి వసూళ్లతో నిర్మాతలకు, బయ్యర్లకు లాభాలను తెచ్చి పెడుతుందని అంటున్నారు. సోషల్‌ మీడియాలో ఇప్పటికే లవ్ & వార్ సినిమాపై హైప్‌ విపరీతంగా క్రియేట్‌ కావడంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఆలియా భట్‌, విక్కీ కౌశల్‌ జంటగా...

రణబీర్ కపూర్‌ అభిమానులతో పాటు సగటు ఫిల్మ్‌ ఫ్యాన్స్‌కి కిక్‌ ఇచ్చే విధంగా ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సాదారణంగానే రణబీర్ కపూర్ కటౌట్‌ కి ఫ్యాన్స్ ఫిదా అవుతూ ఉంటారు. ఈసారి సరికొత్త లుక్‌లో కనిపిస్తున్న నేపథ్యంలో లవ్ & వార్ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఆలియా భట్‌ లుక్‌ మరియు విక్కీ కౌశల్‌ పోస్టర్స్‌ ను విడుదల చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బాలీవుడ్‌లో గత కొంత కాలంగా సరైన హిట్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఆ హిట్‌ ఈ సినిమాతో దక్కడం ఖాయం అంటూ రణబీర్‌ కపూర్ ఫ్యాన్స్ నమ్మకంగా చెబుతున్నారు. వచ్చే ఏడాది బాలీవుడ్‌కి ఈ సినిమాతో సూపర్‌ స్టార్ట్‌ దక్కేనా అనేది చూడాలి. రణబీర్‌ కపూర్‌ అంతకు ముందు రామాయణ పార్ట్‌ 1 తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రామాయణ తర్వాత చాలా తక్కువ గ్యాప్‌లోనే లవ్ & వార్ సినిమాతో రాబోతున్న నేపథ్యంలో పాన్ ఇండియా రేంజ్‌లో సినిమాకు బజ్‌ క్రియేట్‌ కావడం ఖాయం.

Tags:    

Similar News